University of Chicago
-
ఢిల్లీ గాలి యమ డేంజర్
ఢిల్లీలో వాయు కాలుష్యం నానాటికీ కట్టలు తెంచుకుంటోంది. నెల రోజులకు పైగా కాలుష్య మేఘాలు వాతావరణం నిండా దట్టంగా పరుచుకున్నాయి. దాంతో జనానికి ఊపిరి కూడా ఆడని పరిస్థితి! ప్రస్తుత పరిస్థితుల్లో దేశ రాజధానిలో గాలి పీల్చడమంటే రోజుకు ఏకంగా 25 నుంచి 30 సిగరెట్లు తాగడంతో సమానమని షికాగో యూనివర్సిటీ జరిపిన తాజా అధ్యయనం ఒకటి తేల్చింది! అంతేగాక కాలుష్యం దెబ్బకు ఢిల్లీ ప్రజల ఆయు ప్రమాణం కూడా ఏకంగా 7.8 ఏళ్ల దాకా తగ్గుతోందని వెల్లడించింది. దీర్ఘకాలం పాటు ఢిల్లీ గాలి పీల్చడం ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు దారి తీసే ఆస్కారం కూడా చాలా ఎక్కువని తెలిపింది. ముఖ్యంగా విషతుల్యమైన పీఎం2.5 స్థాయిలు ఢిల్లీలో ఏకంగా 247 గ్రా/ఎం3గా నమోదవుతుండటం గుబులు పుట్టిస్తోంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించిన 15గ్రా/ఎం3 ప్రమాణాల కంటే ఏకంగా 20 రెట్లు ఎక్కువ కావడం గమనార్హం. ఇక ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ కూడా ఎప్పుడో 400 దాటేసింది. శుక్రవారం కూడా ఇది 411గా నమోదైంది. కాలుష్యం ధాటికి ఢిల్లీవాసులు ఇప్పటికే దగ్గు తదితర శ్వాస సంబంధ సమస్యలతో పాటు కళ్ల మంటలు, జర్వం తదిరాలతో అల్లాడుతున్నారు. వాయు కాలుష్య భూతం బారిన పడకుండా ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫయర్లు బిగించుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. బయటికి వెళ్లినప్పుడు విధిగా ఎన్95, ఎన్99 మాస్కులు ధరించాలని చెబుతున్నారు.భారత్‌లో 30 నుంచి 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులకు వాయు కాలుష్యమే కారణమని అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ అనే స్వచ్ఛంద సంస్థ ఇటీవల వెల్లడించిన నివేదిక పేర్కొంది. అయితే ఆ కాలుష్యం మెడ, తల భాగాల క్యాన్సర్‌కు కూడా దారి తీయవచ్చని షికాగో వర్సిటీ అధ్యయనం పేర్కొంది. పొగ తాగేవారిలో ఈ తరహా క్యాన్సర్లు పరిపాటి అని అధ్యయన బృందం సారథి జాన్ క్రామర్ గుర్తు చేశారు. భారత్‌లో ఊపిరితిత్తుల క్యాన్సర్ బాధితుల్లో అత్యధికులు జీవితంలో ఎన్నడూ పొగ తాగనివారేనని ముంబైలోని టాటా స్మారక ఆస్పత్రి గత జూలైలో ప్రచురించిన ఒక అధ్యయనం వెల్లడించడం గమనార్హం.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని ఓ అధ్యయనం చెబుతోంది. తీవ్ర కాలుష్యం బారిన పడుతున్న ఢిల్లీ వాసులు తమ ఆయుర్దాయంలో అత్యధికంగా 11.9 ఏళ్లు కోల్పోతున్నారని పేర్కొంది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం ప్రకారం చూసినా దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్ట పోతున్నారని తెలిపింది. భారత్‌లో ప్రజల ఆరోగ్యానికి కాలుష్యం పెనుముప్పుగా తయారైందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్‌లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 ఐదు మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్‌గా కాలుష్యం ఉండాల్సి ఉంది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. చదవండి: చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే! జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లకు మించి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 67.4 శాతం మంది నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. సగటు భారతీయుడి ఆయుర్దాయం కాలుష్యం కారుణంగా 5.3 ఏళ్లు తక్కువగా ఉంటోందని వివరించింది. 2021లో భారత్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరి్టక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 నమోదు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటు కన్నా 2.6 ఏళ్లు, తెలంగాణ ప్రజలు సగటు కన్నా 3.2 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది. దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4.5 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2013– 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటా 59.1 శాతమని తెలిపింది. సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అత్యధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా.. యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది. -
సోషల్ మత్తు.. అదో జగత్తు!
