Rajyadhikaram
-
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
మళ్లీ ఊపిరి పోసింది
‘‘ఓటు మనింటి ఆడబిడ్డ లాంటిది. ఆడబిడ్డకు పెళ్లి చేసేటప్పుడు... కుర్రాడి అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసినట్టే... ఓటు వేసేటప్పుడు ఆ అభ్యర్థి ఎలాంటోడు? కేరక్టర్ ఎలాంటిది? అనే విషయాలు కూడా గమనించాలి... ఇది దాదాసాహెబ్ అంబేద్కర్ మాట. మా ‘రాజ్యాధికారం’ చిత్రానికి ప్రేరణ ఈ మాటే’’ అన్నారు ఆర్.నారాయణమూర్తి. ఆయన నాలుగు పాత్రలు పోషించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శితమవుతోందని నారాయణమూర్తి చెబుతూ-‘‘ఆరోవారం కూడా విజయవంతంగా ఎనిమిది సెంటర్లలో ప్రదర్శితమవుతోంది. నేను పోషించిన నాలుగు పాత్రల్లో తండ్రి పాత్రకు, అమాయకుడైన అర్జునుడి పాత్రకు మంచి స్పందన లభిస్తోంది. నటునిగా, దర్శకునిగా, నిర్మాతగా నాకు మళ్లీ ఊపిరి పోసిన సినిమా ఇది’’ అన్నారు. బడుగు, బలహీన వర్గాలపై అణచివేత ఆగకపోతే... తిరుగుబాటు తప్పదని హెచ్చరించిన సినిమా ఇదనీ, ఒక మంచి సందేశాత్మకంగా తీసిన ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు వందనాలనీ నారాయణమూర్తి అన్నారు. -
ఎర్రజెండా ఉన్నంతవరకూ నారాయణమూర్తి గుర్తుంటాడు : కె. రాఘవేంద్రరావు
‘‘మేం ఏసీ గదుల్లో కూర్చుని కథలు రెడీ చేస్తుంటే, నారాయణమూర్తి ఎర్రటి ఎండలో రోడ్ల మీద నడుస్తూ కనిపిస్తాడు. అప్పుడు కథలు అల్లుకుంటాడు. ఎర్రజెండా ఉన్నంతకాలం అతను గుర్తుంటాడు’’ అని సీనియర్ దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ఆర్. నారాయణమూర్తి స్వీయదర్శకత్వంలో నిర్మించి, నాలుగు పాత్రలు పోషించిన చిత్రం ‘రాజ్యాధికారం’. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. బుధవారం హైదరాబాద్‌లో ప్లాటినమ్ డిస్క్ వేడుక జరిపారు. ఈ వేడుకలో పాల్గొన్న రాఘవేంద్రరావు మాట్లాడుతూ,‘‘1980లో నేను దర్శకత్వం వహించిన ‘మోసగాడు’లో స్వాతంత్య్ర దినోత్సవానికి సంబంధించిన పాటలోని ఒక్క లైన్‌కి జాతీయ జెండా పట్టుకుని నారాయణమూర్తి చాలా ఆవేశంగా నటించాడు’’ అంటూ అప్పటి సంగతులు గుర్తుచేసుకున్నారు. రచయిత, దర్శకుడు జేకే భారవి, ప్రజా గాయకుడు గద్దర్, ప్రజా కవులు జయరాజు, గిద్దె రామనర్సయ్య, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. గద్దర్ మాట్లాడుతూ -‘‘సినిమా ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేయడం గొప్ప విషయం. గత ముప్ఫై ఏళ్లుగా నారాయణమూర్తి ఈ దిశగానే సినిమాలు తీస్తున్నారు. ఇలాంటి మంచి చిత్రాలకు మా వంతు సహకారం అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం’’ అన్నారు. మంచి, చెడుల మధ్య పోరాటమే ఈ చిత్రమని నారాయణమూర్తి పేర్కొన్నారు. -
‘రాజ్యాధికారం’ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్
-
ఇలాంటి ప్రయత్నం నాకిదే ప్రథమం!
