
విజయ నిర్మలకు గౌరవ డాక్టరేట్
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించిన విజయ నిర్మల మరో ఘనత సాధించారు. నటిగా, దర్శకురాలిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ యూకే లోని రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. 1957లో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగానూ తన మార్క్ చూపించి ఎన్నో విజయాలను నమోదు చేసింది.