srinu
-
పోలీసులే కిడ్నాప్ చేస్తే!
సాక్షి, నరసరావుపేట: పట్టపగలు న్యాయస్థాన ప్రాంగణంలో గిరిజన నేతపై దాడి చేయడమే కాకుండా బలవంతంగా అపహరించారు. చట్టాన్ని కాపాడాల్సిన ఖాకీలే రౌడీల అవతారమెత్తారు. కోర్టులో లొంగిపోయేందుకు వచ్చి న నిందితుడిని కోర్టు ప్రాంగణంలోనే కిడ్నాప్ చేశారు. దుర్గి మండలం కాకిరాలకు చెందిన వైఎస్సార్సీపీ నేత రమావత్ శ్రీనునాయక్‌పై ఇప్పటికే మూడు అక్రమ కేసులు నమోదు చేశారు. అందులో రెండు కేసుల్లో సుమారు 70 రోజులపాటు సబ్‌జైలులో ఉన్న శ్రీనునాయక్ బెయిల్‌పై విడుదలయ్యాడు. జైలులో ఉన్న సమయంలో అప్పటికే నమోదైన మూడో కేసులో పీటీ వారెంట్ వేయకుండా బయటకు వచ్చి న తరువాత అరెస్ట్ చేసి హింసించాలన్న దురుద్దేశంతో పోలీసులు ఆ సమయంలో అరెస్ట్ చూపలేదు. బెయిల్‌పై బయటకు వచ్చిన తరువాత ఎలాగైనా అక్రమంగా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయాలని పోలీసులపై టీడీపీ ప్రజాప్రతినిధి నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చి0ది. విషయం తెలుసుకున్న శ్రీనునాయక్ కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లాడు. కుటుంబ సభ్యులను, సన్నిహితులను పోలీసులు వేధింపులు గురి చేస్తుండటంతో శ్రీనునాయక్ కోర్టులో లొంగిపోయేందుకు మంగళవారం మాచర్ల న్యాయస్థానం వద్దకు చేరుకున్నారు. తన న్యాయవాది ద్వారా కోర్టులో సరెండర్ పిటిషన్ దాఖలు చేశారు. మరికొన్ని నిమిషాల్లో న్యాయమూర్తి ఎదుట హాజరవుతడనగా.. మాచర్ల పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బలవంతంగా శ్రీనునాయక్‌ను కోర్టు ప్రాంగణం నుంచి నెట్టుకుంటూ పక్కకు తీసుకెళ్లారు. గమనించిన అతని తరపు న్యాయవాది రామానాయక్ అడ్డుకోబోయాడు. అయినప్పటికీ పోలీసులు చొక్కా చించి దాడికి పాల్పడ్డారు. అ సమయంలో శ్రీనునాయక్ చేతి వేళ్లకు గాయాలయ్యాయి. కోర్టు ప్రాంగణంలో పోలీసులు వ్యవహరిస్తున్న దౌర్జన్యకాండను మరో న్యాయవాది షేక్ ఖాసిం తన సెల్ఫోన్లో చిత్రీకరించాడు. గమనించిన పోలీసులు న్యాయవాది వద్ద నుంచి ఫోన్‌ను బలవంతంగా లాక్కున్నారు. అనంతరం ఎవరూ ముందుకు రావద్దంటూ పోలీసులు బెదిరిస్తూ శ్రీనునాయక్‌ను కిడ్నాప్ చేసి కార్లో ఎక్కించుకుని వెళ్లారు. అనంతరం న్యాయవాది రామానాయక్ జరిగిన ఘటనను న్యాయమూర్తికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.లొంగిపోయేందుకు వచ్చిన తమ క్లయింట్‌ను పోలీసులు బలవంతంగా అపహరించడంతోపాటు తనపట్ల దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శ్రీనునాయక్ రక్తంతో తడిసిన తన చొక్కాను న్యాయమూర్తికి అప్పగించినట్టు రామానాయక్ తెలిపారు. న్యాయస్థాన ప్రాంగణంలో పోలీసుల దౌర్జన్యకాండ పట్ల న్యాయవాదులు మండిపడుతున్నారు. నా భర్తకు ప్రాణహాని ఉంది పోలీసుల నుంచి తన భర్తకు ప్రాణహాని ఉందని కిడ్నాప్‌కు గురైన శ్రీనునాయక్ భార్య లక్ష్మీభాయ్ విలేకరుల ఎదుట వాపోయింది. కోర్టు ప్రాంగణం నుంచి పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లిన తరువాత ఎక్కడ పెట్టారో చెప్పలేదన్నారు. తన భర్తను చూసేందుకు పోలీస్ట స్టేషన్‌కు వెళ్లినా అక్కడ లేడని వెనక్కి పంపారన్నారు. కాగా.. పాత కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనునాయక్‌ను కోర్టు సమీపంలో అరెస్ట్ చేశామని గురజాల డీఎస్పీ జగదీష్ తెలిపారు. -
అమ్మ ప్రాణం తీసిన రూ.500
పరిగి: గొడవ పడుతున్న కొడుకులను విడిపించేందుకు వెళ్లిన ఓ తల్లి ప్రాణం కోల్పోయింది. క్షణికావేశంతో మొదలైన చిన్నపాటి తగాదా ఆమె నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం సయ్యద్‌మల్కాపూర్‌లో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన శంకరమ్మ (63)కు వెంకటయ్య, శ్రీను, సత్యమ్మ సంతానం. భర్త గతంలోనే మృతిచెందగా.. చిన్న కొడుకు శ్రీనుతో కలిసి ఉంటోంది. పెద్దకొడుకు వెంకటయ్య కుటుంబంతో సహా సమీపంలోని నజీరాబాద్ తండాలో జీవిస్తున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల శ్రీను అనారోగ్యం బారినపడ్డాడు. ఈ నేపథ్యంలో అన్న వెంకటయ్యకు ఫోన్ చేసి.. మహ్మదాబాద్‌కు చెందిన పసుపుల మల్లయ్య వద్ద రూ.5 వేలు తీసుకురమ్మని చెప్పాడు. డబ్బులు తీసుకొచ్చిన వెంకటయ్య వాటిని తమ్ముడికి ఇచ్చేందుకు బుధవారం రాత్రి భార్యతో కలిసి సయ్యద్‌మల్కాపూర్ వచ్చాడు. ఇదిలా ఉండగా అనారోగ్యం పాలైన తమ్ముడిని పరామర్శించేందుకు అక్క సత్యమ్మ సైతం వచ్చింది. అయితే రాత్రి వేళ అందరూ భోజనానికి సిద్ధమవుతుండగా.. అన్నదమ్ములిద్దరూ మద్యం తాగేందుకు కూర్చున్నారు. కొద్దిసేపటి తర్వాత అక్క సత్యమ్మ తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇవ్వలేదని వెంకటయ్య వాగ్వాదానికి దిగాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీను తనను చూసేందుకు వచ్చిన అక్కను డబ్బులు అడుగుతావా అంటూ అన్నను నిలదీశాడు. ఇలా ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. డబ్బు తెచ్చిస్తానని సత్యమ్మ చెప్పినా అన్నదమ్ముల వాగ్వాదం ఆగలేదు. ఈ క్రమంలో ఇద్దరూ పెనుగులాడుతూ ఇంటి ఎదురుగా ఉన్న సీసీ రోడ్డుపైకి చేరుకున్నారు. కొడుకులు కొట్టుకుంటున్నారని గాబరాపడిన తల్లి శంకరమ్మ.. ఇరువురినీ విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో సహనం కోల్పోయిన శ్రీను మధ్యలో నీవెందుకు వస్తున్నావంటూ తల్లిని తోసేయగా, సీసీ రోడ్డుపై పడిపోయింది. కుటుంబ సభ్యులు వచ్చి లేపేందుకు ప్రయత్నించగా చలనం కనిపించలేదు. చుట్టుపక్కల వాళ్లు 108కి ఫోన్ చేసి, అంబులెన్స్‌లో పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పెద్ద కొడుకు వెంకటయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంతోష్ తెలిపారు. -
వేణుమాధవ్ వాయిస్ ని అచ్చు.. గుద్దినట్లు దించేసిన గెటప్ శ్రీను
-
వైఎస్సార్సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ముగ్గురు మృతి
వెల్వడం(మైలవరం)/మధురానగర్(విజయవాడసెంట్రల్)/ఉయ్యూరు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఎన్టీఆర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఒకరు మృతిచెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు... ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామానికి చెందిన అయిలూరి శ్రీనివాసరెడ్డి(35) వైఎస్సార్సీపీ ఆవిర్భావం నుంచి స్థానికంగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రెండోసారి వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బలంగా నమ్మాడు. కానీ, పార్టీ ఓడిపోవడంతో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనోవేదనతో కుమిలిపోతున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి ఆకస్మికంగా మృతిచెందాడు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదేవిధంగా విజయవాడలోని 27వ డివిజన్ బావాజీపేటకు చెందిన వైఎస్సార్సీపీ గృహసారథి నామా శ్రీను(55) గత 12 ఏళ్లుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోయినప్పటి నుంచి బాధపడుతున్న శ్రీను గురువారం రాత్రి గుండెపోటుతో మృతిచెందాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. నామా శ్రీను మృతికి మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు సంతాపం తెలిపారు. కాగా, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కడవకొల్లు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ క్రియాశీలక కార్యకర్త, లారీ డ్రైవర్ జె.కొండలరావు (56) కూడా పార్టీ ఓటమిని తట్టుకోలేక తీవ్ర వేదనకు గురవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయనకు వారం రోజుల కిందట గుండెపోటు రావడంతో విజయవాడలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. కొండలరావు భౌతికకాయం వద్ద సర్పంచ్ మంగినేని సుధారాణి, పార్టీ నాయకులు నివాళులర్పించారు. -
తొలి ΄పౌరుడు తనే!
సమర సింహారెడ్డి, అక్సా ఖాన్ జంటగా తెలుగు శ్రీను దర్శకత్వంలో ‘మగపులి’ సినిమా ఆరంభమైంది. ‘ఫార్మర్ ఈజ్ ద ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ద వరల్డ్’ (రైతే ప్రపంచంలో తొలి ΄పౌరుడు) ఉపశీర్షిక. ఎమ్బీడబ్ల్యూడీఏ సమర్పణలో నారాయణ స్వామి నిర్మిస్తున్నారు. తొలి సీన్‌కి రైతు టి. రంగడు కెమెరా స్విచ్చాన్ చేయగా, నటుడు సుమన్ క్లాప్ ఇచ్చారు. ‘‘నిరుద్యోగులు, రైతులు, రాజకీయ నాయకుల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అన్నారు తెలుగు శ్రీను. ‘‘ఆంధ్ర, కర్ణాటక సరిహద్దులో ఉండటం వల్ల కన్నడలో సినిమాలు చేశాను. ఇప్పుడు మాతృ భాషలో సినిమా చేస్తుండటం హ్యాపీ’’ అన్నారు సమర సింహారెడ్డి. ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్. జె, కెమెరా: శివారెడ్డి యస్వీ. -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
వాలీబాల్ ఆడుతుండగా వర్షం.. చెట్టు కిందకు పరుగులు.. మరో చెట్టుపై పిడుగు
రావికమతం (అనకాపల్లి జిల్లా): చెట్టుపై ఆదివారం సాయంత్రం పిడుగు పడడంతో 11 మంది గిరిజన యువకులు గాయపడ్డారు. వీరిలో ముగ్గురిని విశాఖ కేజీహెచ్‌కు, 8 మందిని 108లో నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. రావికమతం మండలం తాటిపర్తి గిరిజన గ్రామంలో ఆ గ్రామానికి చెందిన సీదిరి శ్రీను, కుండ్ర బాలరాజు, షోమీల శ్రీను, పాడి చినబ్బాయి, బాలకృష్ణ, లోత కళ్యాణం, సుర్ల గణేష్ తదితర యువకులు ఆదివారం వాలీబాల్ ఆడుతుండగా వర్షం రావడంతో అంతా ఒక చెట్టు కిందకు పరుగులు తీశారు. ఆ సమయంలో వారికి సమీపంలోని మరో చెట్టుపై పిడుగుపడడంతో ఆ అదురుకు పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న మరికొంత మంది వెంటనే 108కు సమాచారం అందించడంతో హుటాహుటిన అంబులెన్స్ సిబ్బంది వచ్చి, గాయపడిన వారిని నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం అందరూ కోలుకున్నారని ఆందోళన చెందాల్సిన పనిలేదని గ్రామ సర్పంచ్ వంజరి గంగరాజు తెలిపారు. -
ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను
ప్రభాస్ శ్రీను, టాలీవుడ్లో కేవలం నటుడిగానే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అసిస్టెంట్‌గా, మంచి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం తనపై వచ్చిన రూమర్స్ గురించి తాజాగా స్పందించాడు. సీనియర్ నటి తులసితో ఎఫైర్ ఉందని అప్పట్లో రూమర్లు పుట్టుకొచ్చాయి. అప్పుడు చాలా బాధపడ్డానని తెలిపాడు. ఆవిడతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు కానీ తమ మీద తప్పుగా రూమర్స్ ప్రచారం చేశారు. తనకు తులసి అంటే తల్లితో సమానం అన్నాడు. 'డార్లింగ్' సినిమా షూటింగ్ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి, ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారని ప్రభాస్ శ్రీను తెలిపాడు. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ విలన్ కన్నుమూత!) సినిమా షూటింగ్ సమయంలో ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని, దానిని కొందరు అపార్థం చేసుకున్నట్లు తెలిపాడు. తమపై రూమర్స్ వస్తున్నట్లు మొదట ఆవిడే మెసేజ్ పెట్టారని చెప్పుకొచ్చాడు. ' ఈ రూమర్స్ గురించి మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా ఆపార్థం చేసుకుంటుందేమో' అని సలహా కూడా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. తన భార్య ఒక డాక్టర్ అని. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇలాంటి రూమర్స్ నమ్మదంటూ.. వాటిని చూసి నవ్వుకుని వదిలేశామని చెప్పాడు. (ఇదీ చదవండి: బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచిన అనుపమతో పోటీ పడుతున్న తమన్నా) -
గుజ్జల శ్రీను రూ.వందల కోట్లు స్వాహా చేశారు
సాక్షి, అమరావతి: ఆప్కో మాజీ చైర్మన్ గుజ్జల శ్రీను చేనేత కార్మికుల పేరు మీద తప్పుడు సంఘాలు, ఖాతాలు, సభ్యులను సృష్టించి రూ.వందల కోట్ల మేర నిధులను స్వాహా చేశారని సీఐడీ గురువారం హైకోర్టుకు నివేదించింది. దీనిపై హైకోర్టులో విచారణ జరగాల్సిందేనని విన్నవించింది. గుజ్జల శ్రీను తదితరులపై నమోదైన కేసులో ఇప్పటివరకు 174 మంది సాక్షులను విచారించి.. పూర్తి వివరాలతో చార్జిషీట్ దాఖలు చేశామని సీఐడీ తరఫు న్యాయవాది వై.శివ కల్పనారెడ్డి కోర్టుకు నివేదించారు. ఆప్కోకు చైర్మన్‌గా వ్యవహరించడం వల్ల ఆయన ప్రజా సేవకుడు (పబ్లిక్ సర్వెంట్) కిందకే వస్తారని తెలిపారు. అందుకే గుజ్జల శ్రీనుపై అవినీతి నిరోధక చట్టం (పీసీ యాక్ట్) కింద కేసు నమోదు చేశామన్నారు. చేనేత సహకార సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారన్నారు. ఈ నిధులతో గుజ్జల శ్రీను కడపలో 89 స్థిరాస్తులను కుటుంబ సభ్యుల పేరు మీద కూడబెట్టారని ఆమె కోర్టుకు వివరించారు. అందువల్ల ఆయనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టేయొద్దని కోరారు. ఈ కేసులో శ్రీను తరఫు న్యాయవాదులు ప్రస్తావించిన తీర్పును అధ్యయనం చేయాల్సి ఉందని, ఇందుకు కొంత గడువు కావాలని ఆమె కోర్టును అభ్యర్థించారు. ఇందుకు అంగీకరించిన హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సీఐడీ తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ గుజ్జల శ్రీను, మరికొందరు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
రాయలసీమ నేపథ్యంలో...
సుమన్, అక్సా ఖాన్, శ్రీను ముఖ్య తారలుగా మను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిద్ధన్న గట్టు’. ఎన్. శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రవరం జేబీ, మధు, మహేష్ , మెహబూబ్, మీనాక్షీ రెడ్డి, వెంకట్రాముడు, చిన్న నరసింహులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. సుమన్ మాట్లాడుతూ – ‘‘రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నా ఏజ్, ఇమేజ్‌కి తగ్గట్టు ఈ చిత్రంలో నా పాత్రను మలిచారు’’ అన్నారు. ‘‘పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం’’ అన్నారు మను. ‘‘కథ నచ్చి సినిమా నిర్మించాం’’ అన్నారు నేశినేని శ్రీనివాస్ రెడ్డి. -
అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి
కాశీబుగ్గ (శ్రీకాకుళం): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్‌కు దగ్గరలో నివాసం ఉంటున్న సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ప్రతి సంక్రాంతికి కాశీబుగ్గలోని తన స్వగృహానికి రావడం, తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆయనకు అలవాటు. షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత అతనికి గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసిందని, ఆ కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోగా, తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు అత్తా రిళ్లలో ఉన్నారు. శ్రీను మరణంతో జంట పట్టణాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. చదవండి: (సినీ నటి ఇంట్లో చోరీ.. ధనుష్ అరెస్ట్) -
కుమార్తెను ఇచ్చి వివాహం చేయనందుకే..
