Chicago State University
-
బాబుకు డాక్టరేట్ ఇవ్వకుండానే..
షికాగో స్టేట్ వర్సిటీ మూసివేత సాక్షి, హైదరాబాద్: షికాగో స్టేట్ యూనివర్సిటీ (సీఎస్యూ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేయకుండానే మూతపడింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన నేపథ్యంలో వర్సిటీని మూసివేస్తున్నట్టు సీఎస్యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ ప్రకటించారు. చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నట్లు సీఎస్యూ ప్రతినిధులు గత డిసెంబర్ 18న వెల్లడించారు. వాస్తవానికి అమెరికాలో షికాగో యూనివర్సిటీ అని ఒకటి, చికాగో స్టేట్ యూనివర్సిటీ అని మరొకటి ఉన్నాయి. షికాగో యూనివర్సిటీకి ఎంతో పేరు ప్రఖ్యాతులున్నాయి. షికాగో స్టేట్ యూనివర్సిటీనే షికాగో వర్సిటీగా భావించిన చంద్రబాబు ఉప్పొంగిపోయారు. కానీ తర్వాత అసలు విషయం తెలిసింది. చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తానన్నది షికాగో స్టేట్ యూనివర్సిటీ అని. ఇది 1867లో ఒక చిన్న స్కూలుగా ప్రారంభమై క్రమేణా విశ్వవిద్యాలయ స్థాయికి చేరింది. ఇందులో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా పోటీలో లేకపోవడంతో ఈ యూనివర్సిటీ ప్రమాణస్థాయి వేయికిపైగా ర్యాంకుకు దిగజారింది. దాంతో అటు అమెరికా ప్రభుత్వం కానీ ఇటు ఇల్లినాస్ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇవ్వడం లేదు. దీంతో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ఇవేమీ తెలియకుండానే చంద్రబాబు.. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ తన పనితీరు మెచ్చి డాక్టరేట్ ప్రదానం చేయడానికి ముందుకొచ్చిందంటూ అప్పట్లో బడాయికి పోయారు. -
‘బడాయి’ బాబు.. ఇప్పుడేమంటావ్?
- చంద్రబాబుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామన్న చికాగో స్టేట్ యూనివర్శిటీ మూసివేత హైదరాబాద్: సీఎం చంద్రబాబునాయుడుకు డాక్టరేట్ ప్రదానం చేస్తామని ప్రకటించిన చికాగో స్టేట్ యూనివర్శిటీ(సీఎస్యూ) మూతపడింది. అమెరికాలో ఇలినాస్ రాష్ట్రం నిధులను సమకూర్చకపోవడంతో యూనివర్శిటీని మూసివేస్తున్నట్లు సీఎస్యూ అధ్యక్షుడు డాక్టర్ థామస్ కల్హన్ శుక్రవారం ప్రకటించారు. అమెరికాలో చికాగో యూనివర్శిటీ అనే పేరుతో ఒకటి.. చికాగో స్టేట్ యూనివర్శిటీ పేరుతో మరొక విశ్వవిద్యాలయం ఉన్నాయి. ఇందులో చికాగో యూనివర్శిటీ అత్యంత ప్రసిద్దికెక్కింది. నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేకపోవడం వల్ల చికాగో స్టేట్ యూనివర్శిటీకి అమెరికా ప్రభుత్వంగానీ.. ఇలినాస్ రాష్ట్ర ప్రభుత్వంగానీ ఎలాంటి నిధులు సమకూర్చడం లేదు. ఇదేమీ పట్టని చంద్రబాబు.. ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన యూనివర్శిటీ తనకు డాక్టరేట్ ప్రదానం చేయడానికి ముందుకొచ్చిందంటూ అప్పట్లో బడాయికి పోయారు. ఇప్పుడు ఆ విశ్వవిద్యాలయం మూతపడటంతో అప్పట్లో పోయిన బడాయిని ఇప్పుడెలా సమర్థించుకుంటారో మరి! -
ఆర్థిక సంక్షోభంలో చికాగో స్టేట్ యూనివర్సిటీ
-
బాబు భజన బృందం కిమ్మనడం లేదెందుకో?
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుపై ఈగ వాలనివ్వని భజన బృందం ఈ మధ్య కొన్ని అంశాల్లో కిమ్మనడం లేదట. ముఖ్యంగా ఎవరైనా చంద్రబాబును సునిశితంగా విమర్శించినా తట్టుకోలేక ఒంటికాలిపై లేచే అమాత్యులు కొందరు తమ నోటికి పని చెప్పడం లేదు. చంద్రబాబుపై ఏదైనా విమర్శ వచ్చినప్పుడు ప్రెస్మీట్ల మీద ప్రెస్మీట్లు పెట్టి తమ స్వామి భక్తి చాటుకునే మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటీవల బాబు డాక్టరేట్ గుట్టురట్టైనా, సోషల్ మీడియాలో షికాగో స్టేట్ యూనివర్శిటీ డాక్టరేట్ అంశం హల్చల్ చేసినా నోరు మెదపకపోవడంపై ఏమై ఉంటుందబ్బా.. అని పార్టీ శ్రేణులు గుసగుసలాడుకుంటున్నాయట. ప్రచారానికి, ఎదురుదాడికి బ్రాండ్ అంబాసిడర్లుగా ముద్రపడిన బాబు అండ్ కో మౌనముద్ర దాల్చడంపైనా రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. ఆ మధ్య చినబాబు, అమెరికా అధ్యక్షుడు ఒబామా అపాయింట్మెంట్పైనా పెద్ద చర్చ నడిచింది. ఒబామా అపాయింట్మెంట్ చినబాబుకు ఎలా దక్కిందో.. అటు సోషల్ మీడియాతో పాటు ఇటు పత్రికల్లోనూ విసృ్తత ప్రచారం నడిచింది. ఆ సమయంలోనూ తమ్ముళ్లు ఎక్కడా నోరు పారేసుకోలేదు. అంటే మౌనం అర్ధాంగీకారమే కదా.. అని పలువురు చెవులు కొరుక్కుంటున్నారట. -
డాక్టరేట్పైనా అబద్ధాలే!
-
డాక్టరేట్పైనా అబద్ధాలే!
గౌరవ డాక్టరేట్ విషయంలోనూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు ♦ ప్రఖ్యాత షికాగో యూనివర్సిటీ ఇస్తున్నట్లు ట్వీటర్లో వ్యాఖ్యలు ♦ కానీ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నది షికాగో స్టేట్ యూనివర్సిటీ ♦ ప్రతి ఏటా గుర్తింపు పునరుద్ధరణకు తంటాలు పడుతున్న సంస్థ ♦ దానికే పచ్చ పత్రికలు, తెలుగు తమ్ముళ్ల ప్రచార హంగామా సాక్షి, హైదరాబాద్: తాను విలువలున్న రాజకీయాలే చేస్తాననీ, 30 ఏళ్లుగా మచ్చలేకుండా రాజకీయం చేశాననీ నిత్యం చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల్లోని నిజమెంతో మరోసారి బట్టబయలైంది. గతంలో ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ముందుకొచ్చినా తిరస్కరించాననీ, ప్రపంచ ప్రఖ్యాత షికాగో విశ్వవిద్యాలయానికున్న చరిత్ర చూసి అంగీకరించానని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికోసం కృషి చేస్తున్నందుకుగాను షికాగో యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ఇస్తున్నట్లు ట్వీటర్ సాక్షిగా ప్రకటించారు. ఇదే అదనుగా పచ్చ పత్రికలు చంద్రబాబు ఘనత గురించి కథనాలు వండాయి. బ్రాండ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్న పచ్చ తమ్ముళ్లు తమ ప్రచారానికి పదును పెట్టారు. షికాగో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించడమే చంద్రబాబు పాలన దక్షతకు ఇదే నిదర్శనమని, అసలా యూనివర్సిటీ చరిత్రలోనే ఒక విదేశీ రాజకీయ వేత్తకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ఇదే ప్రథమమని బాకాలూదారు. అయితే తెలుగుదేశం అధిపతి, ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించింది ప్రపంచ ప్రఖ్యాత ‘షికాగో యూనివర్సిటీ’ కాదు.. అనామక ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’. గంపెడు ఆరోపణలున్న వర్సిటీ... అమెరికాలో నాణ్యతాపరంగా పేరున్న యూనివర్సిటీల పేర్లకు దగ్గరగా మరికొన్ని సాధారణ యూనివర్సిటీల పేర్లుంటాయి. అలాగే ఇల్లినాయిస్లో ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’, ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’ పేరిట రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. విద్యా ప్రమాణాల్లో ఈ రెండింటికీ మధ్య నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వీటిలో చంద్రబాబుకు డాక్టరేట్ ప్రతిపాదించిన ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’పై నిధులు, విద్యార్థుల స్కాలర్షిప్ల దుర్వినియోగం వంటి ఆరోపణలున్నాయి. దీంతో 2009 నుంచి అమెరికా ప్రభుత్వ హయ్యర్ లెర్నింగ్ సెంటర్ ఇచ్చే గుర్తింపు పునరుద్ధరణకు నానా తంటాలు పడుతోంది. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కేందుకు ఏపీలో వర్సిటీని స్థాపించి భారీగా ప్రోత్సాహకాలు పొందాలని ఆ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రావు ఆచంట, దేవిశ్రీ పొట్లూరి ప్రణాళిక రచించారు. వీరిలో రావు ఆచంటకు ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఈ సాన్నిహిత్యంతోనే పరస్పర ప్రయోజనాలు చేకూర్చుకునే పథకంలో భాగంగానే చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దొడ్డిదారిన సంపాదించిన డాక్టరేట్కు ఏదో ఘనత సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు, ఆయన అనుయాయులకే చెల్లిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రచారం కోసం పవిత్రమైన విద్యాసంస్థల పేర్లను సైతం వాడుకోవడం గర్హనీయమని ప్రముఖ విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపే ముఖ్యం షికాగో స్టేట్ యూనివర్సిటీ (చంద్రబాబుకు డాక్టరేట్ ప్రతిపాదించిన యూనివర్సిటీ)కి అక్కడ సరైన గుర్తింపు లేదు. గుర్తింపు పొందిన పూర్వ విద్యార్థులు కూడా లేరు. ఇలా ప్రాభవం కోల్పోతున్న యూనివర్సిటీలు అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం అనుసరించే వ్యూహాల్లో భాగంగా ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటాయి. - ప్రొఫెసర్. వై. వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యులు, జేఎన్టీయూ-హెచ్ మాజీ ప్రొఫెసర్