mahasabha
-
రాష్ట్రంలో రజకులకు సమున్నత స్థానం
ఏఎన్‌యూ: రజకుల సాధికారతకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు చేపడుతున్నారని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న మైదానంలో ఆదివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రజక సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో జరిగిన రజక ఆత్మగౌరవ మహాసభలో మంత్రి ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తోందన్నారు. రజక కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా రజకులకు సమున్నత స్థానం కల్పించారని తెలిపారు. అంబేడ్కర్ ఆశించిన సామాజిక న్యాయమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు పేదవాడి చెంతకు చేరుతున్నాయని తెలిపారు. అణగారిన వర్గాల సాధికారతకు అంకితభావంతో పనిచేస్తున్న ముఖ్యమంత్రి ఉండటం మన అదృష్టమన్నారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం మాకు గర్వంగా ఉందని తెలిపారు. రజకుల సమస్యలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని నాగార్జున హామీ ఇచ్చారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదిక.. బీసీ సంక్షేమ శాఖా మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ.. కులగణన విషయంలో దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం ఏపీ ప్రభుత్వం చేస్తోందన్నారు. ఈ ప్రక్రియ తరువాత రజకులకు మరిన్ని ప్రయోజనాలు అందుతాయన్నారు. సామాజిక సాధికారతకు ఏపీ వేదికగా నిలుస్తోందని తెలిపారు. గత పాలకుల వివక్షకు గురైన వర్గాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమున్నత స్థానం కల్పిస్తోందన్నారు. ప్రస్తుతం ఏపీలో బీసీల రాజ్యం నడుస్తోందని తెలిపారు. రజకుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ప్రభుత్వ విప్ లేళ్ల అప్పిరెడ్డి, వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. రజకులకు ఏపీ ప్రభుత్వం అగ్రస్థానం కల్పించిందని.. రానున్న రోజుల్లో మరిన్ని పదవులు కల్పించనుందన్నారు. చట్టసభల్లో రజకులకు తప్పకుండా స్థానం దక్కుతుందన్నారు. రజకులను వంచించిన చంద్రబాబు ఏపీ రజక కార్పొరేషన్ చైర్మన్ రంగన్న, రజక సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు అంజిబాబు ప్రసంగిస్తూ.. రజకుల సమస్యల పరిష్కారంపై సీఎం జగన్‌కు ప్రత్యేక ప్రణాళిక ఉందన్నారు. మాటతప్పే వ్యక్తిత్వం ఆయనది కాదన్నారు. చంద్రబాబు ప్రభుత్వం రజకులను తీవ్రంగా వంచించిందన్నారు. రజకుల్లో 50 ఏళ్ల వారికి పింఛన్ ఇవ్వమంటే మీకు ఇస్తే మిగతా కులాలు కూడా అడుగుతాయని చంద్రబాబు అవమానించారన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రజకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలన్నారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు, ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నాయకుడు బండి శ్రీనివాసరావు, పలువురు బీసీ సంఘాలు, రజక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలు.. ఏపీలో గొప్ప సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలంగాణ ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న అన్నారు. రజకులపై తాను రాసిన పాట అంటే మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి ఎంతో ఇష్టమన్నారు. రాష్ట్రంలో గతానికి, ఇప్పటికి ఉన్న మంచిని గమనించాలని రజకులకు సూచించారు. పాటలతో ఆయన సభికులను ఉత్తేజపరిచారు. -
జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించాలి
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: ముదిరాజ్‌లు ఐక్యంగా ఉంటూ రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ డిమాండ్ చేశారు. రాష్ర్టంలో ముదిరాజ్ జనాభా 60 లక్షల మంది ఉన్నారని, ముదిరాజ్‌లు అత్యధికంగా ఉండే ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో జనాభా ప్రాతిపదికన బీఆర్ఎస్ పార్టీ నుంచి రెండేసి అసెంబ్లీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 25న బేగంపేటలోని పైగా ప్యాలెస్‌లో నిర్వహించే ముదిరాజ్ ప్లీనరీ పోస్టర్‌ను శుక్రవారం శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, హోంమంత్రి మహమూద్ అలీ మంత్రుల నివాసాల్లో వేర్వేరుగా ఆవిష్కరించారు. అనంతరం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీడియా సమావేశంలో గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ మాట్లాడారు. విద్య, ఉద్యోగాలలో అనేక తరాలుగా జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించేలా ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏ కేటగిరీలోకి మార్చే ప్రక్రియను బీసీ కమిషన్ వెంటనే చేపట్టాలన్నారు. రాజ్యాధికారం సాధించే దిశగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ప్లీనరీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ముదిరాజ్ మహాసభ యువత ప్రధానకార్యదర్శి అల్లుడు జగన్, యువత సభ్యులు బొక్క శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణసాగర్, రాష్ట్ర కార్యదర్శి గుమ్ముల స్వామి, కార్యనిర్వాహక కార్యదర్శి డి.కనకయ్య, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధిక, యువ నేతలు రంజిత్, పొకల రవి, యాదగిరిలు పాల్గొన్నారు. -
బీసీలకు రాజ్యసభ సభ్యుల వరకు పదవులు దక్కాయి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
జయహో బీసీ మహాసభపై వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతల సమావేశం
-
‘బీసీల వెనుకబాటుకు కారణం చంద్రబాబే’
సాక్షి, అమరావతి: జయహో బీసీ మహాసభపై వైఎస్సార్సీపీ ముఖ్యనేతల సమావేశం శనివారం.. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో జరిగింది. ఎంపీలు, విజయసాయిరెడ్డి, ఆర్ కృష్ణయ్య, మంత్రులు జోగి రమేష్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ హాజరయ్యారు. సామాజిక న్యాయం జగన్‌కే సాధ్యం: జోగి రమేష్ ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ, ఈ నెల 7న జయహో బీసీ మహా సభకు వివిధ హోదాలో ఉన్న బీసీ ప్రజా ప్రతినిధులు 80 వేలకు పైగా హాజరవుతారని తెలిపారు. సామాజిక న్యాయం జగన్‌కే సాధ్యమని, ఈ మూడున్నరేళ్లలోనే చాటి చెప్పారన్నారు. బీసీలంతా తలెత్తుకుని తిరిగేలా గౌరవం ఇచ్చారని అన్నారు. బీసీలకు అత్యంత ప్రాధాన్యత: ఆర్. కృష్ణయ్య ఎంపీ ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, గతంలో ఏ సీఎం చేయని విధంగా వైఎస్ జగన్ బీసీలకు న్యాయం చేశారన్నారు. దేశానికి వెన్నెముక అయిన బీసీలకు సీఎం జగన్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అభివృద్ధి అంటే అధికారంలో వాటా ఇవ్వడం, సంక్షేమ పథకాలు అమలు చేయడమే. బీసీల విషయంలో సీఎం ఇదే చేస్తున్నారని కృష్ణయ్య అన్నారు. చంద్రబాబు అబద్దాలను నమ్మే పరిస్థితులు లేవు : మంత్రి వేణు గోపాలకృష్ణ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ, వెనుక వరసలో ఉన్న బీసీలను సీఎం జగన్ ముందుకు తెచ్చారన్నారు. పేదరికం పెద్ద రోగం కాబట్టి విద్య అనే ఆయుధం అందించారన్నారు. బీసీల వెనకబాటుకు ప్రధాన కారణం చంద్రబాబు. బీసీలను విద్య కోసం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీసీలను బాబు వాడుకున్నారు. ఈ నెల 7న 80 వేల మంది బీసీలు ఒకే వేదిక పైకి రాబోతున్నారు. చంద్రబాబును చూస్తే మాకు ఇదేం ఖర్మ అని బీసీలు అనుకుంటున్నారు. చంద్రబాబు అబద్దాలను నమ్మే పరిస్థితులు రాష్ట్రంలో లేవు’’ అని మంత్రి వేణుగోపాలకష్ణ అన్నారు. -
మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలి
సాక్షి, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లా: దేశాన్ని లూటీ చేస్తున్న కేంద్రంలోని మోదీ సర్కారును గద్దె దించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. కరోనాను నియంత్రించడంలో కేంద్రం చేతులెత్తేసిందని, అంతా రాష్ట్రాలపైకి నెట్టిందని ఆరోపించారు. గత డిసెంబర్ 31 నాటికి దేశంలో 18 ఏళ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయిస్తామన్నారని, అది ఇంకా నెరవేరలేదని విమర్శించారు. సీపీఎం రాష్ట్ర మహాసభల ప్రారంభం సందర్భంగా శనివారం జరిగిన ఆన్లైన్ బహిరంగ సభలో ఆయన ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో మాట్లాడారు. ‘ఆర్థిక రంగంలో పెద్ద సంక్షోభం వచ్చింది. ధరలు పెరుగుతున్నాయి. సంపద లూటీ అవుతోంది’అని ఏచూరి ఆవేదన వ్యక్తం చేశారు. దేశాన్ని అమ్ముకోండి.. పొలిటికల్ ఫండ్‌గా బీజేపీకి కేటాయించండని చెబుతున్నారని విమర్శించారు. దేశంలో 112 మంది మహా కోటీశ్వరులు ఉన్నారని, వారి చేతుల్లో ప్రజల వద్ద ఉన్న సంపదలో 55 శాతం ఉందని చెప్పారు. పార్లమెంటులో చర్చలే జరగవు రాజ్యాంగంలోని కీలక స్తంభాలను ధ్వంసం చేస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాసి కేంద్రమే తన చేతుల్లోకి తీసుకుంటోందని ఏచూరి మండిపడ్డారు. ‘12 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేశారు. పార్లమెంటులో ఎలాంటి చర్చలు జరగవు. పార్లమెంటును రబ్బర్ స్టాంప్‌లా వాడుకుంటున్నారు. సీబీఐ, ఈడీలను తన రాజకీయ ఏజెన్సీలుగా బీజేపీ ఉపయోగించుకుంటోంది. తనకు లొంగని ప్రతిపక్షనాయకుల మీద కేసులు పెడుతూ హింసిస్తోంది’అని విమర్శించారు. ఎన్నికల్లో ఏ పార్టీనైనా నెగ్గనీయండి.. కానీ ఆయా రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వమే ఏర్పడుతుందని కేంద్ర మంత్రి అమిత్ షా అనడంపై మండిపడ్డారు. పార్టీ పాత వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని, తెలంగాణ సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. రైతులు, మహిళల కోసం ఎర్రజెండా పోరాడుతుందని పొలిట్‌బ్యూరో సభ్యురాలు బృందాకారత్ అన్నారు. రాష్ట్రం విడిపోయాక బంగారు తెలంగాణ తెస్తామని పాలకులు ఆశ చూపారని, కానీ ఆశలు అడియాసలయ్యాయని మరో పొలిట్‌బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు ఆవేదన వ్యక్తం చేశారు. దొరల తెలంగాణ కాకుండా ప్రజా తెలంగాణ రావాలన్నారు. బీజేపీ విషసర్పంలా ఎదుగుతోంది: తమ్మినేని రాష్ట్రంలో బీజేపీ విషసర్పంలా ఎదుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. వార్డు స్థాయిలోకి కూడా వెళ్లిందని, విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతవిద్వేషాలను పెంచుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ తమ ప్రధాన శత్రువని ప్రకటించారు. రాష్ట్ర మహాసభల్లో కూడా బీజేపీని అడ్డుకోవడమెలానో చర్చిస్తామన్నారు. విభజన హామీలను అమలు చేయాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరడంలేదని విమర్శించారు. కేంద్రంపై ఒక్కనాడైనా ఆయన పోరాటం చేస్తున్నారా అని నిలదీశారు. బీజేపీని రాజకీయ బేరసారాలకు, తన ప్రయోజనాలకు కేసీఆర్ వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. కేసీఆర్‌ను నమ్మలేకపోతున్నామన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ సహా ఎవరు వచ్చినా కలిసి పోరాడతామని, దీనర్థం వాళ్లతో ఎన్నికల పొత్తులుంటాయని కాదని స్పష్టం చేశారు. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలు అమలు చేస్తే ఊరుకోబోమన్నారు. రాబోయే కాలంలో వామపక్షవాదులతో ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. -
