వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్శిటీ తమ సిబ్బందిలో ఒకరికి శుక్రవారం గౌరవ డాక్టరేట్ డిగ్రీతో సత్కరిచింది. అయితే ఆ ఉద్యోగి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే! డాక్టరేట్ అందుకున్న ఉద్యోగి మనిషి కాదు కుక్క. దాని పేరు మూస్ డేవిస్. అయితే కరోనా కాలంలో ఆన్‌లైన్‌లో 2020లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన వారికి గ్రాడ్యుయేషన్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో 8 ఏళ్ల మూస్‌కు వెటర్నర్ మెడిసిన్‌లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ విషయాన్ని యూనివర్శిటీ పాలకమండలి ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ మూస్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ యూనివర్శిటీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో కార్యక్రమాల్లో తన సేవలను అందిచినందుకుగాను మూస్ సేవలను గుర్తించి డాక్టరేట్ ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు చెప్పారు. కాగా ఈ లాబ్రడార్ రిట్రీవర్ కుక్క 2014 నుంచి యూనివర్శిటీలో ఉందని, కుక్ కౌన్సెలింగ్ కేంద్రంలో పనిచేస్తున్న నాలుగు శునకాలలో ఇది ఒకటి అని తెలిపారు. (తిమింగలాన్ని కాపాడిన వ్యక్తికి జరిమానా)
‘మూస్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ యూనివర్శిటీ క్యాంపస్‌లో యాక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే మానసిక అనారోగ్యంతో బాధపడే విద్యార్థులను ఉల్లాసంగా ఉంచుతుంది. క్యాంపస్ విద్యార్థులంతా మూస్‌ను ఇష్టపడతారు’ యూనివర్శిటీ యానిమల్ అసిస్టెన్స్ థెరపి ప్రొగ్రామ్ సలహాదారుడు డేవిస్ పేర్కొన్నాడు. ఆయన మూస్ ఆరోగ్య బాధ్యతను చుసుకుంటారు. ‘‘డాక్టర్ మూస్ ఇటీవల ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయం చేస్తుంటుంది. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా మూస్‌కు ప్రస్తుతం రేడియేషన్, కీమోథెరపీతో పాటు ఇతర చికిత్స జరుగుతుంది. అయినప్పటికీ ఎప్పుడు ఉత్సాహంగా సాధారణ ఆరోగ్యవంతమైన జీవిలా కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నాడు. మూస్ వర్జీనియా టెక్ యూనివర్శిటీలో తన ఆరు సంవత్సరాలలో 7,500కు పైగా కౌన్సెలింగ్ సెషన్లలో, 500లకు పైగా ట్రీచ్ ఈవెంట్స్ సహాయం చేసింది. ఖాళీ సమయంలో ఇది ఈత, టగ్-ఆఫ్-వార్‌లు ఆడానికి ఇష్టపడుతుంది. (ఇలా మాస్కు తీయకుండా తినేయండి)
Comments
Please login to add a commentAdd a comment