Prabhas Sreenu Responds To Rumors About Senior Actress Tulasi - Sakshi
Sakshi News home page

సీనియర్‌ నటితో ఎఫైర్‌.. క్లారిటీ ఇచ్చిన ప్రభాస్‌ శ్రీను

Published Tue, Jun 13 2023 11:44 AM | Last Updated on Tue, Jun 13 2023 1:03 PM

Prabhas Sreenu Rumors About Senior Actress Tulasi - Sakshi

ప్రభాస్‌ శ్రీను, టాలీవుడ్‌లో కేవలం నటుడిగానే కాకుండా.. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌కు అసిస్టెంట్‌గా, మంచి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం తనపై వచ్చిన రూమర్స్‌ గురించి తాజాగా స్పందించాడు. సీనియర్ నటి తులసితో ఎఫైర్ ఉందని అప్పట్లో రూమర్లు పుట్టుకొచ్చాయి. అప్పుడు చాలా బాధపడ్డానని తెలిపాడు.

ఆవిడతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు కానీ తమ మీద తప్పుగా రూమర్స్‌ ప్రచారం చేశారు. తనకు తులసి అంటే తల్లితో సమానం అన్నాడు. 'డార్లింగ్‌' సినిమా షూటింగ్‌ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి, ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారని ప్రభాస్‌ శ్రీను తెలిపాడు.

(ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ విలన్ కన్నుమూత!) 

సినిమా షూటింగ్‌ సమయంలో ఏదో సరదాగా డార్లింగ్‌ అని పిలిచిందని, దానిని కొందరు అపార్థం చేసుకున్నట్లు తెలిపాడు. తమపై రూమర్స్‌ వస్తున్నట్లు మొదట ఆవిడే  మెసేజ్‌ పెట్టారని చెప్పుకొచ్చాడు. ' ఈ రూమర్స్‌ గురించి మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా ఆపార్థం చేసుకుంటుందేమో' అని సలహా కూడా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. తన భార్య ఒక  డాక్టర్‌ అని. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇలాంటి రూమర్స్‌ నమ్మదంటూ.. వాటిని చూసి నవ్వుకుని వదిలేశామని చెప్పాడు.

(ఇదీ చదవండి: బ్లాక్‌ డ్రెస్‌లో డోస్ పెంచిన అనుపమతో పోటీ పడుతున్న తమన్నా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement