శ్రీనుకు డాక్టరేట్
Published Tue, Aug 9 2016 6:15 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగ పరిశోధక విద్యార్థి బోగి శ్రీనుకు వర్సిటీ డాక్టరేట్ లభించింది. మంగళవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉత్తర్వులను అందించారు. విభాగ ఆచార్యులు డాక్టర్ బి.బి.వి శైలజ పర్యవేక్షనలో ‘కెమికల్ స్పెసిఫికేషన్ స్టడీస్ ఆన్ ఎల్–ఏస్పిరజిని అండ్ గై ్లగిజిని కాంప్లెక్సెస్ విత్ సమ్ ఎసన్షియల్ మెటల్ అయాన్స్ ఇన్ ఆక్వా–ఆర్గానిక్ మిక్సర్స్’ అంశంపై తన పరిశోధన జరిపారు.జీవసంబంధ లైగండ్‌లను ఉపయోగించి ఆవశ్యకత, లోహ అయానులతో సంశ్లిష్ట సమ్మేళనాల స్తిరత్వాన్ని, కంప్యూటర్ మోడలింగ్ స్టడీద్వానా జరిపిన అధ్యయనానికి డాక్టరేట్ లభించింది.
Advertisement
Advertisement