vijaya niramala
-
‘మా అమ్మ బయోపిక్‌కి అనుమతి లేదు’
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె కుమారుడు, సీనియర్ నటుడు నరేష్ స్పందించారు. విజయనిర్మల జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘మా అమ్మ బయోపిక్ తెరకెక్కించడానికి ఎవరికి హక్కులు ఇవ్వలేదు. ఆమె బతికున్నప్పుడే తన బయోపిక్కు సంబంధించి స్క్రిప్ట్ తయారు చేయమని నన్ను కోరింది. అంతలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. బయోపిక్కు సంబంధించి స్క్రిప్ట్ తయారు చేయడానికి నాకు కనీసం ఏడాది సమయం పడుతుంది. (మరో బయోపిక్‌లో..?) మా అమ్మ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను బయోపిక్‌లో చూపించాలి. అదేవిధంగా మా కుటుంబ సభ్యుల అనుమతి కూడా తీసుకోవాలి. అప్పుడే విజయ నిర్మల బయోపిక్ తెరకెక్కుతుంది. ఇప్పట్లో ఈ బయోపిక్ నిర్మాణం సాధ్యం కాదు, అమ్మ అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాలి’ అని నరేష్ వెల్లడించారు. (విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం) విజయ నిర్మల గతేడాది జూన్‌లో కన్నుమూశారు. ఇక ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించారు. కాగా విజయ నిర్మల పాత్రలో కథానాయిక కీర్తీ సురేష్ నటించనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. -
విజయనిర్మల మృతికి చిరు, బాలయ్య సంతాపం
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ నటి, దర్శక నిర్మాత విజయనిర్మల మరణంపై తెలుగు సినిమా పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె మృతికి సినీ రంగ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అరుదైన దర్శక నటీమణి విజయనిర్మల హఠాన్మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. విజయనిర్మల కన్నుమూయడం ఎంతో బాధాకరమని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. ‘తెలుగు సినీ పరిశ్రమలో భానుమతి తర్వాత గర్వించదగిన బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు. అంతటి ప్రతిభావంతురాలిని మనం ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేం. కృష్ణ జీవిత భాగస్వామిగా ఎప్పుడూ ఆయన పక్కన నిలబడి ఆయనకు చేదోడు వాదోడుగా ఉంటూ తన ధర్మాన్ని నెరవేరుస్తూ వచ్చారు. ఆమె లేని లోటు కృష్ణ కుటుంబానికే కాదు యావత్ తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ కృష్ణ, నరేస్లకు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’ అని సంతాప సందేశంలో చిరంజీవి పేర్కొన్నారు. ‘సినీ రంగ పరిశ్రమలో మహిళా సాధికారతను చాటిన అతి కొద్ది మంది మహిళల్లో విజయనిర్మల ఒకరు. నాన్నగారి `పాండురంగ మహత్యం` సినిమాలో కృష్ణుడిగా నటించారు. అదే ఆవిడ నటించిన తొలి తెలుగు సినిమా. బాలనటి నుంచి హీరోయిన్గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. నాన్నగారితో మారిన మనిషి, పెత్తందార్లు, నిండుదంపతులు, విచిత్ర కుటుంబం సినిమాల్లో నటించారు. అలాగే దర్శకురాలిగా 44 చిత్రాలను డైరెక్ట్ చేయడం చాలా గొప్ప విషయం. దర్శకురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్రసీమకు తీరనిలోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ అని నందమూరి బాలకృష్ణ పేర్కొన్నారు. -
మా ఆనందానికి కారణం అభిమానులే
‘‘మీరు సినిమాలు మానేసి చాలాకాలం అయ్యింది కదా! అయినా ఇంతమంది అభిమానులు మీ పుట్టినరోజు వేడుకల్ని ఇంత ఘనంగా ఎలా నిర్వహిస్తున్నారు’ అని ఓసారి నా పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న దాసరి నారాయణరావుగారు నన్ను అడిగారు. ‘వాళ్లకు నాపై ఉన్న అభిమానం, నాకు వాళ్ల మీద ఉన్న అభిమానంతోనే అంతమంది ఫ్యాన్స్ వస్తుంటారని చెప్పాను’’ అని నటి, దర్శకురాలు విజయ నిర్మల అన్నారు. దేశం నలుమూలల నుంచి వచ్చిన అభిమానుల సమక్షంలో బుధవారం హైదరాబాద్‌లో విజయనిర్మల 74వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. విజయనిర్మల మాట్లాడుతూ– ‘‘ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ నా కృతజ్ఞతలు. మీ అభిమానమే నా ఆయుష్షు. మీ అందరి మధ్య నా పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉంది’’ అన్నారు. సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ– ‘‘విజయనిర్మలగారు ‘మా’ను (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ప్రాణంగా చూసుకుంటూ ప్రతి సంవత్సరం డొనేషన్లు ఇస్తు్తన్నారు. ఈ సంవత్సరం కూడా ఇంతవరకూ ఎవ్వరూ ఇవ్వనంత డొనేషన్ ఇచ్చి తన సహృదయాన్ని చాటుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన మా ఫ్యాన్స్ అభిమానం వల్లే మేమింత సంతోషంగా ఉండగలుగుతున్నాం’’ అన్నారు. ‘‘విజయనిర్మలగారు ‘మా’ అసోసియేషన్‌పై ఎంతో ప్రేమతో ప్రతి నెలా రూ. 15,000, ‘మా’ కల్యాణ లక్ష్మి’ పథకానికి ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ ఏడాది కూడా తన 74వ పుట్టినరోజు సందర్భంగా రూ. 74,000 అసోసియేషన్‌కు అందజేశారు. ఇటీవల పుల్వామా ఘటనలో మరణించిన వీరసైనికుల కుటుంబాలకు మా కుటుంబం తరఫున లక్ష రూపాయలు అందించాం’’ అని నటుడు, విజయనిర్మల తనయుడు నరేష్ చెప్పారు. ఈ వేడుకల్లో నటి జయసుధ, నిర్మాతలు శాఖమూరి మల్లికార్జునరావు, బి.ఎ. రాజు, సురేష్ కొండేటి, ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా, నటి గీతాసింగ్ పాల్గొని విజయనిర్మలకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సూపర్‌స్టార్ కృష్ణ మహేష్ సేన జాతీయ అధ్యక్షుడు దుడ్డి రాంబాబు, ప్రధాన కార్యదర్శి టి.మల్లేష్, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన అధ్యక్షులు ఖాదర్ గోరి పాల్గొ్గన్నారు. -
విజయ నిర్మలకు గౌరవ డాక్టరేట్
-
విజయ నిర్మలకు గౌరవ డాక్టరేట్
భారతదేశంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా రికార్డ్ సృష్టించిన విజయ నిర్మల మరో ఘనత సాధించారు. నటిగా, దర్శకురాలిగా సినీ రంగానికి ఆమె చేసిన సేవలకు గానూ యూకే లోని రాయల్ అకాడమీ ఆఫ్ గ్లోబల్ పీస్ ఆమెకు గౌరవ డాక్టరేట్ ను ప్రకటించింది. 1957లో నటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆమె తరువాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విజయవంతమైన చిత్రాల్లో నటించింది. దర్శకురాలిగానూ తన మార్క్ చూపించి ఎన్నో విజయాలను నమోదు చేసింది.