తూర్పుగోదావరి, రాజమహేంద్రవరం క్రైం: కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ అర్ధరాత్రి గాఢ నిద్రలో ఉన్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి నలుగురు మృతికి, ఇద్దరు చిన్నారులు గాయాల పాలవ్వడానికి కారణమైన నిందితులను రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేశారు. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ షిమూషీ బాజ్‌పేయి ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆమె కథనం ప్రకారం.. కడియం మండలం దుళ్ల గ్రామంలో జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటాల సమయంలో కోట్ని సత్యవతి(50) ఆమె కుమారుడు కోట్ని రాము(16) కుమార్తె గంటాా దుర్గా భవానీ(30) భవానీ కుమార్తె గంటాా విజయలక్ష్మి, మరో ఇద్దరు గంటా దుర్గా మహేష్, గంటాా యేసు కుమార్ ఒకే గదిలో నిద్రిస్తుండగా కడియం మండలం, మురమండ గ్రామానికి చెందిన మాసాడ శ్రీను, అతడి బావ మర్లపూడి మోహన్‌లు ఇంటి తలుపులు తీసి పెట్రోల్ పోసి నిప్పు అంటించి పరారయ్యారని తెలిపారు. ఈ సంఘటనలో కోట్ని రాము(16), గంటా విజయలక్ష్మి(5) అక్కడికక్కడే దగ్ధమై మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలతో కోట్ని సత్యవతి, గంటా దుర్గా భవానీ చికిత్స పొందుతూ మృతి చెందారని తెలిపారు. వీరితో పాటు గాయాలపాలైన గంటా దుర్గా మహేష్, గంటా ఏసు కుమార్‌లు కోలుకున్నారని వివరించారు. వివాహం చేస్తామని చెప్పి.. మాట తప్పారని.. కోట్ని సత్యవతికి మేనల్లుడయ్యే మాసాడ శ్రీనుకు తన రెండో కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని అతడి వద్ద రూ.లక్ష నగదు తీసుకుందని, అనంతరం శ్రీను వ్యసనాలకు బానిస కావడంతో వివాహం చేయలేదని వివరించారు. మేనత్త కూతుర్ని తనకు కాకుండా వేరే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి, తీసుకున్న అప్పు ఇవ్వకుండా తనను మోసం చేసిన మేనత్తపై కక్ష పెంచుకున్న మాసాడ శ్రీను ఆమె రెండో కుమార్తె రామలక్ష్మికి వేరే వివాహం చేశారని తెలుసుకొని జనవరి 17వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో దుళ్ల గ్రామంలోని సత్యవతి ఇంటికి వచ్చి ఆమె గొంతుపై చాకుతో దాడి చేసి పరారయ్యాడని తెలిపారు. ఈ సంఘటనపై కడియం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు తెలిపారు. అనంతరం తన మేనత్త బతికి ఉందని తెలుసుకున్న మాసాడ శ్రీను, అతడి బావ (అక్క భర్త) మర్లపూడి మోహన్‌లు, సత్యవతిని హత్య చేయాలని జనవరి 21వ తేదీ రాత్రి రెండు గంటల సమయంలో దుళ్ల గ్రామంలో ప్లాస్టిక్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకొని సత్యవతి ఇంట్లో పడుకున్న వారిపై పెట్రోల్ పోసి నిప్పు అంటించి బయట తలుపు గొళ్లెం పెట్టాడని వివరించారు. గదిలో మంటలు వ్యాపించి గదిలో నుంచి బయటకు వచ్చేందుకు వీలులేక మంటల్లో కాలిపోతూ కేకలు వేశారని తెలిపారు. ఈ కేకలు విన్న స్థానికులు మంటల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారని, ఈ సంఘటనలో కోట్ని రాము, గంటా విజయలక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారని తెలిపారు. తీవ్ర గాయాలపాలైన కోట్ని సత్యవతి, ఆమె కుమార్తె గంటా దుర్గా భవాని చికిత్స పొందుతూ మృతి చెందినట్టు తెలిపారు. నిందితులను ఈ నెల 19వ తేదీ మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో విశాఖ జిల్లా రావికవతం మండలం, టి.అర్జాపురం గ్రామంలోని సిమెంట్ ఇటుకల బట్టీ వద్ద మాసాడ శ్రీను, మర్లపూడి మోహన్ లను సౌత్ జోన్ డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కడియం ఇన్స్పెక్టర్ కె.శ్రీధర్ కుమార్ వారి సిబ్బంది సీహెచ్‌వీ రమణ, కె.సురేష్ బాబు, కె.బాల గంగాధర్, బి.నాగరాజుల సహాయంతో అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడంలో విశేష ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని, స్పెషల్ టీమ్‌ను అభినందించి రివార్డు అందజేశారు. నిందితులను అరెస్ట్ చేసేందుకుతొమ్మిది ప్రత్యేక బృందాలు నిందితులను అరెస్ట్ చేసేందుకు తొమ్మిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ షిమూషీ బాజ్‌పేయి తెలిపారు. ఎక్కడా ఆధారాలు లేకుండా మారణ హోమం సృష్టించిన నిందితులు ఆరు నెలలు ఒక చోట చొప్పున గ్రామాలు మారుతూ అప్పులు చేస్తుంటారని పోలీస్ విచారణలో తేలిందని డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సంఘటన జరిగిన రాత్రి నిందితులు స్కూటీ పై దుప్పల పూడి వెళ్లి, కోళ్ల ఫారం వద్ద ఉంటున్న కుటుంబ సభ్యులకు ఏమి తెలియకుండా జాగ్రత్తపడ్డారని తెలిపారు. కోళ్లఫారం యజమాని వద్ద తమ కుమారుడికి వంట్లో బాగోలేదని చెప్పి రూ.రెండు వేలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారని తెలిపారు. సామర్లకోట రైల్వే స్టేషన్లో స్కూటీ మోటారు సైకిల్‌ను ఉంచి అనకాపల్లికి మకాం మార్చారని వివరించారు. మాసాడ శ్రీను, అతడి తండ్రి, తల్లి, అక్క, బావ వారి పిల్లలు నలుగురూ ఒక గ్రూప్‌గా ఉంటూ అప్పులు చేసి అక్కడి నుంచి పరారవుతుంటారని తెలిపారు. విశాఖ జిల్లా రావికవతం గ్రామంలో సిమెంట్ ఇటుకల బట్టీలో పనికి కుదిరారని, అక్కడ నిందితులను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించినట్టు తెలిపారు. -
'నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి'
చిత్రం: భక్తకన్నప్ప రచన: సి.నారాయణరెడ్డి గానం: పి. సుశీల, వి. రామకృష్ణ సంగీతం: సత్యం భక్త కన్నప్ప చిత్రంలోని ‘కండ గెలిచింది కన్నె దొరికింది గుండె పొంగిందిరా/మాత పలికింది మనువు కలిపింది మనసు గెలిచిందిరా/ హైరా మా దొరగారికి వీరగంధాలు/సైరా మా దొరసానికి పారిజాతాలు’ పాటను డ్రమ్స్ మీద నాట్యం చే స్తున్నట్లుగా చిత్రీకరించాను. సాధారణంగా ఆ పాట సిట్యుయేషన్‌కి ఒక డ్యూయెట్ పెడతారు ఎవరైనా. కాని బాపుగారు కొత్త తరహాలో రాయించుకున్నారు. ఈ పాటలో వీరం, శృంగారం, భక్తి, నాట్యం అన్నీ కలిసి ఉన్నాయి. అలాగే నృత్యం, నాట్యం, నృత్తం మూడూ ఈ పాటలో ఉంటాయి. కథానాయిక నీల (వాణిశ్రీ)కు భక్తి ఉంటుంది. ‘ధిమింధిమింధిమి భేరీ ధ్వనులు తెలిపెనురా నా గెలుపునే/ఘలం ఘలల చిరుగజ్జెల మోతలు పలికెనురా నా వలపునే/అల్లె తాళ్ల ఝంకారాలే జయం దొరా అని పాడెనులే/నల్ల త్రాచు వాలు జడలే ఆ పాటకూ సయ్యాడెనులే’ అని సాగే మొదటి చరణంలో ప్రియుడు తన గెలుపును తెలిపేలా, వీరత్వం గురించి ఆనంద తాండవం చేస్తూ పాడుతుంటే, ప్రియురాలు తన ప్రేమను శృంగార రసంలో తెలుపుతుంది. ‘నేరేడు చెట్టు కాడ నా రేడు మాటేసి/చారెడేసి కళ్లతోటి బారెడేసి బాణమేసి/బాణమేసి నా ప్రాణం తోడేస్తుంటే/ఓయమ్మో ఓలమ్మో నీ ప్రాణం తోడేస్తుంటే’ అంటూ సాగే రెండో చరణంలో నాయిక పరవశంగా డ్రమ్ మీద కూర్చుని పాడుతుంటే, కిందే నిలబడిన నాయకుడు ఆమె వైపు ఆరాధనగా చూస్తున్నట్టుగా కంపోజ్ చేశాను. ఈ చరణం నడక చాలా వేగంగా ప్రారంభమై, అక్కడకు వచ్చేసరికి మెలోడియస్గా ఉంటుంది. ఆ తరవాత వచ్చే ‘ఎంతా చక్కని కన్ను, ఎంతో చల్లని చూపు/ఇంతకన్న ఇంకేమి కావాలి/ నా బతుకంతా ఇలా ఉండిపోవాలి’ చరణంలో ముందుగా కృష్ణంరాజు చుట్టూ బల్లాలు వేస్తారు. వాణిశ్రీ వాటిని తొలగించుకుంటూ వస్తుంది. దర్శకుడు బాపుగారు ‘ఎంత చల్లటి చూపు’ పదాలు వచ్చినప్పుడు అమ్మవారిని చూపించమన్నారు. ఆ కళ్లు ఈ కళ్లు... అటు భక్తి, ఇటు ప్రేమ రెండు కళ్లు ఒకేలా ఉన్నాయన్నట్టుగా చూపాను. పాటంతా పూర్తయ్యాక బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మొదలవుతుంది. డిఫరెంట్ పోశ్చర్లు తీశాను. ఇలాంటివి ఆ రోజుల్లోనే ప్రారంభించాం. ఈ సినిమా పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగూడెంలో తీశారు. అక్కడ దొరలు వాళ్ల ఇళ్లల్లోనే మమ్మల్ని ఉంచుకుని, వాళ్ల ఆహారమే పెట్టారు. అక్కడే ఔట్‌డోర్‌లో తీశారు ఈ సినిమా. ఒక ఎకరం స్థలం సేకరించి, సెట్ వేశారు. ఈ పాటను ఆరు రోజులు తీశాను. ఆరు రోజుల పాటు తీసిన నాలుగైదు పాటలలో ఇది ఒకటి. వాణిశ్రీ, కృష్ణంరాజు... ఇద్దరూ లొకేషన్లోనే నాట్యం నేర్చుకున్నారు. వాణిశ్రీకి వాణిశ్రీనే సాటి అని నా ఉద్దేశం. కృష్ణంరాజును ఈ పాట కోసం చాలా కష్టపెట్టాను. మంచి సెట్ వేసిన ఆర్ట్ డైరెక్టర్ భాస్కర్రాజుగారిని అభినందించాలి. ఈ పాట పూర్తయిన తరవాత చూస్తే, నాకు ‘శివపార్వతుల తాండవం’ లా అనిపించింది. - వైజయంతి పురాణపండ -
ఆమె స్నేహితులతో కలిసి హత్య చేసి ఉంటుందని..
నెల్లూరు, బాలాయపల్లి: స్నేహితులు వస్తున్నారు.. కలిసి రావాలని ఇంటి నుంచి వెళ్లిన ఓ యువకుడు అడవి ప్రాంతంలో హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మండలంలోని చిలమనూరు తిప్ప సమీపం వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో బుధవారం వెలుగులోకి వచ్చింది. బంధువుల కథనం మేరకు.. గ్రామానికి చెందిన జడపల్లి శ్రీను (25) బీటెక్ చదువుకునే సమయంలో మాధురి అనే యువతిని ప్రేమించాడు. అయితే వీరి ప్రేమను శ్రీను తల్లిదండ్రులు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో 2018 ఆగస్టు 30న వెంకటగిరి సమీపంలోని విలగనూరుకు చెందిన అత్త కుమార్తె కౌశల్యతో వివాహం జరిపించారు. కౌశల్య వెంకటగిరిలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివి స్తున్నాడు. మంగళవారం తెల్లవారు జామున 5 గంటలకు స్నేహితులు వెంకటగిరికి వస్తున్నారు.. వెళ్లి వస్తామని తల్లి రమణమ్మకు చెప్పడంతో రాత్రుల్లో ఎక్కడికని కసురుకుంది. తల్లికి చెప్పకుండా వెంకటగిరికి వెళ్లాడు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో 9 గంటల సమయంలో భార్య కౌశల్య ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావని అడగడంతో తిప్ప వద్ద ఉన్నాని చెప్పాడు. 9.30 గంటల తర్వాత మళ్లీ ఫోన్ చేస్తే స్వీచ్చాఫ్ అని వచ్చింది. తల్లి రమణమ్మ, తండ్రి శంకరయ్య ఎదురు చూస్తూ వరండాలోనే పడుకున్నారు. ఉదయం 7 గంటలకు చిలమనూరు సమీపంలో నాయుడుపేట–వెంకటగిరి రోడ్డు తిప్ప సమీపం వద్ద అడవిలో విగత జీవిగా పడి ఉండడంతో గ్రామస్తులు అటుగా వెళ్తూ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఇన్చార్జి సీఐ మల్లికార్జునరావు ఘటన స్థలాన్ని పరిశీలించారు. హతుడు తల వెనుక భాగంతో కత్తితో దాడి చేసినట్లు గుర్తించారు. ఆనవాళ్లు గుర్తించని జాగిలం ప్రాథమిక ఆధారాల కోసం నెల్లూరు నుంచి క్లూస్‌టీమ్‌ను, పోలీస్ జాగిలాన్ని రప్పించారు. క్లూస్‌టీమ్ బైక్‌పై, ఘటనా స్థలంలో కొన్ని వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. డాగ్‌స్క్వాడ్ హత్య జరిగిన స్థలం నుంచి వెంకటగిరి– నాయుడుపేట రోడ్డు మార్గంలో తూర్పు నాయుడుపేట వైపు కొంత దూరం వెళ్లింది. అక్కడి నుంచి వెంకటగిరి వైపు 100 మీటర్లు వెళ్లి తిరిగి ఘటన స్థలానికి చేరుకుంది. స్నేహితులే హత్య చేసి ఉంటారు చదువుకునే సమయంలో శ్రీను మాధురి అనే అమ్మయిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోకపోవడంతో ఆమె స్నేహితులతో కలిసి హత్య చేసి ఉంటుందని మృతుడు భార్య కౌశల్య, బంధువులు పోలీలకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని పో లీసులు పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
టీడీపీ నేత మాదాల శ్రీను నిర్వాకం
కృష్ణాజిల్లా ,తుళ్లూరు: అధికార దర్పంతో టీడీపీ నేతలు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. ఈ సారి రాజధాని ప్రాంతమైన తుళ్లూరు మండల పరిధిలోని మందడం గ్రామ పంచాయతీ కార్యదర్శి గద్దె రామ్‌హనుమాన్‌పై టీడీపీ నేత ఒకరు పంచాయతీ కార్యాలయంలోనే దుర్భాషలాటకు దిగడంతో పాటు దాడికి పాల్పడ్డాడు. మందడం పంచాయతీ కార్యాలయంలో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తుళ్లూరు డీఎస్పీ శ్రీనివాసరావు కథనం మేరకు....మందడం గ్రామానికి చెందిన టీడీపీ నేత మాదాల శ్రీనివాసరావు గతంలో తన స్థలాన్ని మరొక వ్యక్తికి తనఖా పెట్టాడు. గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి హయాంలో ఈ స్థలానికి సంబంధించిన పన్ను రశీదులను మాదాల శ్రీనుకు ఇవ్వకుండా తన సోదరుడికి ఎలా ఇస్తారని ప్రస్తుత పంచాయతీ కార్యదర్శిపై సోమవారం మధ్యాహ్నం వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగిపై దాడి చేసినందుకు మంగళవారం 332, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే అనుచరుడిని అంటూ.... దీనికి తోడు టీడీపీ నేత మాదాల శ్రీను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ అనుచరుడుని అంటూ.. మందడం, వెలగపూడి, మల్కాపురం గ్రామాల్లోని ఖాళీ స్థలాను ఆక్రమించుకున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలో పనిచేసిన రెవెన్యూ, పంచాయతీ అధికారులపై సైతం బెదిరింపులకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ప్రస్తుత మందడం కార్యదర్శిపై దాడికి దిగి పంచాయతీ కార్యాలయానికి తాళాలు వేసి దౌర్జన్యానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ కలగజేసుకొని వివాదాన్ని సద్దుమనిగించే ప్రయత్నం చేశారని సమాచారం. మండల పరిషత్ కార్యాలయంలో రాజీ కోసం మంతనాలు! మంగళవారం తుళ్లూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో టీడీపీ నేత మాదాల శ్రీను బుధవారం ఉదయం నుంచే మండల పరిషత్ కార్యాలయంలో మండల టీడీపీ నాయకులతో వచ్చి పంచాయతీ కార్యదర్శికి సంబంధించిన ప్రభుత్వ అధికారుల వర్గంతో రాత్రి వరకు రాజీ కోసం మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. మాదాల శ్రీను జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యుడు, మందడం గ్రామ జన్మభూమి కమిటీ సభ్యుడు కావడంతో పార్టీ పరువు బజారున పడుతుందని ఓ స్థానిక టీడీపీ నాయకుడు ఈ వ్యవహారాన్ని జిల్లాకు చెందిన మంత్రి వద్దకు తీసుకెళ్లగా ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేశారని తెలిసింది. నియోజకవర్గానికి చెందిన ముఖ్య నాయకులు మాత్రం పట్టీపట్టనట్టు ఉన్నారని విశ్వసనీయ సమాచారం. -
ఎమ్మెల్యే నాపై కక్ష కట్టారు...
జామి: గజపతినగరం ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు తనపై కక్ష కట్టారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ విజినిగిరి సర్పంచ్ కొమ్మినేని శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎమ్మెల్యే వేధింపులపై కేంద్ర మంత్రి అశోక్‌గజపతిరాజుకు చెందిన విజయనగరంలోని అశోక్ బంగ్లాలో మూడు పేజీల లేఖను అందజేశారు. ఎమ్మెల్యే నాయుడు, మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న గొర్రెపాటి శ్రీనువాసరావు కలసి తనను వేధిస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. పార్టీ కోసం పని చేయడమే తప్పా అని ప్రశ్నించారు. పార్టీకి ఎన్నో సేవలందించిన తనపై ఎమ్మెల్యే కక్ష కట్టారని ఆరోపించారు. పార్టీలో వర్గాలు ఏర్పాటు చేసి నష్టం కలుగజేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన పంచాయతీలో ఎటువంటి తీర్మానం లేకుండా రూ.70లక్షల పనులను వేరే వారికి అప్పగించారని ఆరోపించారు. తన చెక్‌పవర్‌ను రద్దు చేయించి, తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు పన్నాగం పన్నుతున్నారని ఆవేదన చెందారు. -
కైలాస గిరీశా! ‘ఫల’మేశా!
భగవంతునికి భక్తులు నివేదించే ఫలాలలో అరటి పండుదే అగ్రస్థానం. అటువంటి అరటి పండుతో శివ లింగాకారాన్ని మలచాడు ద్రాక్షారామకు చెందిన ఒక భక్తుడు. స్వతహాగా పెయింటర్ అయిన జి.శ్రీను కార్తికమాసాన్ని పురస్కరించుకుని ఇలా విలక్షణంగా శివార్చన చేశాడు. అరటి పండులో చూసే వారంతా భక్తితో చేయెత్తి నమస్కరిస్తున్నారు. – ద్రాక్షారామ (రామచంద్రపురం రూరల్) -
ఇద్దరి మధ్య ఘర్షణ..
- లారీ కిందపడి మృతి పోడూరు(పశ్చిమగోదావరి జిల్లా) పోడూరు మండలం కవిటంలో మంగళవారం దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చుట్టగుల్ల శ్రీను, తాడిపత్రి స్వామి(45) అనే ఇద్దరు వ్యక్తులు ఓ విషయంలో ఘర్షణ పడ్డారు. కోపంతో శ్రీను, స్వామిని తోసేయడంతో అదుపుతప్పి వెనకాలే వస్తున్న ఓ లారీ కిందపడ్డాడు. ముందు చక్రాలు అతనిపై వెళ్లడంతో స్వామి అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కదిలించిన ‘సాక్షి’ కథనం
జడ్చర్ల: కారు ప్రమాద ఘటనపై ‘సాక్షి’ దినపత్రికలో ‘మానవత్వం మరచి..’అన్న శీర్షికన ప్రచురితమైన కథనం పలువురి మనసులను కలచివేసింది. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టి.. కారు టాప్‌పై మృతదేహాన్ని రెండు కిలోమీటర్లు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ కథనాన్ని చదివిన ప్రతి ఒక్కరూ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమా దం జరిగిన వెంటనే కారును ఆపి చూస్తే.. శ్రీను బతికి ఉండేవాడేమోనన్న సందేహం వ్యక్తం చేశారు. కారు డ్రైవర్ ఇంత అమానుషంగా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండించారు. కాగా, ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కారు నంబర్ ఏపీ 28 సీకే 8477 ఆధారంగా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చంద్రకళ పేరున రిజిస్టర్ అయినట్లుగా గుర్తించారు. కారు కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా జడ్చర్ల వద్ద కేజీఎన్ దాబా వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుందని ఎస్ఐ జములప్ప తెలిపా రు. రిజిస్టర్ సమయంలో ఇచ్చిన మొబైల్ నం బర్కు ఫోన్ చేయగా ఎవరూ లిఫ్ట్ చేయడం లేదని చెప్పారు. స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్లి విచారించనున్నట్లు పేర్కొన్నారు. శ్రీను సంపాదనపైనే కుటుంబం జీవనం శ్రీనివాసులుకు తల్లి దేవమ్మ, భార్య మంగమ్మతో పాటు కుమారుడు శ్రీధ ర్, కూతురు రాజేశ్వరీ ఉన్నారు. ఇతను కొన్నేళ్లుగా స్థానిక పాత ఇనుప సామాను వ్యాపారి దగ్గర కూలీగా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం కూడా జాతీయరహదారి పక్కన పాత ఇనుము వ్యాపారంలో భాగంగా కొనుగోలు చేసిన ఓ వాహన విడిభాగాలను విడదీసేందుకు వెళ్లాడని, రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో పని ముగించుకుని ఇంటికి వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా ప్రమాదం చోటు చేసుకుందని భార్య మంగమ్మ రోదిస్తూ చెప్పారు. కుటుంబానికి భూమి, ఏ ఆధారం లేదని, కేవలం శ్రీను కూలీ సంపాదనపై మాత్రమే ఆధారపడి కుటుంబం గడుస్తుందని బంధువులు తెలిపారు. ప్రభుత్వపరంగా సాయమందించి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇంటికి తాళం.. నిందితులు పరారీ రోడ్డు దాటుతున్న శ్రీనివాసులను ఢీకొట్టి అతని మరణానికి కారణమైన వారి కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో గాలించినట్లు సీఐ గంగాధర్ తెలిపారు. కారునంబర్ ఆధారంగా ‘‘చంద్రకళ భర్త రాజశేఖర్‌రెడ్డి, వెంకట్రావునగర్, కూకట్పల్లి, హైదరాబాద్’ పూర్తి చిరునామాగా కనుగొన్నారు. జడ్చర్ల ఎస్ఐ మధుసూదన్‌గౌడ్, తదితర బృందం ఆ చిరునామా ప్రకారం.. మంగళవారం వెంకట్రావునగర్లోని ఇంటికి వెళ్లగా తాళం వేసి ఉంది. ఇంట్లోవాళ్లు పరారీ అయినట్లు సీఐ తెలిపారు. దీంతో వారిపై కారును వేగంగా నడిపి వ్యక్తి మృతికి కారణమవడమే గాక, సాక్ష్యాధారాలను నాశనం చేశారన్న అభియోగంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ చెప్పారు. -
రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు
-
మానవత్వం మరచి!
- రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టిన కారు - టాప్‌పై ఎగిరిపడి ప్రాణాలు వదిలిన వైనం - కిలోమీటరున్నర దూరం ఆపకుండా వెళ్లిన డ్రైవర్ - యువకులు వెంబడించడంతో కారు వదిలి పరార్ జడ్చర్ల: ‘మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు.. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడు..’ సమాజంలో రానురాను కరువవుతున్న మానవత్వం చిరునామాను వెతుకుతూ ఓ కవి హృదయం పడ్డ ఆవేదన ఇదీ! దీనికి అద్దంపట్టే ఘటన తాజాగా మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో జరిగింది. జడ్చర్లలో నిమ్మబాయిగడ్డకు చెందిన శ్రీను (35) రోడ్డు దాటుతుండగా ఎరుపు రంగు చవర్లేట్ కారు వేగంగా వచ్చి ఢీకొంది. దీంతో ఒక్క ఉదుటున శ్రీను కారుపై భాగంలో ఎగిరిపడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. అయినా కారును కనీసం ఆపకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చాడు. కారుపై మృతదేహంతోనే సుమారు కిలోమీటరున్నర దూరం వెళ్లాడు. దీన్ని గమనించిన కొందరు యువకులు బైక్‌లపై వెంబడించగా.. మాచారం గ్రామానికి కొద్దిదూరంలో బ్రిడ్జి వద్ద కారును వదిలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో జడ్చర్లకు సమీపంలో 44వ జాతీయ రహదారిపై ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆ యువకులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అక్కడికి వెళ్లి కారును స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని బాదేపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కారు హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన చంద్రకళ అనే మహిళ పేరిట రిజిస్టర్ అయినట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు కూలీ పనులు చేసుకుంటూ పొట్టపోసుకుంటున్నట్టు సమాచారం. -
శ్రీనుకు డాక్టరేట్
ఏయూక్యాంపస్: ఆంధ్రవిశ్వవిద్యాలయం రసాయన శాస్త్ర విభాగ పరిశోధక విద్యార్థి బోగి శ్రీనుకు వర్సిటీ డాక్టరేట్ లభించింది. మంగళవారం ఉదయం ఏయూ వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉత్తర్వులను అందించారు. విభాగ ఆచార్యులు డాక్టర్ బి.బి.వి శైలజ పర్యవేక్షనలో ‘కెమికల్ స్పెసిఫికేషన్ స్టడీస్ ఆన్ ఎల్–ఏస్పిరజిని అండ్ గై ్లగిజిని కాంప్లెక్సెస్ విత్ సమ్ ఎసన్షియల్ మెటల్ అయాన్స్ ఇన్ ఆక్వా–ఆర్గానిక్ మిక్సర్స్’ అంశంపై తన పరిశోధన జరిపారు.జీవసంబంధ లైగండ్‌లను ఉపయోగించి ఆవశ్యకత, లోహ అయానులతో సంశ్లిష్ట సమ్మేళనాల స్తిరత్వాన్ని, కంప్యూటర్ మోడలింగ్ స్టడీద్వానా జరిపిన అధ్యయనానికి డాక్టరేట్ లభించింది. -
అగ్గిపుల్ల వెలిగించి ... దొరికిపోయాడు
కాకినాడ : ఓ చిన్న క్లూ భారీ చోరీ కేసును ఛేదించింది. దొంగతనాల్లో ఆరితేరిన వాడిని అగ్గిపెట్టి పట్టించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం కాకినాడలో ఎస్పీ రవీ ప్రకాష్ విలేకర్లకు వెల్లడించారు. సీతానగరం మండలం రఘుదేవపురానికి చెంఇన తూము శ్రీనివాస్ అలియాస్ శ్రీను (33) ఇంటర్ చదివాడు. చెడు అలవాట్లకు బానిసై చోరీల బాట పట్టాడు. 2004లో మోటర్ సైకిల్ చోరీ కేసు... 2011 ట్రాక్టర్ చోరీ కేసులో జైలుకెళ్లాడు. మధ్యలో 2010లో కాకినాడలో శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ ఫైనాన్స్ కంపెనీలో ఉద్యోగానికి చేరి రూ. 50 వేలు సంస్థ సొమ్ము స్వాహా చేయడంతో అతన్ని తొలగించారు. భారీ చోరీ చేసి ట్రావెల్స్ సంస్థ పెట్టుకుని సెటిలవ్వాలని భావించాడు. ఆ క్రమంలో తాను పని చేసిన కంపెనీనే ఎంచుకున్నాడు. గత ఏడాది నవంబర్ 29వ తేదీన సదరు ఆపీసును గమనించాడు. 30 రాత్రి కారులో వచ్చి, మంకీ క్యాప్ ధరించి కిటికీ గ్రీల్స్ తొలగించి... బ్రాంచ్ మేనేజర్ రూంలో ప్రవేశించాడు. మేనేజర్ రూమ్‌లోని క్యాష్ చెస్ట్‌లో నుంచి 230.81 గ్రాముల బంగారంతోపాటు, రూ. 17.75 లక్షల నగదు చోరీ చేశారు. అలాగే నాలుగు కంప్యూటర్లు, ఓ ప్రింటర్, రెండు కుర్చిలు కూడా కారులో వేసుకెళ్లిపోయాడు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కొంతమందిని అనుమానించారు. అయితే శ్రీనివాస్ పథకం ప్రకారం చోరీ చేసిన నేపథ్యంలో గది అంతా చీకటిగా ఉంది. దీంతో ఓ మూల ఉన్న అగ్గిపెట్టి తీసి వెలిగించాడు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఆ గదిలో అగ్గిపెట్టి ఎక్కడ ఉంటుందో సిబ్బందికి మాత్రమే తెలుస్తుందని భావించిన పోలీసులు ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. ఆఫీసులో పనిచేసి మానేసిన వారిపై నిఘా పెట్టారు. ఆ క్రమంలో శ్రీనివాస్‌పై అనుమానంతో అదుపులోకి తీసుకుని.. తనదైన శైలిలో ప్రశ్నించారు. దీంతో అతడు చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. అతడి వద్ద నుంచి నగలు, నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
భారీగా వెండి ఆభరణాలతో వ్యక్తి పట్టివేత
సికింద్రాబాద్: భారీగా వెండి ఆభరణాలను రవాణా చేస్తున్న ఓ వ్యక్తిని సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్‌కు వచ్చిన కె.శ్రీను అనే వ్యక్తిని పోలీసులు తనిఖీ చేశారు. అతడి వద్ద 28.7 కిలోల వెండి ఆభరణాలను గుర్తించారు. సరైన పత్రాలు లేకపోవడంతో అతడ్ని అదుపులోకి తీసుకుని వాణిజ్య శాఖ అధికారులకు అప్పగించారు. -
పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను!
సంభాషణం: కామెడీని పండించడంలో శ్రీనుకి ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అదే ఆయనను ఈ రోజు బిజీ ఆర్టిస్టును చేసింది. విక్రమార్కుడు, మిస్టర్ ఫర్ఫెక్ట్, గబ్బర్‌సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు తదితర చిత్రాల్లో తన విభిన్నమైన యాసతో, వైవిధ్య భరితమైన హావభావాలతో కడుపుబ్బ నవ్వించిన శ్రీను చెప్పిన విశేషాలివి... నటుడు అవ్వాలని అయ్యారా? అనుకోకుండా అయ్యారా? అది చెప్పాలంటే పెద్ద ఫ్లాష్‌బ్యాక్ చెప్పాలి. నేను ‘తగరపు వలస’లో పుట్టాను. హైదరాబాద్‌లో పెరిగాను. చిన్నప్పట్నుంచీ చదువు కంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీదే ఆసక్తి. ఓసారి నేను ఇంట్లో డ్యాన్స్ చేస్తుంటే అమ్మ చూసింది. ‘డ్యాన్స్ అంటే ఏమిటో చూపిస్తాను చూడు’ అంటూ క్లాసికల్ డ్యాన్స్ చేయడం ప్రారంభించింది. సాధారణ గృహిణిలా ఉండే అమ్మలో ఇంత టాలెంట్ ఉందా అని ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు కొన్నాళ్లపాటు నేర్చుకునే స్థోమత లేక వదిలేసిందట. దాంతో నేనైనా మంచి డ్యాన్సర్‌ని అవ్వాలనుకున్నాను. పెళ్లిళ్లకీ, ఫంక్షన్లకీ ప్రోగ్రాములివ్వసాగాను. అది చూసి నాన్నగారు, తన స్నేహితుడు శరత్‌బాబు (నటుడు) దగ్గర నా గురించి ప్రస్తావించారు. చదవడం లేదు, ఎప్పుడూ డ్యాన్సులవీ అంటాడు అని చెబితే... ఆయన నన్ను మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్చమని సలహా ఇచ్చారు. నాన్న అది ఫాలో అయిపోయారు. నాన్న చెప్పింది నేను ఫాలో అయిపోయాను. అంటే మీకు ఆసక్తి లేకుండానే చేరారా? దాదాపు అంతే. అయితే అక్కడ చేరాక బాగా ఆసక్తి పెరిగింది. తర్వాత సత్యానంద్‌గారి దగ్గర శిక్షణకు చేరాను. అక్కడే నాకు ప్రభాస్ పరిచయమయ్యాడు. ఇద్దరం స్నేహితులమయ్యాం. తను చెప్పాడు, ‘నాతో ఉండు, పరిచయాలు పెరుగుతాయి, మెల్లగా మంచి అవకాశాలు వస్తాయి’ అని. దాంతో పదేళ్లపాటు ప్రభాస్ వెంటే ఉన్నాను. సర్వం చూశాను. అందుకేనా మిమ్మల్ని ‘ప్రభాస్ శ్రీను’ అంటారు? అవును. శ్రీను అనేది మామూలు పేరు కదా. ప్రభాస్ శ్రీను అంటే వెరైటీగా ఉంటుందని అలా కంటిన్యూ అయిపోయాను. నా ఫ్రెండ్స్ అంటూంటారు... ‘ఆడపిల్లకి పెళ్లయ్యాక ఇంటిపేరు మారుతుంది. కానీ ఇంటిపేరు మారిన మొట్టమొదటి మగాడివి నువ్వే’ అని. అంటే పదేళ్లపాటు అవకాశాలే రాలేదా? చిన్న చిన్న అవకాశాలు వస్తే చేశాను. ‘విక్రమార్కుడు’తో బ్రేక్ వచ్చింది. ‘గబ్బర్‌సింగ్’ తర్వాత బిజీ అయిపోయాను. ఇంతమంది కమెడియన్స్ మధ్య ఎలా నిలబడగలుగుతున్నారు? మీ పళ్లు మెరిసిపోతాయి అంటూ బోలెడు పేస్ట్ కంపెనీలు ప్రకటనలిస్తాయి. కానీ ‘కాల్గేట్’ వాడే వాడు దాన్నే వాడతాడు. అలాగే ఎందరు నటులున్నా ఏ పాత్రకు పనికొచ్చే నటుడిని ఆ పాత్రకు తప్పక తీసుకుంటారు దర్శకులు. కాబట్టి నాకు తగ్గవి నాకే వస్తాయి. అయినా ఎవరి టాలెంట్ వారిది. ఒకరిలా అవ్వాలనుకుంటే అవ్వలేం. బ్రహ్మానందం గారినే తీసుకోండి. ఆయనలాంటివాడు మరొకడు లేడు, రాడు. ఆయన సరస్వతీ పుత్రులు. ఆయన నుంచి ఎన్నో నేర్చుకోవచ్చు. కానీ ఆయన స్థాయికి చేరడం మాత్రం ఏ ఒక్కరికీ సాధ్యం కాదు. డ్రీమ్‌రోల్ ఏదైనా ఉందా? ‘ఇలాంటిది చేయాలి’ అనుకోను కానీ, ఎప్పుడూ పని చేస్తూనే ఉండాలనుకుంటాను. చిన్నదా పెద్దదా, రెమ్యునరేషన్ ఎక్కువా తక్కువా అని చూడను. పాతిక రూపాయలిచ్చినా నటిస్తాను. నాన్నగారిలా ఏ కలెక్టరో అయ్యుంటే బాగుండేదని అనిపించలేదా? లేదు. ఒకప్పుడు నన్ను ఎర్రయ్యగారి అబ్బాయనేవారు. ఇప్పుడు నాన్నను సిద్ధప్ప శ్రీను (గబ్బర్‌సింగ్‌లో పాత్ర) వాళ్ల నాన్నగారు అంటున్నారట. మేం కొన్నాళ్లు నరసన్నపేటలో ఉన్నాం. ఆ ఊరి వినాయకుడి వల్లే మేమంతా బాగున్నామని నమ్ముతాం. అందుకే ఇరవై మూడేళ్లుగా అక్కడ యేటా వినాయక చవితి ఘనంగా చేస్తున్నాం. నాన్న బిజీగా ఉండటం వల్ల ఈ యేడు పండుగ ఎలా చేయాలా అని టెన్షన్ పడ్డారు. దాంతో నేనే కొన్ని లక్షలు ఖర్చుపెట్టి మొత్తం చేయించేశాను. పండక్కి వచ్చిన నాన్న రైలు దిగుతూనే వచ్చి నన్ను వాటేసుకుని ఏడ్చేశారు. ‘ఇంకేం కావాల్రా నాన్నా నాకు’ అన్నారు. ఓ కొడుకుగా అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది నాకు! భవిష్యత్ ప్రణాళికలేంటి? పెద్దగా ఏం లేవు. నేనెప్పుడూ నా కూతురు సాయివర్ణిక గురించే ఆలోచిస్తుంటాను. నటించినా, వ్యాపారం చేసినా, మరింకేదైనా చేసినా... నా కూతురికి ఓ గొప్ప జీవితాన్నివ్వడమే నా జీవిత లక్ష్యం. తననూ మీ దారిలో నడిపిస్తారా? లేదు. వెంకటేష్గారిలా ఒక్కసారి ఇంటికి చేరిన తర్వాత మళ్లీ సినిమా వాతావరణం కనిపించకూడదు అనుకుంటాను నేను. నా కూతుర్ని కూడా ఇండస్ట్రీకి దూరంగానే ఉంచుతాను. ఒకవేళ తను అవుతానంటే? ఐస్‌క్రీమ్ తింటే జలుబు చేస్తుందని చెబుతాం. అయినా మారాం చేస్తే ఏం చేస్తాం! తనను నాకు నచ్చినట్టుగా పెంచుతాను. తనకి నచ్చినవీ ఇస్తాను. ఏం చేసినా కానీ... నాకైనా, నా భార్య విజయకైనా పాప సంతోషమే ముఖ్యం. (నవ్వుతూ) అయినా తనకిప్పుడు మూడున్నరేళ్లే. ఇవన్నీ ఆలోచించడానికి చాలా టైముంది. చూద్దాం ఏం జరుగుతుందో! - సమీర నేలపూడి -
ఓ చిన్న మార్పు కోసం!
ఉరుకులు పరుగులు పెట్టే ఉద్యోగం చేసేటప్పుడు ఓ చిన్న మార్పు కోసం విశ్రాంతి కోరుకుంటాం. అలాగే, ఒకే విధమైన వస్త్రధారణతో విసిగిపోయినప్పుడు ఓ చిన్న మార్పు కోరుకుని, వెరైటీలు ట్రై చేస్తాం. ఆ విధంగా మార్పు అనేది మన జీవితంలో ఓ భాగమైంది. ఇదే అంశాన్ని ప్రధానాంశంగా చేసుకుని ‘చిత్రం’ శ్రీను, రిత్విక జంటగా ఒంగోలు సురేష్ నిర్మిస్తున్న చిత్రం ‘జస్ట్ ఫర్ చేంజ్’. సీహెచ్ శంకర్ దొర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. త్వరలో పాటలను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రంలో హీరో ఎలాంటి మార్పు కోరుకున్నాడు? అనేది తెరపై చూస్తేనే ఆసక్తికరంగా ఉంటుందని నిర్మాత అన్నారు. కానూరి రమణ మంచి పాటలు స్వరపరిచారనీ, కథ, కథనం ప్రధాన ఆకర్షణ అవుతాయనీ, ‘చిత్రం’ శ్రీనుది చాలా మంచి పాత్ర అని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: బెల్లంకొండ సాహిత్యన్, కెమెరా: ఆనంద్ మురుపూర్తి. -
రైతు ఉసురు తీసిన బ్యాంకు నోటీసు
చింతపల్లి: ఆరుగాలం కష్టపడినా ఆ రైతుకు అప్పులే మిగిలాయి. తనకున్న రెండెకరాల పొలాన్ని నమ్ముకుని వ్యవసాయం చేస్తే కాలం కలిసి రాలేదు. నీరు లేక, సకాలంలో కరెంటు రాక పంట సరిగా పండలేదు. అయినా నిరాశ చెందలేదు. వ్యవసాయమంటే అతడికి ప్రాణం. ఈసారైనా అదృష్టం కలిసిరాక పోతుం దా.. అని మళ్లీ నాగలి పట్టాడు. కట్టుకున్న భార్యను ఒప్పించి బంగారు నగలను బ్యాంకులో తాకట్టు పెట్టాడు. రుణాలు తెచ్చి పొలంలో పోశాడు. మళ్లీ అప్పులే దిగుబడిగా వచ్చాయి. అంతే! ఇంతలో యమదూతలా బ్యాంకు నోటీసు ఇంటికి రానే వచ్చింది. అప్పులు తీర్చే మార్గం కానరాక ఆత్మహత్య చేసుకున్నాడు.‘బంగారు ఆభరణాలపై తీసుకున్న రుణం రెండు రోజుల్లో చెల్లించాలి.. లేకుంటే తాకట్టుపెట్టిన బంగారం వేలం వేస్తాం’ అంటూ బ్యాంకు అధికారు లు పంపిన నోటీసు ఓ యువరైతు ఊపిరి తీసింది. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం నసర్లపల్లి గ్రామానికి చెందిన జంగిటి శ్రీను(32) తన రెండెకరాల భూమి పత్రాలను చింతపల్లి గ్రామీణ వికాస్‌బ్యాంకులో పెట్టి గత ఏడాది రూ.40 వేలు, బంగారు ఆభరణాలు తాకట్టుతో మరో రూ.48 వేలు అప్పుగా తీసుకున్నాడు. పంట సరిగా పండకపోవడంతో అప్పు తీర్చలేకపోయాడు. కాగా, బంగారు ఆభరణాలను వేలం వేయునున్నట్లు మూడు రోజుల క్రితం శ్రీనుకు బ్యాంకు నోటీసు అందింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై వుంగళవారం తన పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకున్నాడని బాధితుని కుటుంబసభ్యులు, పోలీసులు తెలిపారు. -
మంచినీ, చెడునూ చరిత్ర చెబుతుంది
మంచి అయినా, చెడు అయినా చరిత్ర చెబుతుంది. సాధారణంగా మంచి కంటే చెడుకే ప్రచారం ఎక్కువ. దర్శకుడు శ్రీమహేశ్ చరిత్తిరం పేసు (చరిత్ర చెబుతుంది) అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మరి ఈ చిత్రంలో ఏ విషయం గురించి చరిత్ర చెబుతుందో ఆయన మాటల్లోనే చూద్దాం. తాను తన పని అంటూ జీవించే హీరోకు, తన స్నేహ బృందానికి ఒక సంఘటన ఆగ్రహాన్ని కలిగిస్తుంది. ఆ సంఘటన ఏమిటి? వారి ఆగ్రహం ఎలాటి పరిణామాలకు దారి తీసింది? తదితర పలు ఆసక్తికరమైన అంశాల సమాహారమే చరిత్తిరం పేసు చిత్రం. ప్రేమ, హాస్యం, యాక్షన్ అంశాలమయంగా ఈ చిత్రం ఉంటుంది. అయ్యనార్ ఫిలింస్ పతాకంపై యోగేశ్వరన్ బోస్ నిర్మిస్తూ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో పసంగ ఫేమ్ ధారణి హీరోయిన్గా పరిచయమవుతోంది. డాక్టర్ శరవణన్, కృపా, కనిక, గంజా కరుప్పు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జగదీష్ విశ్వం చాయాగ్రహణాన్ని జయకుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు. -
స్వర్గంలో ఉన్న ‘అమ్మ రమ్మంటుంది’ అంటూ...
తండ్రి మరణించాడు... కొన్నాళ్లకు తల్లీ మరణించింది... విధి ఆ చిన్నారులను ఆనాధలను చేసింది. వారిని చేరదీసిన నాయనమ్మే అన్నీయై చూసుకుంది. కానీ ఆ తల్లిని మరిపించలేకపోయింది. దీంతో స్వర్గంలో ఉన్న ‘అమ్మ రమ్మంటుంది’ అంటూ... లేఖ రాసిపెట్టి పన్నేండేళ్లు వయస్సున్న ఆ చిన్నారి కన్నుమూసింది. దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన మౌనిక అనే చిన్నారి ఆత్మహత్య ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. అయితే తల్లిదండ్రులు మరణించడంతో ఆ చిన్నారులు ఆనాధలవ్వడం, వారి పేదరికం, ఆ కుటుంబం దైన్యంపై ‘సాక్షి’ గతంలో పలు కథనాలను ప్రచురించింది. దీనికి స్పందించిన ఉన్నతాధికారులు, మానవ, ధృక్పథం గల పలువురు ఆసరా కూడా అయ్యారు. కానీ కమ్మనైన అమ్మప్రేమను ఎవరు మరిపించగలరు? అందుకేనేమో అమ్మ ఆలోచనలతో ఆ పన్నెండెళ్ల చిన్నారి మూడు రోజుల క్రితం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా.. తాటికోల్ గ్రామానికి చెందిన శ్రీను-అలివేలు దంపతులకు ఇద్దరు కుమార్తెలు. శ్రీను సారాకు బానిసై రెండు కిడ్నీలు చెడిపోవడంతో పేదరికంతో వైద్యం చేయించుకోలేక 8 ఏళ్ల క్రితం మరణించాడు. దీంతో ముక్కుపచ్చలారని ఆ ఇద్దరి చిన్నారుల బాధ్యత ఆ తల్లిపై పడింది. కూలి పనిచేసి ఉన్నదాంట్లో ఆ ఇద్దరు పిల్లలను సాకింది. కానీ, విధి వక్రించడంతో ఆ చిన్నారుల తల్లి అలివేలుకు క్యాన్సర్ సొకి గత ఏడాదే చనిపోయింది. దీంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాధలయ్యారు. కనీసం తిండికి కూడా లేని పరిస్థితి. తల్లిదండ్రుల మరణంతో ఆనాధలైన ఆ చిన్నారుల ఉదంతాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. దీంతో కొంతమంది దాతలు ఆ కుటుంబానికి ఆసరా అయ్యారు. అలివేలు పెద్ద కుమార్తె రూప 10వ తరగతి పూర్తి చేసి, ఇంటర్ చదవలేకపోతుండడం, చిన్న కుమార్తె మౌనిక బాధ్యత నాయనమ్మ నర్సమ్మకు భారంగా మారడంతో వారి దీనావస్థపై ‘సాక్షి’ మళ్లీ కథనం ప్రచురించింది. దీంతో ఓ సంస్థ రూపను ప్రైవేట్ కళాశాలలో చదివించడానికి ముందుకొచ్చారు. మౌనికను దేవరకొండలోని కస్తూరిబా ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చేర్పించారు. స్పందించిన కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీఓ వారికి రేషన్ కార్డు మంజూరు చేయడంతోపాటు రూ.5వేల ఆర్థిక సహయం అందజేశారు. దీంతో పాటు వారితో బ్యాంక్ అకౌంట్ తీయించి తన స్నేహితుల ద్వారా సహాయానికి పూనుకున్నారు. కానీ, ఇంతలోపే మరో అనర్ధం జరిగిపోయింది. తల్లి జ్ఞాపకాలను మరిచిపోని ఆ పసి హృదయం ప్రతి రోజు కలవరించింది. తల్లిలేని ఈ లోకంలో నేనుండలేనంటూ మదనపడింది. నా చావుకు ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసింది. అక్కను మంచిగా చూసుకోండంటూ లేఖలో నాయనమ్మకు బాధ్యతలు అప్పగించింది. నాకు ఇప్పుడే తృప్తిగా ఉందంటూ లేఖ వదిలి ఇంటికి వెళ్లివస్తానని పాఠశాలలో చెప్పి నాయనమ్మ దగ్గరకు వెళ్లింది. నాయనమ్మ బయట ఉన్న సమయంలో చున్నీతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒకటి, రెండూ, మూడు... ఒకటి, రెండూ, మూడు... చూస్తుండగానే మూడు ప్రాణాలు పేదరికంలో కొట్టుమిట్టాడి ఓడిపోయి మరణించాయి. ఇక మిగిలింది 80 సంవత్సరాల వృద్దాప్యంతో పోటీపడుతున్న నాయనమ్మ నర్సమ్మ.., తల్లి, తండ్రి.. నిన్నమొన్నటి వరకు కలిసిమెలిసి తనతో కలిసి తిరిగిన చెల్లాయిని పోగొట్టుకున్న రూప మాత్రమే. అయితే వీరిని ఆదుకోవాల్సిన అధికారులు ఆర్థిక సహాయం వరకే తమ బాధ్యతగా భావిస్తున్నారు. కానీ, వారికి ఈ వయస్సులో కావాల్సింది ఆర్థిక సాయం కాదు.. మేమున్నామనే మనోైధైర్యం. భవిష్యత్తుకు భరోసా. రూప జీవితానికైనా మంచి భవిష్యత్తుంటుందని ఆకాంక్షిద్దాం. -
కార్మికుల బతుకులు ఆగం
చిట్యాల, న్యూస్‌లైన్: చిట్యాల శివారులోని ఐడీఈఎల్ ఎక్స్ ప్లోజివ్ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజాము న జరిగిన ప్రమాదానికి రియాక్టర్లలో ఉష్ణోగ్రత పెరగడమే కారణమని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పరిశ్రమలోని డైయింగ్ ప్లాంట్ యూనిట్లో పీఈటీఈఎన్(పెంటా ఎరిత్రాటాల్ ట్రై నైట్రేట్) అనే పేలుడు పదార్థం తయారవుతుంది. దీనిని డిటోనేటర్లలోని ఫ్యూజులో పేలుడు కోసం వాడతారు. ఈ పదార్థాన్ని ద్రవరూపం నుంచి ఘనరూపంలోకి రెండు రియాక్టర్ల ద్వారా మారుస్తారు. మార్చే సమయంలో రియాక్టర్లలో తగినంత ఉష్ణోగ్రత ఉండాలి. కానీ ప్లాంట్‌లో ప్రమాదం జరిగిన సమయంలో రియాక్టర్లలో నిర్ణీత ఉష్ణోగ్రత దాటిపోయినట్టు తెలుస్తోంది. దీంతో పేలుడు సంభవించినట్టు పలువురు కార్మికులు చెబుతున్నారు. పరిహారం చెల్లించాలని రాస్తారోకో ప్రమాదంలో మృతిచెందిన శ్రీను కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని బంధువులు, వివిధ పార్టీల నాయకులు చిట్యాల-రామన్నపేట రోడ్డుపై రాస్తారోకో చేశారు. సుమారు మూడు గంటలపాటు రాస్తారోకో చేశారు. మృతుని కుటుంబాలకు పరిహారం చెల్లించాలని నాయకు లు డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇచ్చేం దుకు పరిశ్రమ యజమాన్యం ఒప్పుకోవడంతో వారు ఆందోళన విరమించారు. పలువురి సందర్శన సంఘటనా స్థలాన్ని భువనగిరి డీఎస్పీ శ్రీనివాస్, ఫోరెన్సిక్ నిపుణురాలు శారద, స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలు సందర్శించారు. ప్రమాదం జరిగిన తీరును పరిశ్రమ డెరైక్టర్ శ్రీనివాస్‌రావును అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతాన్ని పరిశీలించిన వారిలో మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, సీపీఐ నియోజకవర్గ ఇన్చార్జ్ నూనె వెంకటస్వామి, టీడీపీ నల్లగొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కంచర్ల భూపాల్‌రెడ్డి, నాయకులు కోమటిరెడ్డి చినవెంకట్‌రెడ్డి, రేగెట్టె మల్లికార్జున్‌రెడ్డి, పాటి నర్సిరెడ్డి, గొదుమగడ్డ జలెందర్‌రెడ్డి, నారబోయిన శ్రీనివాస్, కూనూరు సంజయ్‌దాస్‌గౌడ్, చికిలంమెట్ల అశోక్, గోశిక వెంకటేశం తదితరులు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కొండాపురం, న్యూస్‌లైన్ : పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తూర్పుజంగాలపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరవలింగం ఎరుకలయ్య (55) శుక్రవారం పొలంలో వరినారు పోశాడు. శనివారం ఉదయం నారుమడిని చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ మోటారు వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. అయితే ఎరుకులయ్య మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు శ్రీను పొలం వద్దకు వెళ్లి చూడగా మోటారు వద్ద తండ్రి మృతి చెంది ఉండడాన్ని గుర్తించాడు. మృతుడికి భార్య రమణమ్మ, కుమారుడు శ్రీను ఉన్నారు.