సాక్షి, అమరావతి: ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్.. స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరికీ తెలిసిన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇవి. స్నేహితులు, కుటుంబ సభ్యులను కలిపేందుకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు గంటల తరబడి వాటిలోనే గడిపేటంత వ్యసనంగా మారిపోయాయి. ముఖ్యంగా 16 నుంచి 24 ఏళ్ల యువత గంటల తరబడి సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన కమ్యూనికేషన్స్ రెగ్యులేటర్ ‘ఆఫ్‌కమ్’ లెక్కల ప్రకారం పాశ్చాత్య దేశాల్లో 98 శాతం యువత (16–24 సంవత్సరాలు) రోజులో ఎక్కువ సమయం ఆన్లైన్లో గడుపుతుంటే భారతదేశంలో 33.7 శాతం మంది అదే పనిలో ఉంటున్నట్టు పేర్కొంది. దేశంలో వినియోగంలో ఉన్న స్మార్ట్ ఫోన్లలో కనీసం మూడు యాప్‌ల్లో ఏదో ఒకటి రోజూ 30 నిమిషాలకు ఒకసారి తెరుస్తున్నట్టు గుర్తించారు. రోజులో గంట కంటే ఎక్కువ సేపు ఆన్లైన్లో గడిపితే అనర్థాలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలోని ఇంటర్నెట్ వినియోగదారులు సగటున రోజుకు 2.36 గంటలు సోషల్ మీడియాలో గడుపుతున్నట్టు యూఎస్‌కు చెందిన టెక్ జ్యూరీ సంస్థ తెలిపింది. దేశంలో 4.7% మందికి వ్యసనం వాస్తవానికి సోషల్ మీడియా వ్యసనాన్ని లెక్కించేందుకు నిర్దిష్టమైన కొలమానాలు ఏవీలేకున్నా.. గంటల తరబడి ఫోన్‌తోనే గడపడాన్ని వ్యసనంగానే భావిస్తున్నారు. ప్రతి 20 నిమిషాలకు ఒకసారి ఫోన్ చూసుకోవడం.. ఎలాంటి సందేశాలు రాకున్నా వచ్చినట్టు భావించడం.. కాస్త సమయం దొరికితే యూట్యూబ్, ఫేస్‌బుక్‌లోకి దూరిపోయి సమయాన్ని మరిచిపోవడం.. నిద్ర వస్తున్నా బలవంతంగా ఫోన్ చూస్తూ గడిపేయడం వంటి లక్షణాలు కనిపిస్తే అది సోషల్ మీడియా అడిక్షన్‌గా పేర్కొంటున్నారు. 5 గంటలకు పైగా ఆన్లైన్లోనే ఉండేవారిని వ్యసనపరులుగా భావిస్తున్నారు. యూకేలో 10 శాతం మందికి ఈ వ్యసనం ఉండగా, మన దేశంలో 4.7 శాతం మందికి సోషల్ మీడియా వ్యసనంగా మారినట్టు లెక్కించారు. ప్రస్తుతం ఇంటర్నెట్ ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తుండడంతో వచ్చే రెండేళ్లలో మనదేశంలో ఇది 12 శాతానికి పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఇష్టమైన యాప్స్ లాగిన్ అయినప్పుడల్లా మెదడులో డోపమైన్ (ఆనందాన్ని కలిగించే ఎంజైమ్) విడుదల స్థాయి పెరుగుతుందని, ఫలితంగా మెదడులోని న్యూరో ట్రాన్స్మీటర్లు ఆనందంతో కదులుతాయని వైద్యులు చెబుతున్నారు. అడిక్షన్ ఉందో లేదో ఇలా గుర్తించొచ్చు.. సోషల్ మీడియా వ్యసనానికి, ఆనందించే అలవాటుకు మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు ఉన్నట్టు చికాగో యూనివర్సిటీ అధ్యయనంలో వెల్లడించింది. ► సోషల్ మీడియాను మితిమీరి ఉపయోగించడం వల్ల ఉద్యోగం, చదువు, పనులపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అంటే ఏదైనా నిర్దిష్ట సమయంలో చేయాల్సిన పనికి బదులు ఫోన్లో యాప్‌లను తెరిస్తే అది వ్యసనానికి సంకేతంగా చెబుతున్నారు. ► స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఉన్నప్పుడు, భోజనం చేసేటప్పుడు స్మార్ట్‌ఫోన్‌ను తీసుకోవడం, మెస్సేజ్‌లను చూడడం. ► ప్రతి చిన్న సమస్యకు పరిష్కారంగా ఆన్లైన్, సోషల్ మీడియాపై అధికంగా ఆధారపడటం ► ఫోన్లో బ్యాలెన్స్ ఉండి, ఇంటర్నెట్ రాకుంటే చిరాకు, కోపం రావడం, ఏదో కోల్పోయినట్టు ఆందోళన చెందడం. ► అవకాశం దొరికినప్పుడల్లా వ్యక్తులు ఆశ్రయించే మొదటి అంశం స్మార్ట్‌ఫోన్ కావడం.. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే సోషల్ మీడియా అడిక్షన్‌లోకి వెళ్లినట్లేనని మానసిక వైద్యులు చెబుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌తో రోజువారీ బంధం ఇలా.. ► సోషల్ మీడియాలో అత్యధికంగా (60 శాతం) ఉండేది 18–34 ఏళ్ల వారే ► ఫోన్ అస్సలు స్విచ్చాఫ్ చేయనివారు 50% ► రోజుకు ఫోన్ అన్‌లాక్ చేసేది 150 సార్లు ► రోజుకు సగటున ఫోన్‌చెక్ చేసుకునేది 63 సార్లు.. ఫోన్ పక్కలో పెట్టుకుని నిద్రపోయేవారు 71 శాతం ► బాత్రూముల్లోనూ ఫోన్లు వినియోగించేవారు 40% ► డ్రైవింగ్‌లో ఒక్కసారైనా మెస్సేజ్ చేసేవారు 75% ► పడుకునే ముందు లేదా నిద్ర లేచిన వెంటనే ఫోన్ చూసేవారు 87 శాతం -
ఆయువు తగ్గిస్తున్న వాయువు
సాక్షి, అమరావతి: దేశంలో వాయు కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. భారతీయుల ఆయుష్షును తగ్గించివేస్తోంది. ఏకంగా 5.20 ఏళ్ల సగటు జీవితకాలాన్ని హరించేస్తుందని షికాగో యూనివర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించింది. 1998 నుంచి 2018 వరకు ప్రపంచవ్యాప్తంగా పెరిగిన వాయు కాలుష్యంపై ‘ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్’ పేరిట నిర్వహించిన అధ్యయనాన్ని ఆ యూనివర్సిటీ ఇటీవల విడుదల చేసింది. దీని తీవ్రతతో ప్రజలు జీవితకాలాన్ని కోల్పోతున్న దేశాల జాబితాలో.. ప్రపంచంలో బంగ్లాదేశ్ మొదటిస్థానంలో ఉండగా భారత్ రెండో స్థానంలో ఉందని వెల్లడించింది. ► 1998–2018 మధ్యలో భారతీయులు సగటున 1.80 ఏళ్ల జీవితకాలాన్ని కోల్పోయారు. ► 2018 నాటి వాయుకాలుష్యం కొనసాగితే.. రాబోయే ఏళ్లలో సగటు భారతీయుని జీవిత కాలం 5.20 ఏళ్లు తగ్గిపోతుంది. దేశంలో 84 శాతం మంది నిర్దేశించిన వాయు కాలుష్య ప్రమాణాల కంటే దిగజారిన పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ► డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలను పరిగణనలోకి తీసుకుంటే భారత్ పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. ► దక్షిణ భారతం కంటే ఉత్తర భారతంలో వాయు కాలుష్యం తీవ్రత చాలా ఎక్కువుగా ఉంది. అక్కడ 24.80 కోట్ల మంది భారతీయుల సగటు జీవితకాలం 8 ఏళ్లు హరించుకుపోతుంది. ► దేశంలో ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో వాసులు అత్యధికంగా ఆయుఃప్రమాణాన్ని నష్టపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుత వాయుకాలుష్యం కొనసాగితే ఇక్కడి వాసులు సగటున 10.30 ఏళ్ల జీవిత కాలాన్ని కోల్పోతారు. ► దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాల ప్రకారం.. సగటున 9.20ఏళ్లు, భారత ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం అయితే 6.50 ఏళ్లు జీవితకాలాన్ని కోల్పోతారు. ► దక్షిణ భారత దేశంలో తమిళనాడు మొదటిస్థానంలో ఉండగా తరువాత స్థానాల్లో వరుసగా కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కేరళ ఉన్నాయి. ► లాక్డౌన్ కారణంగా వాయు కాలుష్యం చాలావరకు తగ్గింది. కానీ ఇది తాత్కాలికమే. మళ్లీ పూర్తిస్థాయిలో ఆర్థిక, పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగితే వాయు కాలుష్యం 2018 నాటి స్థాయికి చేరుకుంటుంది. పట్టణాల్లో హరితవనాలు పెంచడమే పరిష్కారం ‘వాయుకాలుష్యాన్ని తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. ఇందుకోసం మన రాష్ట్రంలో అడవులు, మడ అడవుల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. అదే విధంగా పట్టణాలు, నగరాల్లో పెద్ద ఎత్తున హరితవనాలను పెంచాలి. యూరోపియన్ దేశాల్లో చేసినట్టుగా నగరాలు, పట్టణాల శివారు ప్రాంతాల్లోని భూముల్లో హరితవనాలను పెంచడం ద్వారా వాయు కాలుష్యాన్ని చాలావరకూ తగ్గించవచ్చు’. – మనోజ్ నలనాగుల, వాతావరణ శాస్త్రవేత్త -
సురక్షితమైన పాస్‌వర్డ్‌ల కోసం కొత్త వ్యవస్థ!
వాషింగ్టన్: మనలో చాలామంది పాస్వర్డ్ క్రియేట్ చేసేటపుడు ‘యువర్ పాస్వర్డ్ ఈజ్ టూ వీక్’ అని రావడం గమనించే ఉంటాం. అంటే మన పాస్వర్డ్ లెంగ్త్‌ను కొంచెం పెంచాలని అర్థం! అలా ఎందుకు వస్తుందో తెలియజేస్తూ, మనమిచ్చిన పాస్వర్డ్ క్యారెక్టర్ ఏ మేరకు సురక్షితమో తెలిపే కొత్త రకం వ్యవస్థను (మీటర్) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మీటర్ ఉత్తమమైన, సురక్షితమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడానికి అవసరమైన సలహాలను అందజేస్తుంది. ఈ మీటర్ కృత్రిమ నాడీ సంబంధిత యంత్రాంగం సహాయంతో పనిచేస్తుంది. మీ పాస్‌వర్డ్‌ను ఎవరూ ఊహించలేని విధంగా, హ్యాక్ చేయడానికి కూడా వీలు లేకుండా ధృఢంగా ఉండేలా సూచనలిస్తుంది. దీన్ని అమెరికాలోని షికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మీటర్ పనితీరును కూడా శాస్త్రవేత్తలు ఆన్లైన్లో పరీక్షించారు. ఈ మీటర్‌ను ఉపయోగించి పాస్వర్డ్ క్రియేట్ చేయండంటూ 4,509 మందిని కోరారు. -
డాక్టరేట్‌పైనా అబద్ధాలే!
-
డాక్టరేట్‌పైనా అబద్ధాలే!
గౌరవ డాక్టరేట్ విషయంలోనూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు ♦ ప్రఖ్యాత షికాగో యూనివర్సిటీ ఇస్తున్నట్లు ట్వీటర్లో వ్యాఖ్యలు ♦ కానీ గౌరవ డాక్టరేట్ ఇస్తున్నది షికాగో స్టేట్ యూనివర్సిటీ ♦ ప్రతి ఏటా గుర్తింపు పునరుద్ధరణకు తంటాలు పడుతున్న సంస్థ ♦ దానికే పచ్చ పత్రికలు, తెలుగు తమ్ముళ్ల ప్రచార హంగామా సాక్షి, హైదరాబాద్: తాను విలువలున్న రాజకీయాలే చేస్తాననీ, 30 ఏళ్లుగా మచ్చలేకుండా రాజకీయం చేశాననీ నిత్యం చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాటల్లోని నిజమెంతో మరోసారి బట్టబయలైంది. గతంలో ఎన్నో యూనివర్సిటీలు తనకు డాక్టరేట్ ఇవ్వడానికి ముందుకొచ్చినా తిరస్కరించాననీ, ప్రపంచ ప్రఖ్యాత షికాగో విశ్వవిద్యాలయానికున్న చరిత్ర చూసి అంగీకరించానని చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం తెలిసిందే. ఏపీ అభివృద్ధికోసం కృషి చేస్తున్నందుకుగాను షికాగో యూనివర్సిటీ తనకు డాక్టరేట్ ఇస్తున్నట్లు ట్వీటర్ సాక్షిగా ప్రకటించారు. ఇదే అదనుగా పచ్చ పత్రికలు చంద్రబాబు ఘనత గురించి కథనాలు వండాయి. బ్రాండ్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్న పచ్చ తమ్ముళ్లు తమ ప్రచారానికి పదును పెట్టారు. షికాగో విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించడమే చంద్రబాబు పాలన దక్షతకు ఇదే నిదర్శనమని, అసలా యూనివర్సిటీ చరిత్రలోనే ఒక విదేశీ రాజకీయ వేత్తకు గౌరవ డాక్టరేట్ ఇవ్వడం ఇదే ప్రథమమని బాకాలూదారు. అయితే తెలుగుదేశం అధిపతి, ఆ పార్టీ నేతలు, వారి అనుచరులు ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ప్రతిపాదించింది ప్రపంచ ప్రఖ్యాత ‘షికాగో యూనివర్సిటీ’ కాదు.. అనామక ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’. గంపెడు ఆరోపణలున్న వర్సిటీ... అమెరికాలో నాణ్యతాపరంగా పేరున్న యూనివర్సిటీల పేర్లకు దగ్గరగా మరికొన్ని సాధారణ యూనివర్సిటీల పేర్లుంటాయి. అలాగే ఇల్లినాయిస్లో ‘యూనివర్సిటీ ఆఫ్ షికాగో’, ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’ పేరిట రెండు విశ్వవిద్యాలయాలున్నాయి. విద్యా ప్రమాణాల్లో ఈ రెండింటికీ మధ్య నక్కకూ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంది. వీటిలో చంద్రబాబుకు డాక్టరేట్ ప్రతిపాదించిన ‘షికాగో స్టేట్ యూనివర్సిటీ’పై నిధులు, విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల దుర్వినియోగం వంటి ఆరోపణలున్నాయి. దీంతో 2009 నుంచి అమెరికా ప్రభుత్వ హయ్యర్ లెర్నింగ్ సెంటర్ ఇచ్చే గుర్తింపు పునరుద్ధరణకు నానా తంటాలు పడుతోంది. ఈ పరిస్థితులనుంచి గట్టెక్కేందుకు ఏపీలో వర్సిటీని స్థాపించి భారీగా ప్రోత్సాహకాలు పొందాలని ఆ యూనివర్సిటీలోని ప్రొఫెసర్లు రావు ఆచంట, దేవిశ్రీ పొట్లూరి ప్రణాళిక రచించారు. వీరిలో రావు ఆచంటకు ముఖ్యమంత్రి వియ్యంకుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఈ సాన్నిహిత్యంతోనే పరస్పర ప్రయోజనాలు చేకూర్చుకునే పథకంలో భాగంగానే చంద్రబాబుకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా దొడ్డిదారిన సంపాదించిన డాక్టరేట్‌కు ఏదో ఘనత సాధించినట్లుగా ప్రచారం చేసుకోవడం చంద్రబాబు, ఆయన అనుయాయులకే చెల్లిందని విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రచారం కోసం పవిత్రమైన విద్యాసంస్థల పేర్లను సైతం వాడుకోవడం గర్హనీయమని ప్రముఖ విద్యావేత్తలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గుర్తింపే ముఖ్యం షికాగో స్టేట్ యూనివర్సిటీ (చంద్రబాబుకు డాక్టరేట్ ప్రతిపాదించిన యూనివర్సిటీ)కి అక్కడ సరైన గుర్తింపు లేదు. గుర్తింపు పొందిన పూర్వ విద్యార్థులు కూడా లేరు. ఇలా ప్రాభవం కోల్పోతున్న యూనివర్సిటీలు అంతర్జాతీయ బ్రాండింగ్ కోసం అనుసరించే వ్యూహాల్లో భాగంగా ప్రముఖులకు గౌరవ డాక్టరేట్లు ఇస్తుంటాయి. - ప్రొఫెసర్. వై. వెంకటరామిరెడ్డి, యూపీఎస్సీ మాజీ సభ్యులు, జేఎన్టీయూ-హెచ్ మాజీ ప్రొఫెసర్