ఎరుపెక్కిన నగరం
నేటి నుంచి కర్నూలులో వ్య.కా.స రాష్ట్ర మహాసభలు
– ముఖ్యఅతిథిగా హాజరుకానున్న కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం 27వ రాష్ట్ర మహాసభలను సోమవారం నుంచి మూడు రోజులపాటు కర్నూలులో నిర్వహించనున్నారు. మహాసభల్లో అన్నదాతల సమస్యలపై ప్రధానంగా చర్చ సాగనుంది. మొదటి రోజు నిర్వహించే బహిరంగ సభకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా సుమారు 1000 మంది ప్రతినిధులు హాజరవుతున్న నేపథ్యంలో ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టినట్లు ఆహ్వాన సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు టి.షడ్రక్, జి.పుల్లయ్య తెలిపారు.