పోస్టర్ ఆవిష్కరిస్తున్న హోంమంత్రి మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్‌ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు.
రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment