‘మా అమ్మ బయోపిక్‌కి అనుమతి లేదు’ ‌ | Senior Naresh Gives Clarity Of His Mother Vijaya Nirmala Biopic | Sakshi
Sakshi News home page

‘మా అమ్మ బయోపిక్‌కి అనుమతి లేదు’ ‌

Apr 30 2020 12:02 PM | Updated on Apr 30 2020 1:58 PM

Senior Naresh Gives Clarity Of His Mother Vijaya Nirmala Biopic - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మల బయోపిక్‌ తెరకెక్కుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆమె కుమారుడు, సీనియర్‌ నటుడు నరేష్‌ స్పందించారు. విజయనిర్మల జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ‘మా అమ్మ బయోపిక్‌ తెరకెక్కించడానికి ఎవరికి హక్కులు ఇవ్వలేదు. ఆమె బతికున్నప్పుడే తన బయోపిక్‌కు సంబంధించి  స్క్రిప్ట్ తయారు చేయమని నన్ను కోరింది. అంతలోనే ఆమె అనారోగ్యానికి గురైంది. బయోపిక్‌కు సంబంధించి స్క్రిప్ట్‌ తయారు చేయడానికి నాకు కనీసం ఏడాది సమయం పడుతుంది. (మరో బయోపిక్‌లో..?)

మా అమ్మ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను బయోపిక్‌లో చూపించాలి. అదేవిధంగా మా కుటుంబ సభ్యుల అనుమతి  కూడా తీసుకోవాలి. అప్పుడే విజయ నిర్మల బయోపిక్‌ తెరకెక్కుతుంది. ఇప్పట్లో ఈ బయోపిక్‌ నిర్మాణం సాధ్యం కాదు, అమ్మ అభిమానులు మరికొన్ని రోజులు వేచి చూడాలి’ అని నరేష్‌ వెల్లడించారు. (విజయనిర్మల నా భార్య కావడం నా అదృష్టం)

విజయ నిర్మల గతేడాది జూన్‌లో కన్నుమూశారు. ఇక ఆమె అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించారు. కాగా విజయ నిర్మల పాత్రలో కథానాయిక కీర్తీ సురేష్‌ నటించనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement