వాషింగ్టన్: మనలో చాలామంది పాస్‌వర్డ్ క్రియేట్ చేసేటపుడు ‘యువర్ పాస్‌వర్డ్ ఈజ్ టూ వీక్’ అని రావడం గమనించే ఉంటాం. అంటే మన పాస్‌వర్డ్ లెంగ్త్‌ను కొంచెం పెంచాలని అర్థం! అలా ఎందుకు వస్తుందో తెలియజేస్తూ, మనమిచ్చిన పాస్‌వర్డ్ క్యారెక్టర్ ఏ మేరకు సురక్షితమో తెలిపే కొత్త రకం వ్యవస్థను (మీటర్) శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మీటర్ ఉత్తమమైన, సురక్షితమైన పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయడానికి అవసరమైన సలహాలను అందజేస్తుంది.
ఈ మీటర్ కృత్రిమ నాడీ సంబంధిత యంత్రాంగం సహాయంతో పనిచేస్తుంది. మీ పాస్‌వర్డ్‌ను ఎవరూ ఊహించలేని విధంగా, హ్యాక్ చేయడానికి కూడా వీలు లేకుండా ధృఢంగా ఉండేలా సూచనలిస్తుంది. దీన్ని అమెరికాలోని షికాగో యూనివర్సిటీ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మీటర్ పనితీరును కూడా శాస్త్రవేత్తలు ఆన్‌లైన్‌లో పరీక్షించారు. ఈ మీటర్‌ను ఉపయోగించి పాస్‌వర్డ్ క్రియేట్ చేయండంటూ 4,509 మందిని కోరారు.
సురక్షితమైన పాస్‌వర్డ్‌ల కోసం కొత్త వ్యవస్థ!
Published Wed, May 10 2017 11:08 AM | Last Updated on Tue, Sep 5 2017 10:51 AM
Advertisement
Advertisement