సీపీఎం రాష్ట్ర మహాసభలు..హాజరుకానున్న ఏచూరి, ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ వేదికగా జరిగే భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్ట్) మూడో రాష్ట్రమహాసభలకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ మహాసభలు శనివారం ప్రారంభంకానున్నాయి. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరిసహా పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్, బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కేంద్రకమిటీ సభ్యుడు చెరుకుపల్లి సీతారాములు అతిథులుగా హాజరుకానున్నారు. సభలు జరిగే ప్రదేశంసహా తుర్కయాంజాల్ మున్సిపాలిటీలోని ప్రధాన వీధులన్నింటినీ ఎర్రతోరణాలతో అలంకరించారు. బొంగుళూరు గేటు, విజయవాడ హైవే, మహేశ్వరం ప్రధాన రహదారుల వెంట భారీ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. సభలకు జిల్లాల నుంచి 640 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. అతిథులకు భోజనాలు, వసతిని ఎస్ఎస్ఆర్ కన్వెన్షన్‌తోపాటు సమీపంలోని పలు అతిథిగృహాల్లో కల్పించనున్నారు. చర్చకు వచ్చే ప్రధాన అంశాలివే... ప్రభుత్వ మిగులు భూముల పంపిణీ, జిల్లాలో పరిశ్రమల స్థాపన పేరుతో బలవంతపు భూసేకరణ, కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతున్న తీరు, ఆ తర్వాత ఉపాధి అవకాశాలు కల్పించకపోవడంతో పెరుగుతున్న నిరుద్యోగం, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం, వృద్ధులు, వికలాంగులకు పెన్షన్లు, కేంద్రం తీసుకొస్తున్న సాగు వ్యతిరేక చట్టాలు, భవిష్యత్తులో వాటి పర్యవసానాలు వంటి కీలక అంశాలపై ఈ మహాసభల్లో ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. -
ఫిబ్రవరిలో ప్రపంచ వెదురు మహాసభ
మణిపూర్ రాష్ట్ర రాజధాని నగరం ఇంఫాల్ వచ్చే ఫిబ్రవరిలో ప్రపంచ వెదురు మహాసభకు వేదిక కానుంది. వరల్డ్ బాంబూ ఆర్గనైజేషన్(డబ్ల్యూ.బి.ఒ.) నిర్వహించే ఈ వార్షిక మహాసభ తొలిగా 2017లో మెక్సికోలో, 2018లో పెరూలో జరిగింది. 2019 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ఇంఫాల్‌లో ప్రపంచ వెదురు మహాసభను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. వెదురును అటవీ చెట్ల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం తొలగించిన నేపథ్యంలో పర్యావరణ అనుకూల పంటగా వెదురు సాగు, వినియోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. 20 దేశాల నుంచి వెదురు నిపుణులు పాల్గొనే ఈ మహాసభలో వెదురుతో నిర్మాణాలు, వెదురు ఆహారోత్పత్తులు, కళాకృతుల తయారీపై శిక్షణ, పెంపకం– వాణిజ్యం తదితర అంశాలపై ప్రసంగాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, 5 పెవిలియన్లు ఈ మహాసభ సందర్భంగా ఏర్పాటు కానున్నాయి. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. +91 75083 34211. info@worldbambooworkshop.com; mailto:info@worldbambooworkshop.com -
23 నుంచి ఏఐటీయూసీ మహాసభలు
శ్రీరాంపూర్(మంచిర్యాల): ఈ నెల 23, 24 తేదీల్లో ఏఐటీయూసీ 15వ సెంట్రల్ మహాసభలను భూపాలపల్లిలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం నేతలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆర్కే 7 గనిపై వాల్ పోస్టర్ విడుదల చేశారు. యూనియన్ బ్రాంచీ సెక్రెటరీ కొట్టె కిషన్‌రావు మాట్లాడుతూ మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, సహాయ కార్యదర్శి కూనమనేని సాంబశివరావు, ఏఐటీయూసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.నర్సింహన్, రత్నాకర్, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్, సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.గట్టయ్య, వీ.సీతారామయ్య హాజరవుతున్నట్లు వెల్లడించారు. మహాసభల్లో కార్మికుల సమస్యలపై చర్చించి వాటి సాధన కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై తీర్మానాలు చేయనున్నట్లు తెలిపారు. కారుణ్య నియామకాలపై యాజమాన్యం స్పష్టత ఇవ్వాలని కోరారు. రెండేళ్ల సర్వీసు నిబంధన ఎత్తివేసి ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏరియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ పైడి రవీందర్‌రెడ్డి, ఫిట్ సెక్రెటరీ సారయ్య, సహాయ కార్యదర్శి బీర రవీందర్, ప్రచార కార్యదర్శులు పెద్దన్న, మైసయ్య, బరిగెల ప్రతాప్, శ్రీనివాస్, రవీందర్, బ్రహ్మయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఇక బహు‘జన’ బాట!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్)తో ముందుకు వెళ్లాలని సీపీఎం నిర్ణయించింది. నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పార్టీ రాష్ట్ర ద్వితీయ మహాసభల్లో ఈ మేరకు అగ్రనాయకత్వం తీర్మానం చేసింది. సామాజిక న్యాయ మే ప్రధాన ఎజెండాగా బీఎల్ఎఫ్ కార్యాచరణ సిద్ధం చేసింది. సామాజిక, ఆర్థిక, వర్గపరంగా అణచివేతకు గురవుతున్న కులాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి బీఎల్ఎఫ్ వేదికగా పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం నాయకత్వం పిలుపునిచ్చింది. వచ్చే సాధారణ ఎన్నికల నాటికి బీఎల్‌ఎఫ్‌తో క్షేత్రజల్లో చైత న్యం ర స్థాయిలో విస్తృతంగా పర్యటించి ప్కలిగించేందుకు పలు కార్యక్రమాల కార్యాచరణను రూపొందించింది. 28 పార్టీల కలయికతో దేశంలోనే తొలిసారిగా ఆవిష్కృతమైన బీఎల్ఎఫ్.. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభ సభ సందర్భంగా పిలుపునిచ్చారు. పూర్వవైభవం సాధించే దిశగా.. ఉమ్మడి ఏపీ విడిపోయిన తర్వాత తెలంగాణలో సీపీఎం ప్రాభవం కోల్పోతూ వస్తోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాలు మిశ్రమ ఫలితాలనే సాధించి పెట్టాయి. స్థానిక ఎన్నికల్లో గెలిచిన వారిలో చాలా మంది పార్టీ నుంచి వెళ్లిపోయారు. కేడర్ కొన్ని చోట్ల బలంగానే ఉన్నప్పటికీ వారిని నడిపించే నాయకత్వం బలహీనంగా ఉండటంతో పునరుత్తేజం నింపేందుకు బీఎల్ఎఫ్ను ప్రత్యామ్నాయ వేదికగా ఎంచుకుంది. పాతికేళ్లలో వివిధ పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం ద్వారా సాధించిన జయాపజయాలను బేరీజు వేసుకున్న సీపీఎం నాయకత్వం..ఈ సారి ఏ పార్టీతో జత లేకుండానే ప్రజా సంఘాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో మొదటి అడుగు వేసింది. పట్టున్న జిల్లాల్లో విజయమేనని .. ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి ఖమ్మం జిల్లా ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోట. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటుతో ఈ రెండు ఉమ్మడి జిల్లాల్లోనూ ఆ పార్టీకి ఉన్న నాయకగణం, కేడర్ చేజారింది. బీఎల్‌ఎఫ్‌తో ఈ జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవం తేవడంతోపాటు సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని రాష్ట్ర నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. బీఎల్ఎఫ్లో ప్రధాన భూమిక పోషిస్తున్న సంఘాల్లో చాలా వరకు ఈ రెండు జిల్లాలు వేదికగా పురుడు పోసుకున్నవి కావడం.. ఇది తమకు కలసి వస్తుందన్న నమ్మకంలో ఆ పార్టీ ఉంది. పార్టీకి ఉన్న ఓటు బ్యాంకుతో పాటు ప్రజా సంఘాలకు మద్దతుగా ఉన్న ప్రజా ఆకర్షణ, మేధావులు, కవులు, కళాకారులు, రచయితలంతా ఒకే గూటికి వస్తే బీఎల్ఎఫ్ ఈ రెండు జిల్లాల్లో కీలక శక్తి కానుందని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల సమరంలో ఈ రెండు జిల్లాల్లో అనుకున్న స్థాయిలో బీఎల్‌ఎఫ్‌తో విజయం సాధిస్తే.. మిగతా జిల్లాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తామని నమ్ముతోంది. బీఎల్ఎఫ్లో చేరిక విషయమై ఇప్పటి వరకు సీపీఐ నిర్ణయం వెలువరించక పోవడంతో.. ఆ పార్టీకి స్వాగత ద్వారాలను తెరిచి ఉంచారు. వామపక్ష శక్తుల్లో కీలకమైన సీపీఐ ఒక్కటి బీఎల్ఎఫ్లో కలిస్తే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోని ఎక్కువ స్థానాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలకు గట్టి పోటీ ఇస్తామని, కొన్నింట్లో విజయం సాధిస్తామని ప్రజా సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా సీపీఎం రాష్ట్ర మహాసభల్లో బీఎల్ఎఫ్ అంశంపై ఆ పార్టీ అగ్రనాయకులు చర్చ చేయడం, పార్టీ రాష్ట్ర నాయకత్వానికి కితాబు ఇవ్వడంతో.. రానున్న రోజుల్లో దీని విజయాలు ఎలా ఉంటాయోనని బీఎల్ఎఫ్లోని పార్టీలు అంచనా వేస్తున్నాయి. లౌకికవాదాన్ని కాపాడుకుందాం సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభ పిలుపు నల్లగొండ టౌన్: మతోన్మాద, సంఘ్ పరివార్ దాడులను ప్రతిఘటించాలని, లౌకిక వాదాన్ని కాపాడుకుందామని సీపీఎం రాష్ట్ర ద్వితీయ మహాసభ పిలుపునిచ్చింది. ఈ మేరకు మంగళవారం సభ పలు తీర్మానాలు ఆమోదించింది. ఎంబీసీల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, బాలికలు, మహిళలపై లైం గిక దాడులను అరికట్టాలని కోరింది. అసంఘటిత రంగకార్మికులకు కనీస వేతనాలు పెంచాలి తదితర తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సీపీఎం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, మహాసభలు బుధవారం ముగియనున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ప్రకటించనున్నారు. -
ఎరుపెక్కిన నగరం
నేటి నుంచి కర్నూలులో వ్య.కా.స రాష్ట్ర మహాసభలు – ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలను సోమవారం నుంచి మూడు రోజులపాటు కర్నూలులో నిర్వహించనున్నారు. మహాసభల్లో అన్నదాతల సమస్యలపై ప్రధానంగా చర్చ సాగనుంది. మొదటి రోజు నిర్వహించే బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.షడ్రక్, జి.పుల్లయ్య తెలిపారు. -
కార్మిక హక్కులు కాలరాస్తున్నారు
మోదీ సర్కార్‌పై నారాయణ ఫైర్ ► వియత్నాం కమ్యూనిస్టు ► మహాసభలో ప్రసంగం సాక్షి, హైదరాబాద్: కార్మికులు ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న హక్కులను వారికి దక్కకుండా చేయడమే నరేంద్ర మోదీ ప్రభుత్వ ఆర్థిక విధానాల ముఖ్య ఉద్దేశమని సీపీఐ జాతీయ కార్యదర్శివర్గసభ్యుడు కె.నారాయణ విమర్శించారు. కార్మిక చట్టాలకు సవరణలు తీసుకొచ్చి పారిశ్రామిక, పెట్టుబడిదారి అనుకూల విధానాలను అమలు చేస్తామంటూ ప్రధాని మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ పదే పదే పారిశ్రామికవేత్తలకు హామీనిస్తున్నారన్నారు. వియత్నాం హనోయిలో జరుగుతున్న అంతర్జాతీయ కమ్యూనిస్టు పార్టీల మహాసభకు సీపీఐ ప్రతినిధిగా నారాయణ హాజరయ్యారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ.. భారత్‌లో పాలకపక్షం అమలు చేస్తున్న పెట్టుబడిదారి, కార్పొరేట్ అనుకూల విధానాలు, మతతత్వ వ్యాప్తికి చేస్తున్న ప్రయత్నాలకు వ్యతిరేకంగా ఇతర వామపక్షాలు, ప్రజాస్వామ్య శక్తులతో కలసి సీపీఐ వివిధ రూపాల్లో పోరాడుతోందన్నారు. కార్మికులు, రైతులు, మహిళలు, యువత విద్యార్థులతో కలసి తమ పార్టీ విస్తృతంగా ఆందోళలు చేస్తోందన్నారు. భారత్‌లోని విశ్వవిద్యాలయాలు సైద్ధాంతిక, భావజాల పోరుకు యుద్ధక్షేత్రాలుగా మారుతున్నాయని... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్శిటీల్లో ఫాసిస్ట్ సిద్ధాంతాలను జొప్పించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. ఈ పోరాటాలన్నీ మరింత విస్తృత ప్రాతిపదికన వామపక్ష, సెక్యులర్, ప్రజాస్వామ్య శక్తులు ఏర్పడేందుకు మార్గాలను ఏర్పాటు చేస్తున్నాయన్నారు. -
అమరావతిలో మహిళా పార్లమెంటేరియన్ల మహాసభ
