యాదవ మహాసభను జయప్రదం చేయాలి | Yadava mahasabha on 14th | Sakshi
Sakshi News home page

యాదవ మహాసభను జయప్రదం చేయాలి

Published Fri, Aug 12 2016 11:50 PM | Last Updated on Mon, Sep 4 2017 9:00 AM

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటనర్సయ్య

సమావేశంలో మాట్లాడుతున్న వెంకటనర్సయ్య

  •  సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనర్సయ్య
  • ఖమ్మం మామిళ్లగూడెం:  ఈ నెల 14 న నిర్వహించే అఖిల భారత యాదవ మహాసభ జిల్లా కౌన్సిల్‌ సమావేశాన్ని జయప్రదం చేయాలని అఖిల భారత యాదవ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలకల వెంకటనర్సయ్య ,రాష్ట్ర కార్యదర్శి గండ్రకోటి కృష్ణలు తెలిపారు. శుక్రవారం వారు సంఘ కార్యాలయంలో  మాట్లాడుతూ జిల్లాలోని గొర్రెలు,మేకల పెంపకందారుల సమస్యలపై సమావేశంలో చర్చించనున్నట్లు వెల్లడించారు.  సమావేశానికి  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.అశోక్‌కుమార్‌ యాదవ్,జిల్లా అధ్యక్షుడు మేకల మల్లిబాబు యాదవ్‌లు  హాజరవుతున్నట్లు  చెప్పారు. నగరంలోని బైపాస్‌ రోడ్‌ చిత్తారు శ్రీహరియాదవ్‌భవన్‌లో ఉదయం 10 గంటలకు జరుగే సమావేశానికి జిల్లా వ్యాప్తంగా జాతీయ,రాష్ట్ర,జిల్లా కౌన్సిల్‌ సభ్యులు హాజరై విజయవంతం చేయాలని కోరారు. యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు చిత్తారు సింహాద్రి యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో  నాయకులు అమరబోయిన శివరామ్‌ ప్రసాద్‌ యాదవ్,బండారి ప్రభాకర్‌ యాదవ్,సత్తి వెంకన్నయాదవ్‌ పాల్గొన్నారు.


     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement