మణిపూర్ రాష్ట్ర రాజధాని నగరం ఇంఫాల్ వచ్చే ఫిబ్రవరిలో ప్రపంచ వెదురు మహాసభకు వేదిక కానుంది. వరల్డ్ బాంబూ ఆర్గనైజేషన్(డబ్ల్యూ.బి.ఒ.) నిర్వహించే ఈ వార్షిక మహాసభ తొలిగా 2017లో మెక్సికోలో, 2018లో పెరూలో జరిగింది. 2019 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు ఇంఫాల్‌లో ప్రపంచ వెదురు మహాసభను మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. వెదురును అటవీ చెట్ల జాబితా నుంచి కేంద్ర ప్రభుత్వం కొద్ది నెలల క్రితం తొలగించిన నేపథ్యంలో పర్యావరణ అనుకూల పంటగా వెదురు సాగు, వినియోగంపై దేశవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. 20 దేశాల నుంచి వెదురు నిపుణులు పాల్గొనే ఈ మహాసభలో వెదురుతో నిర్మాణాలు, వెదురు ఆహారోత్పత్తులు, కళాకృతుల తయారీపై శిక్షణ, పెంపకం– వాణిజ్యం తదితర అంశాలపై ప్రసంగాలు, ఉత్పత్తుల ఎగ్జిబిషన్, సాంస్కృతిక ప్రదర్శనలు, 5 పెవిలియన్లు ఈ మహాసభ సందర్భంగా ఏర్పాటు కానున్నాయి. రిజిస్ట్రేషన్ తదితర వివరాలకు.. +91 75083 34211. info@worldbambooworkshop.com; mailto:info@worldbambooworkshop.com
Comments
Please login to add a commentAdd a comment