-ఫిబ్రవరిలో నిర్వహించేందుకు సన్నాహాలు సాక్షి, అమరావతి : రాజధాని అమరావతిలో జాతీయ మహిళా పార్లమెంటేరియన్ల మహాసభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం వచ్చే ఏడాది ఫిబ్రవరి తొలివారంలో జరిగే ఈ మహాసభను పూణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ సమన్వయం చేయనుంది. కొన్ని నెలలుగా దీనిపై కసరత్తు చేస్తున్న స్పీకర్ కోడెల శివప్రసాదరావు శనివారం పూణే వెళ్లి ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ ప్రతినిధి రాహుల్ వి.కరాడ్‌తో సమావేశమయ్యారు. మూడురోజుల పాటు జరిగే ఈ సభల్లో దేశవ్యాప్తంగా 400కు పైగా మహిళా పార్లమెంట్, శాసనసభ సభ్యులు పాల్గొంటారు. దాదాపు పది వేల మంది విద్యార్థినులను ఈ కార్యక్రమంలో భాగస్వాముల్ని చేయాలని భావిస్తున్నారు. సమావేశాలకు ఛైర్మన్‌గా స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చీఫ్ ప్యాట్రన్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరించనుండగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ట్రస్టీ సుధా నారాయణమూర్తి వంటి ప్రముఖులు రానున్నారు. మహాసభలో మహిళా ప్రోత్సాహం-ప్రజాస్వామ్యం పటిష్టత’, మహిళా సాధికారి-రాజకీయ సవాళ్లు, వ్యక్తిత్వ నిర్మాణ-భవిష్యత్తు దార్శనికత, మహిళల స్థితి-నిర్ణయాత్మక శక్తి తదితర అంశాలపై ప్రముఖుల ప్రసంగాలుంటాయి. కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కనీసం నాలుగు నెలల సమయం కావాలని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ కోరగా అందుకనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు. సమావేశాలను కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్, భారతీయ ఛాత్ర సంసాద్ ఫౌండేషన్, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ల సహకారంతో ఏపీ శాసనసభ,న రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించనున్నాయి. -
అనంత విజ్ఞానరాశులు వేదాలు
మహా మహోపాధ్యాయ విశ్వనాథ రాజమహేంద్రవరం కల్చరల్ : ‘వేదాలు అనంతవిజ్ఞాన రాశులు. వాటికి మించి న విజ్ఞాన సంపద లే’దని మహామహోపాధ్యాయ విశ్వనాథ గోపాలకృష్ణ పేర్కొన్నారు. దానవాయిపేటలోని వా డ్రేవువారి భవనంలో గురువారం జరి గిన వేదశాస్త్రపరిషత్ సర్వజనమహాసభలో ఆయన అధ్యక్షునిగా ప్రసంగించారు. భారతీయ సంప్రదాయంలో వేదాలకు మించిన విజ్ఞానం మరొకటి లేదని, మానవుల కర్తవ్యనిర్వహణకు మార్గదర్శకాలు వేదాలని అన్నారు. కర్మకాండ అంతా వేదరూపంలోనే లభిస్తోందని తెలిపారు. వేదం అపౌరుషేయమని, భగవంతుని నిశ్వాçÜరూపంగా వెలువడిందని పేర్కొన్నారు. ఉదయం వేదపరిషత్తు విద్యార్థులు, వేదపండితులు వేదస్వస్తితో పరిషత్ కార్యాలయంనుంచి విశ్వేశ్వరస్వామి ఆలయం వరకు ఊరేగింపు నిర్వహించారు. అక్కడ వేదస్వస్తి ముగిశాక మార్కండేయేశ్వరాలయంలో వేదపారాయణ నిర్వహించారు. సుమారు 170 మంది విద్యార్థులు వివి ధ∙విభాగాల్లో పరీక్షల్లో పాల్గొనగా 49 మంది కొన్నివిభాగాల్లో ఉత్తీర్ణులయ్యారు. 23 మంది పట్టాలు తీసుకున్నారు. పరి షత్ కార్యదర్శి హోతా శ్రీరామచంద్రమూర్తి, సహాయకార్యద ర్శి పీసపాటి వెంకటసత్యనారాయణశాస్త్రి పాల్గొన్నారు. -
యాదవ మహాసభను జయప్రదం చేయాలి
సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనర్సయ్య ఖమ్మం మామిళ్లగూడెం: ఈ నెల 14 న నిర్వహించే అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకల వెంకటనర్సయ్య ,రాష్ట్ర కార్యదర్శి గండ్రకోటి కృష్ణలు తెలిపారు. శుక్రవారం వారు సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లాలోని గొర్రెలు,మేకల పెంపకందారుల సమస్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు. సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.అశోక్‌కుమార్ యాదవ్,జిల్లా అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్‌లు హాజరవుతున్నట్లు చెప్పారు. నగరంలోని బైపాస్ రోడ్ చిత్తారు శ్రీహరియాదవ్భవన్లో ఉదయం 10 గంటలకు జరుగే సమావేశానికి జిల్లా వ్యాప్తంగా జాతీయ,రాష్ట్ర,జిల్లా కౌన్సిల్ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు అమరబోయిన శివరామ్ ప్రసాద్ యాదవ్,బండారి ప్రభాకర్ యాదవ్,సత్తి వెంకన్నయాదవ్ పాల్గొన్నారు. -
తెలంగాణ అస్తిత్వ పతాక
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ తండ్లాటను జా తీయ స్థాయిలో, వివిధ భాషల్లో ప్రకటించాలన్న లక్ష్యంతో ఏర్పడిన అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక మహాసభలకు కరీంనగర్ వేదిక అయ్యింది. ఈ నెల 22న వేదిక రెండవ మహాసభలకు భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలంగాణ ఏ ర్పాటు ప్రకటన వెలువడినా, రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ముం దుకుసాగని సందర్భంలో జరుగుతున్న ఈ మహాసభలు తెలంగాణరచయితలకు, కళాకారులకు దిశానిర్దేశం చేయనున్నాయి. తెలంగాణ పునర్నిర్మాణంలో రచయితల బాధ్యతను నిర్వచించనున్నాయి. 22న రోజంతా నాలుగు దఫాలుగా సభలు జరుగుతాయి. వివిధ రాష్ట్రాల నుంచి రచయితలు, ప్రవాస తెలంగాణవాసులు హాజరవుతున్నారు. మహాసభల వేదికకు సిద్ధప్ప వరకవి పేరు పెట్టారు. ఉదయం 9గంటలకు ప్రారంభసభ జరుగుతుంది. గోవా లోకాయుక్త జస్టిస్ సుదర్శన్‌రెడ్డి, జాతీయ సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్ డాక్టర్ ఎన్.గోపి పాల్గొంటారు. 10 గంటలకు జరిగే ప్రవాస తెలంగాణ సదస్సులో మైసూర్ తెలుగు సాంస్కృతిక మండలికి చెందిన సీఎన్.రెడ్డి. బరోడాకు చెందిన గట్టు నారాయణగురూజీ, షోలాపూర్ నుంచి డాక్టర్ బొల్లి లక్ష్మీనారాయణ, ముంబై నుంచి యెల్ది సుదర్శన్, సంగవేణి రవీంద్ర, నడిమెట్ల ఎల్లప్ప, డిల్లీకి చెందిన పెరుక రాజు, భీవండికి చెందిన గండూరి లక్ష్మీనారాయణ పాల్గొంటారు. ఈ సభల్లో 12 పుస్తకాలను, రెండు ఆడియో సీడీలను ఆవిష్కరిస్తున్నారు. ఈ సమావేశంలో జార్ఖండ్ జన సాంస్కృతిక మంచ్ నేత అనిల్ అంశుమన్ పాల్గొంటారు. ఉడాన్‌తోపాటు, ఆకలి, ఆక్రమణ్ కభ్కో హోచుకా, వస్త్రగాలం, నవనీతం, పెద్దకచ్చురం, ఎన్నీల ముచ్చట్లు, జగిత్యాల జైత్రయాత్ర, సంచలనం, కవితారాధన, నాకలం తెలంగాణ కోసమే, ఏడూర్ల చెరువు పుస్తకాలను, నెత్తుటి గాయాలు, ఆరు గొంతుకల గానం సీడీలను ఆవిష్కరిస్తారు. ఈ సభల్లో ప్రముఖ రచయితలు అల్లం రాజయ్య, జూలూరి గౌరీశంకర్, సూరెపల్లి సుజాత, జూకంటి జగన్నాథం, నందిని సిధారెడ్డి, అల్లం నారాయణ, కే.శ్రీనివాస్, డాక్టర్ పత్తిపాక మోహన్, నాళేశ్వరం శంకరం, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం తదితరులు పాల్గొంటారు. ఉద్యమానికి జాతీయ గుర్తింపు సాధించడానికే : నలిమెల ‘తెలంగాణ అస్థిత్వ పరివేదనను దేశమంతటా వినిపించాలని అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక ఏర్పడింది. అంతకుముందు తెలంగాణ భాషాసంస్కృతుల పట్ల కొనసాగిన వివక్షకు వ్యతిరేకంగా పన్నెండేళ్ల క్రితం తెలంగాణ రచయితల వేదిక ఆవిర్భవించింది. మలిదశ ఉద్యమంలో వేదిక మహోన్నతపాత్ర నిర్వహించింది. ఉద్యమానికి జాతీయ గుర్తింపు సాధించడానికీ, ఇక్కడి సాహిత్యాన్ని అన్ని ప్రాంతాలకు పరిచయం చేయడానికీ అఖిల భారత వేదికను ఏర్పాటు చేశాం’ అని వివరించారు అఖిల భారత తెరవే అధ్యక్షుడు డాక్టర్ నలిమెల భాస్కర్. బరంపురంలో జరిగిన జాతీయ సాహిత్య సభల్లో తెరవే వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డిని అవమానించడంతో తెలంగాణ ఆత్మగౌరవ వేదిక గా ఈ సంస్థ ఏర్పడిందని అన్నారు. తెరవే ఆ ధ్వర్యంలో 2010లోనే అఖిల భారత స్థాయిలో ఒక మహాసభ జరిగిందని, ఏడాది క్రితం అఖి ల భారత తెరవే ఏర్పడిందని చెప్పారు. ఇది జాతీయ స్థాయిలో జరుగుతున్న రెండవ మహాసభ అని వివరించారు. మలిదశ ఉద్యమ కాలంలో వచ్చిన వేలాది కవితల్లో 52 కవితలను ఎంపిక చేసి హిందీలో ‘ఉడాన్’ పేరిట సంకలనాన్ని ఈ సభల్లో ఆవిష్కరించనున్నట్టు చెప్పారు. వేదిక అఖిల భారత కార్యదర్శి మచ్చ ప్రభాకర్ ఉద్యమ నేపధ్యాన్ని మరాఠీలో తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలిపారు. తెలంగాణ సాహిత్యసారాన్ని ఇతర భాషల్లోకి తీసుకుపోవడానికి కృషి చేస్తున్నామన్నారు. పరి మితమైన వనరుల మధ్య ప్రభావవంతంగా తెలంగాణ సాహితీ సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పారు.