బళ్లారి టౌన్ : విజయనగర శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి శనివారం ఏర్పాటు చేస్తున్న రెండవ స్నాతకోత్సవంలో సమాజంలోని వివిధ రంగాల్లో సేవలందించిన ఎనిమిది మందికి డాక్టరేట్లు ప్రదానం చేయనున్నారు.
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ గాంధేయవాది, సంఘ సంస్కర్త అన్నా హజారేకు డాక్టర్ ఆఫ్ లా, దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త జాకబ్ క్రాస్టకు డాక్టర్ ఆఫ్ లా, ముస్లిం వర్గాల సంక్షేమ అభివృద్ధికి పాటు పడుతున్నన దావణగెరెకు చెందిన సీఆర్.నాసిర్ అహ్మద్‌కు డాక్టర్ ఆఫ్ లా అండ్ సోషల్ అవార్డు, తుమకూరు విశ్వవిద్యాలయంలో కులపతిగా పని చేసి 29 పరిశోధనలు చేసి రసాయనశాస్త్రంలో పలు సేవలు అందించిన డాక్టర్ ఎస్‌ఈ శర్మకు డాక్టర్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్, సంఘ సేవకుడు సంగన బసవ స్వామికి డాక్టర్ ఆఫ్ లాను ప్రదానం చేయనున్నారు.
ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవలందించినందున ఈయనకు డాక్టరేట్ ఇవ్వనున్నారు. ప్రముఖ కన్నడ సినీ నటుడు శివరాజ్‌కుమార్‌కు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్‌ను, బళ్లారి జిల్లాకు చెందిన రంగస్థల కళాకారిణి సుభద్రమ్మ మన్సూరుకు డాక్టర్ ఆఫ్ ఆర్ట్స్ ప్రదానం చేయనున్నారు. ఈమె జిల్లాలోనే కాక ఇతర జిల్లాలోనూ పౌరాణిక నాటక ప్రదర్శనలో తనదైన శైలిలో పాత్రలు పోషించి పలు అవార్డులు దక్కించుకోవడంతో ఆమెకు ఈ డాక్టరేట్ ప్రదానం చేయనున్నారు.
విజ్ఞాన రంగం లో పేరుగాంచిన ఉడుపికి చెందిన యూఆర్. రావ్‌కు డాక్టర్ ఆఫ్ సైన్స్ అండ్ స్పేస్ రీసెర్చ్ అవార్డును అందజేయ నున్నారు. అయితే స్నాతకోత్సవానికి అన్నా హజారే గైర్హాజరవుతున్నట్లు యూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ మంజప్ప డీ.హొసమని చెప్పారు. ఆయనకు ఇటీవల ఓ చిన్న రోడ్డు ప్రమాదం జరిగినందున హాజరు కాలేకపోతున్నారని తెలిపారు.
నేడు పలువురికి డాక్టరేట్లు
Published Sat, Jun 21 2014 2:23 AM | Last Updated on Sat, Sep 2 2017 9:07 AM
Advertisement
Advertisement