సీనియర్‌ జర్నలిస్టు నాగేశ్వర్‌రావుకు డాక్టరేట్‌  | Senior Journalist Nageshwar Rao Been Awarded Doctorate By Osmania University | Sakshi
Sakshi News home page

సీనియర్‌ జర్నలిస్టు నాగేశ్వర్‌రావుకు డాక్టరేట్‌ 

Aug 30 2022 12:48 AM | Updated on Aug 30 2022 2:53 PM

Senior Journalist Nageshwar Rao Been Awarded Doctorate By Osmania University - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ జర్నలిస్టు నాగేశ్వర్‌రావుకు ఉస్మానియా విశ్వవిద్యాలయం డాక్టరేట్‌ ప్రకటించింది. ఆధునిక తెలుగు సాహిత్యం–లౌకిక వాదం అంశంపై సమర్పించిన సిద్ధాంత గ్రంథానికి ఆయనకు ఈ డాక్టరేట్‌ లభించింది. ఆచార్య చంద్రశేఖర్‌రెడ్డి పర్యవేక్షణలో నాగేశ్వర్‌రావు సిద్ధాంత గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించారు.

రంగారెడ్డి జిల్లా కోహెడ గ్రామానికి చెందిన అండాలు, నర్సింహ దంపతులకు 1964లో జన్మించిన నాగేశ్వర్‌రావు.. గత 33 ఏళ్లుగా పలు దినపత్రికల్లో పనిచేస్తూ 6 దేశాల్లో పర్యటించారు. ప్రారంభం నుంచి వార్త దినపత్రికలో పని చేస్తున్న ఆయన ప్రస్తుతం స్టేట్‌ బ్యూరో చీఫ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నాగేశ్వర్‌రావుకు ఓయూ డాక్టర్‌ డిగ్రీ లభించడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement