తాను విలువలున్న రాజకీయాలే చేస్తాననీ, 30 ఏళ్లుగా మచ్చలేకుండా రాజకీయం చేశాననీ నిత్యం చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల్లోని నిజమెంతో మరోసారి బట్టబయలైంది. గతంలో ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ముందుకొచ్చినా తిరస్కరించాననీ, ప్రపంచ ప్రఖ్యాత షికాగో విశ్వవిద్యాలయానికున్న చరిత్ర చూసి అంగీకరించానని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే.