- చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామన్న చికాగో స్టేట్ యూనివర్శిటీ మూసివేత
హైదరాబాద్: సీఎం చంద్రబాబునాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామని ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్శిటీ(సీఎస్‌యూ) మూతపడింది. అమెరికాలో ఇలినాస్ రాష్ట్రం నిధులను సమకూర్చకపోవడంతో యూనివర్శిటీని మూసివేస్తున్నట్లు సీఎస్‌యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో చికాగో యూనివర్శిటీ అనే పేరుతో ఒకటి.. చికాగో స్టేట్ యూనివర్శిటీ పేరుతో మరొక విశ్వవిద్యాలయం ఉన్నాయి.
ఇందులో చికాగో యూనివర్శిటీ అత్యంత ప్రసిద్దికెక్కింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేకపోవడం వల్ల చికాగో స్టేట్ యూనివర్శిటీకి అమెరికా ప్రభుత్వంగానీ.. ఇలినాస్ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి నిధులు సమకూర్చడం లేదు. ఇదేమీ పట్టని చంద్రబాబు.. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్శిటీ తనకు డాక్టరేట్ ప్రదానం చేయడానికి ముందుకొచ్చిందంటూ అప్పట్లో బడాయికి పోయారు. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయం మూతపడటంతో అప్పట్లో పోయిన బడాయిని ఇప్పుడెలా సమర్థించుకుంటారో మరి!