వార్డు మెంబర్ అవ్వాలంటే అయిదు కోట్లు, ఎమ్మెల్యే అవాలంటే పాతిక కోట్లు , ఎంపీ అవ్వాలంటే 50 కోట్లు... రాజకీయం వ్యాపారం అయిపోయింది. ఇలా డబ్బు వెదజల్లి పదవులు పొందిన వాళ్లు ప్రజాసేవ చేస్తారా? ఖర్చుపెట్టిన దానికి అంతకంత సంపాదించుకుంటారా? ఇది ధనస్వామ్యమా? ప్రజాస్వామ్యమా? డబ్బు లేని సామాన్యుడు ప్రజాసేవ చేయడానికి అనర్హుడైతే... ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం అని పిలిపించుకునే హక్కు మన దేశానికి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానంగా ఆర్. నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఈ సినిమాలో ఆయన నాలుగు పాత్రలు పోషించడం విశేషం. అలాగే... ప్రతినాయకునిగా నటించిన తనికెళ్ల భరణి కూడా ఇందులో ద్విపాత్రాభినయం చేశారు. స్వీయ దర్శకత్వంలో నటించి, ఆర్. నారాయణమూర్తి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ఇందులో దళిత రైతు రామయ్య పాత్రతో పాటు ఆయన ముగ్గురు కొడుకులుగా కూడా నేనే నటించాను. ఇందులో ఒకటి అమాయకమైన పాత్ర అయితే, రెండోది ముస్లిం ఛాయలున్న పాత్ర. మూడో పాత్ర కూడా భిన్నంగా ఉంటుంది. తనికెళ్ల భరణి పోషించిన రెండు పాత్రలు కూడా విభిన్నంగా ఉంటాయి. ఇలాంటి ప్రయత్నం చేయడం నాకిదే ప్రథమం. ఇటీవలే సినిమా చూసిన పలువురు సినీ ప్రముఖులు నా పాత్రల్ని అభినందించారు. ప్రేక్షకులు కూడా ఆదరిస్తారని నమ్మకం ఉంది. చట్టం ఎవడికీ చుట్టం కాదు.. దాని ముందు అందరూ సమానులే అనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరికీ కలిగించిననాడు ప్రజాస్వామ్యంపై ప్రజలకు విశ్వాసం ఏర్పడుతుంది. లేనినాడు అది సన్నగిల్లుతుంది. మొత్తంగా మా ‘రాజ్యాధికారం’ కథాంశం ఇది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: వంగపండు ప్రసాదరావు, గోరటి వెంకన్న, జయరాజ్, వరంగల్ శ్రీనివాస్, దయా నర్శింగ్, గిద్దే రామనర్సయ్య, కమటం రామస్వామి, కెమెరా: రాంబాబు, కథ, కథనం, మాటలు, డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ, సంగీతం, నిర్మాత, దర్శకత్వం: ఆర్. నారాయణమూర్తి. -
'రాజ్యాధికారం' వాళ్లకు మాత్రమే సొంతమా?
-
ప్రజలు తిరుగుబాటు చేస్తే..!
రైతు కూలీ స్థాయి నుంచి రైతుగా ఎదిగిన కష్టజీవి రామయ్యను ఆ ఊరి పెద్దలు ఏ విధంగా హింసించారు? న్యాయస్థానంలో కూడా అన్యాయానికి గురైన రామయ్య... ఆ తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే ఉద్వేగభరితమైన అంశంతో తెరకెక్కిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే సెన్సార్‌కి వెళ్లనుంది. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణమూర్తి మాట్లాడుతూ -‘‘నాటికీ నేటికీ దళితులు సమాజంలో ఎందుకు నిరాదరణకు గురవుతున్నారు? అధికారం కోసం కొందరు రాజకీయ నాయకులు ఎలా దిగజారుతున్నారు? ప్రజలకిచ్చిన హామీలను ఏ విధంగా తుంగలో తొక్కుతున్నారు? ఇలాంటి వారిపై ప్రజలు తిరుగుబాటు చేస్తే ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే నా ‘రాజ్యాధికారం’. ప్రజాకవుల సాహిత్యం మా సినిమాకు మణిహారం. ఇందులో నేను రామయ్య అనే దళితునిగా నటించాను. స్వర్గీయ తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి ప్రతినాయక పాత్రలు పోషించారు. అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసి త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు.ఎవరి భాగాలు వారు పంచేసుకోవాల్సిందే: తెలంగాణకు ప్రత్యేక ఫిలిం చాంబర్ డిమాండ్ కరెక్టే అంటారా? అని నారాయణమూర్తిని అడిగితే -‘‘కచ్చితంగా కరెక్టే. రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు ఎవరి భాగాలు వారు పంచేసుకోవాలి. ఎవరి ఫలాలు వారు అనుభవించాలి. అన్ని విషయాల్లోనూ సమ న్యాయం జరగాలి. రెండుగా విడిపోయిన తర్వాత ఇంకా కలిసి ఉండాలనడం సబబు కాదు. వైజాగ్, రాజమండ్రి, తిరుపతి... ఇలా పలు చోట్లకు పరిశ్రమ తరలి వెళుతుందని అనడం కూడా కరెక్ట్ కాదు. పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదు. ఇక్కడితో పాటు అక్కడ కూడా అభివృద్ధి చెందుతుంది. పలు చోట్ల సినీ పుష్పాలు వికసించడం మంచిదే. ప్రపంచ వ్యాప్తంగా తెలుగువారు ఉన్నారు. అలాంటప్పుడు తెలుగు సినిమా రాష్ట్రాలకు అతీతంగా అభివృద్ధి చెందితే తప్పేంటి?. అప్పుడు ఇక్కడా సినిమాలు తీస్తాం. వైజాగ్, రాజమండ్రి వెళ్లి అక్కడా సినిమాలు తీస్తాం’’ అన్నారు. మరి మీరు ఏ చాంబర్లో సభ్యత్వం తీసుకుంటారు? అనడిగితే -‘‘నేను ఆంధ్రుణ్ణి. నా ఆంధ్ర ప్రదేశ్‌కు సంబంధించిన ఫిలిం చాంబర్లోనే సభ్యుణ్ణి అవుతాను. అయితే ఏంటి? తెలంగాణలో సినిమా తీస్తే... ఇక్కడి ప్రభుత్వం, ఇక్కడి చాంబర్ నాకు సహకారం అందించరా? తప్పకుండా అందిస్తారు. అలాగే మా సహకారం వారికీ ఉంటుంది. అలా పరస్పర సహకారంతో తెలుగు సినిమా మరింత అభివృద్ధి చెందుతుంది’’ అని పేర్కొన్నారు నారాయణమూర్తి. -
‘రాములమ్మ’కు స్ఫూర్తి అతనే! :దాసరి
‘‘సినీ చరిత్రలో ఎన్నో ప్రయోగాలు చేసిన దర్శకులున్నారు. రకరకాల కోవలకు చెందిన సినిమాలు తీసిన ప్రతిభావంతులున్నారు. కానీ ఒకే ధ్యేయంతో, ఒకే తరహా సినిమాలు తీసి విజయాలను అందుకున్న ఏకైక దర్శకుడు మాత్రం ఒక్క ఆర్.నారాయణమూర్తే. స్టార్ హీరోలకు ఏ మాత్రం తక్కువ కాని ఇమేజ్ అతని సొంతం’’ అని దాసరి నారాయణరావు అన్నారు. ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ, నిర్మించిన చిత్రం ‘రాజ్యాధికారం’. ఆర్.నారాయణమూర్తే స్వరాలు కూడా అందించిన ఈ చిత్ర గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. దాసరి ఆడియో సీడీని ఆవిష్కరించి తొలి ప్రతిని కె.రాఘవేంద్రరావుకు అందించారు. దాసరి ఇంకా చెబుతూ - ‘‘పేదవాడి కష్టాలను, వ్యవస్థపై ఉన్న కసిని సినిమా రూపంలో చూపించే ఏకైక దర్శకుడు నారాయణమూర్తి. నేను ‘ఒసేయ్ రాములమ్మ’ తీయడానికి స్ఫూర్తి తనే. జనాల్లోకి వెళితే అతని వ్యక్తిత్వానికి, మాటకు విలువ ఉంటుంది. కానీ... ఎందరడిగినా తాను రాజకీయాలకు దూరమనే చెప్పాడు. తన సినిమాకొచ్చే ప్రతి రూపాయినీ తన ఊరి అభివృద్ధికే ఉపయోగిస్తాడు. నారాయణమూర్తితో నా బంధం మాటల్లో చెప్పలేను. అతను నాకు వీరభక్త హనుమాన్ లాంటివాడు’’ అన్నారు. నారాయణమూర్తి మాట్లాడుతూ, ‘‘రాజకీయనాయకుల దిగజారుడు తనాన్ని ఈ సినిమాలో చూపిస్తున్నా. తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరాం, తెలంగాణ శకుంతల లాంటివారి నటన, ప్రజా కవుల సాహిత్యం ఈ చిత్రానికి ఆభరణాలు. పది రోజుల్లో తొలి కాపీ వస్తుంది. త్వరలోనే సినిమాను విడుదల చేస్తాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: కె.రాంబాబు. -
రాజ్యాధికారం మూవీ ఆడియో లాంచ్
-
రాజ్యాధికారం కోసం...
కొంతమంది రాజకీయ నాయకులకు ప్రజాసేవ కన్నా రాజ్యాధికారమే పరమావధి. అందుకోసం ఎన్ని గోతులైనా తవ్వుతారు. ఎన్ని మొసలి కన్నీళ్లయినా కారుస్తారు. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపిస్తారు. అయితే అలాంటివారి ఆటలు ఎప్పుడూ చెల్లవు. ప్రజలు ఎప్పుడో ఒకప్పుడు బుద్ధి చెప్పడం ఖాయం. ఈ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం ‘రాజ్యాధికారం’. స్నేహచిత్ర పతాకంపై ఆర్.నారాయణమూర్తి స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విశేషాలను ఆయన వివరిస్తూ- ‘‘మా సంస్థలో ఇది 27వ సినిమా. ఖమ్మం, కొత్తగూడెం, తూర్పు గోదావరి జిల్లా, శ్రీకాకుళం... తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది. ఇందులో ఆరు పాటలున్నాయి. త్వరలో పాటల్ని, ఈ నెలాఖరున చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఆర్.నారాయణమూర్తి, తనికెళ్ల భరణి, ఎల్బీ శ్రీరామ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: కె.రాంబాబు, డాన్స్: ముక్కురాజు.