Virginia Tech researchers
-
ఆక్సిజన్ అంతమైన వేళ...
టొరంటో: దాదాపు 50 కోట్ల ఏళ్ల క్రితం. భూమిపై ఆక్సిజన్ ఉన్నట్టుండి ఎవరో పీల్చేసినట్టుగా సంపూర్ణంగా ఆవిరైపోయింది. దాంతో చాలా జీవరాశులూ ఉన్నపళంగా కళ్లు తేలేశాయి. ఉనికినే కోల్పోయాయి. భూగోళంపై తొలి జీవ వినాశనం జరిగిన తీరు ఇదేనని శాస్త్రవేత్తలు తాజాగా కనిపెట్టారు. భూమిపై తొలి జీవ వినాశనం జరిగిన తీరును అర్థం చేసుకునేందుకు, ఫలితంగా పూర్తిగా నశించిపోయిన జీవరాశులు ఎలా ఉండేవో తెలుసుకునేందుకు పరిశోధకులు శిలాజ ముద్రలను అధ్యయనం చేశారు. ఆ వినాశనమే చాలా జంతు జాతులు ఇప్పుడున్న రూపాల్లో వికసించేందుకు పురిగొల్పి ఉంటుందని వారు భావిస్తున్నారు. ఆక్సిజన్ ఏమైపోయింది? ఇందుకు ఫలానా సంఘటనే కారణమని కచ్చితంగా చెప్పలేకపోయినా, అది అప్పట్లో జరిగిన అనేకానేక పరిణామాల ఫలస్వరూపం అయ్యుండొచ్చన్నది పరిశోధక బృందం అభిప్రాయం. ‘‘అగ్నిపర్వతాల పేలుడు, భూ ఫలకాల్లో భారీ కదలికలు, గ్రహశకలాలు ఢీకొనడం వంటివాటి వల్ల భూమిపై ఆక్సిజన్ బాగా తగ్గిపోవడమో, లుప్తం కావడమో జరిగి ఉంటుంది’’ అని అధ్యయనానికి సారథ్యం వహించిన వర్జీనియా టెక్ కాలేజ్ ఆఫ్ సైన్స్‌కు చెందిన పరిశోధకుడు స్కాట్ ఇవాన్స్ అభిప్రాయపడ్డారు. ‘‘గ్లోబల్ వార్మంగ్ వంటివి ఆక్సిజన్ స్థాయిలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఇదిలాగే కొనసాగితే మరో సామూహిక జీవ హననం దగ్గర్లోనే ఉంది’’ అని హెచ్చరించారు. -
చిన్నసైజు తుంపర్లతోనూ కరోనా
సాక్షి, హైదరాబాద్: గాలి లేదా బయటి వాతావరణంలో ఉండిపోయే చిన్న తుంపర్లతోనూ కరోనా వైరస్ వ్యాప్తికి అవకాశాలున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్ పొగ మాదిరిగా వ్యాప్తి చెందే సూక్ష్మస్థాయిలో ఉండే తుంపర్లు ఒకసారి వెలువడ్డాక ఏవిధంగా ప్రభావం చూపుతున్నాయన్న అంశాన్ని పరిశీలిస్తున్నారు. వైరస్ సోకిన వ్యక్తి నుంచి దగ్గు, తుమ్ము, ముక్కు చీదడం, పాటలు పాడటం, అరవడం,మాట్లాడడం, గాలి పీల్చుకోవడం, వదలడం వంటి చర్యల ద్వారా వివిధ సైజుల్లో తుంపర్లు వెలువడుతున్నాయి. ఈ తుంప ర్లు ఏ సైజులో ఉంటే ఎలా ప్రభావితం చేస్తాయి? ఎంత దూరం, ఎలా పయనిస్తుంది తదితర అంశాలపై పరిశోధకులు దృష్టి కేంద్రీకరించారు. పెద్దసైజు తుంపర్లు ముక్కు,నోరు,కళ్లపై పడినపుడు లేదా గాలిరూపంలో పీల్చుకున్నపుడు ఇతరులకు ఇన్ఫెక్షన్ సోకుతుందని గతంలోనే పరిశోధకులు వెల్లడించారు. అయితే ఇప్పుడు చిన్న సైజు తుంపర్లు, సిగిరెట్‌పొగ మాదిరిగా వ్యాప్తిచెందే తుంపర్లు కొన్ని గంటల వరకు గాలిలోనే ఉండిపోతాయని చెబుతున్నారు. ఇవి గదంతా వ్యాపించడంతో పాటు గాలి, వెలుతురు తక్కువ ఉన్నచోట్ల మరింత అధికమవుతా యంటున్నారు. ‘మీసిల్స్’ మాదిరిగా ఇవి వ్యాపిస్తాయని, ‘ఏరోసొల్స్’గా పిలుస్తున్న ఈ చిన్నసైజు తుంపర్లు ఆరు అడుగులకు మించి వ్యాపించే అవకాశాలు న్నాయని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల వ్యక్తుల మధ్య భౌతిక దూరం 6 అడుగుల కంటే ఎక్కువగా ఉంటే మంచిదని వర్జీనియా టెక్ వర్సిటీ పరిశోధకులు లిన్సేమార్ తెలిపారు. ఏరోసొల్స్ పార్టికల్స్ సమీపంలో ఉన్నవారిపై అధిక ప్రభావం చూపుతాయని, అతిదగ్గరగా ఉన్న వారిపై ఎక్కువ ప్రమాదం కలగజేసే అవకాశముంది అని హెచ్చరిస్తున్నారు. సీడీసీ పరిశీలన దగ్గినపుడు, తుమ్మినపుడు వెలువడే పెద్ద సైజు తుంపర్లతోనే వైరస్ సోకుతోందని యూఎస్‌లోని సెంటర్స్‌ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డిప్యూటీ డైరెక్టర్ డా.జె బట్లర్ పేర్కొన్నారు. అయితే ఎక్కువగా ఏరోసొల్స్ కూడా ఇన్ఫెక్షన్లకు దారితీస్తున్నట్టుగా లిన్సేమార్ చెబుతున్నారు. వైరస్ ఉన్న ఒక్క ‘సూపర్ స్ప్రెడర్’నుంచి ఒకేఒక్కసారి కలుసుకున్నపుడే లెక్కకు మించిన సంఖ్యలో ఇతరులకు వ్యాప్తి చెందినట్టు లిన్సేతో పాటు ఇతర పరిశోధకులు కూడా వెల్లడించారు. కొన్ని నెలల క్రితం సామూహిక ప్రార్థనలకు సంబంధించిన రిహార్సల్ నిర్వహించినపుడు కరోనా లక్షణాలున్న వ్యక్తినుంచి 52మందికి అది సోకడమే కాకుండా వారిలో ఇద్దరు మరణించినట్టుగా పరిశోధకులు తెలి పారు. చైనాలోనూ గాలి, వెలుతురు తక్కువ ఉన్న ఓ రెస్టారెంట్ లో ఐదుగురికి కరోనా సోకినట్టు, ఒక బస్సులో ప్రయాణిస్తున్న ఒకవ్యక్తి నుంచి వేర్వేరుచోట్ల కూర్చున్న 23 మంది ప్రయాణికులకు వైరస్ సోకినట్టు వెల్లడించారు. -
ఈ కుక్కకు అరుదైన ఘనత!
వర్జీనియా: అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్శిటీ తమ సిబ్బందిలో ఒకరికి శుక్రవారం గౌరవ డాక్టరేట్ డిగ్రీతో సత్కరిచింది. అయితే ఆ ఉద్యోగి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే! డాక్టరేట్ అందుకున్న ఉద్యోగి మనిషి కాదు కుక్క. దాని పేరు మూస్ డేవిస్. అయితే కరోనా కాలంలో ఆన్లైన్లో 2020లో గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసిన వారికి గ్రాడ్యుయేషన్ వేడుకను నిర్వహించింది. ఈ వేడుకలో 8 ఏళ్ల మూస్కు వెటర్నర్ మెడిసిన్‌లో గౌరవ డాక్టరేట్ లభించింది. ఈ విషయాన్ని యూనివర్శిటీ పాలకమండలి ఓ ప్రకటనలో పేర్కొంది. డాక్టర్ మూస్ అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ యూనివర్శిటీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయపడటంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఎన్నో కార్యక్రమాల్లో తన సేవలను అందిచినందుకుగాను మూస్ సేవలను గుర్తించి డాక్టరేట్ ఇచ్చినట్లు వర్సిటీ అధికారులు చెప్పారు. కాగా ఈ లాబ్రడార్ రిట్రీవర్ కుక్క 2014 నుంచి యూనివర్శిటీలో ఉందని, కుక్ కౌన్సెలింగ్ కేంద్రంలో పనిచేస్తున్న నాలుగు శునకాలలో ఇది ఒకటి అని తెలిపారు. (తిమింగలాన్ని కాపాడిన వ్యక్తికి జరిమానా) ‘మూస్ అనారోగ్యంతో ఉన్నప్పటికీ యూనివర్శిటీ క్యాంపస్‌లో యాక్టివ్‌గా పనిచేస్తుంది. అయితే మానసిక అనారోగ్యంతో బాధపడే విద్యార్థులను ఉల్లాసంగా ఉంచుతుంది. క్యాంపస్ విద్యార్థులంతా మూస్‌ను ఇష్టపడతారు’ యూనివర్శిటీ యానిమల్ అసిస్టెన్స్ థెరపి ప్రొగ్రామ్ సలహాదారుడు డేవిస్ పేర్కొన్నాడు. ఆయన మూస్ ఆరోగ్య బాధ్యతను చుసుకుంటారు. ‘‘డాక్టర్ మూస్ ఇటీవల ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ విద్యార్థులకు, సిబ్బందికి సహాయం చేస్తుంటుంది. ఈ వ్యాధి చికిత్సలో భాగంగా మూస్కు ప్రస్తుతం రేడియేషన్, కీమోథెరపీతో పాటు ఇతర చికిత్స జరుగుతుంది. అయినప్పటికీ ఎప్పుడు ఉత్సాహంగా సాధారణ ఆరోగ్యవంతమైన జీవిలా కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నాడు. మూస్ వర్జీనియా టెక్ యూనివర్శిటీలో తన ఆరు సంవత్సరాలలో 7,500కు పైగా కౌన్సెలింగ్ సెషన్లలో, 500లకు పైగా ట్రీచ్ ఈవెంట్స్ సహాయం చేసింది. ఖాళీ సమయంలో ఇది ఈత, టగ్-ఆఫ్-వార్లు ఆడానికి ఇష్టపడుతుంది. (ఇలా మాస్కు తీయకుండా తినేయండి) View this post on Instagram Moose is so happy to serve the Hokie Nation, sharing smiles, tail wags, and his calming presence. On Friday, he humbly accepted an honorary doctorate from @vamdvetmed. We often say that we will never know Moose’s full impact. He is beloved by so many. The story of his DOG-torate has been making a splash nationally and internationally, and we are thrilled to know that Moose’s story is bringing hope and smiles to people all over the world. Moose leads his junior colleagues, Wagner, Derek, and Carson as the therapy dog team continues to serve at VT. #utprosim . Congratulations, Dr. Moose! See links in bio. @virginia.tech @vtmdvetmed @studentsatvt @cookcounselingcenter @vtrecsports @hokiewellness @hokiesports @servicedogsva @guidingeyes @camilleschrier @the_hokiebird @vtgrowley #hokies @hokiepets @huffpost @goodmorningamerica @hodakotb @todayshow @latenightseth @fallontonight @theellenshow @colbertlateshow A post shared by Moose, Derek, Wagner & Carson (@vttherapydogs) on May 17, 2020 at 8:29am PDT -
పట్టణ పక్షులకు దూకుడెక్కువ!
వాషింగ్టన్: నివసించే ప్రాంతాన్ని బట్టి మనస్తత్వాల్లో, భావాల్లో మార్పులు ఉంటాయని అందరికి తెలిసిన విషయమే. పట్టణాల్లో ఉండే వారు ఒకలా, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వారు మరోలా ఉండడం మనం గమనిస్తునే ఉంటాం. ఇది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదు.. పక్షులకూ వర్తిస్తుందంటున్నారు పరిశోధకులు. పట్టణాల్లో ఉండే పక్షులు గ్రామాల్లో ఉండే వాటికంటే కోపంగానూ, దూకుడు స్వభావంతో ఉంటాయని తాజా అధ్యయనంలో తేలింది. జనసాంద్రత పక్షుల స్వభావాలపై ప్రభావం చూపుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. పట్టణాల్లో ఉండే పక్షులకు ఎక్కువ వనరులు ఉన్నప్పటికీ అవి నివసించేందుకు స్థలం తక్కువ ఉండడమే వాటి దూకుడు స్వభావానికి కారణమని వర్జినీయా యూనివర్సిటీకి చెందిన స్కాట్ డేవిస్ అనే పరిశోధకుడు తెలిపారు. పిచ్చుకల స్వరాల్లో తేడాలపై పరిశోధనలు చేసిన అనంతరం శాస్త్రవేత్తలు ఈ విషయాన్ని వెల్లడించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివసించే పిచ్చుకల స్వరంలో స్పష్టమైన తేడాలను వారు గమనించారు.