Thulasi
-
ఆమె తల్లి లాంటిది.. ఇలా ప్రచారం చేస్తారా?: ప్రభాస్ శ్రీను
ప్రభాస్ శ్రీను, టాలీవుడ్లో కేవలం నటుడిగానే కాకుండా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌కు అసిస్టెంట్‌గా, మంచి స్నేహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్ని నెలల క్రితం తనపై వచ్చిన రూమర్స్ గురించి తాజాగా స్పందించాడు. సీనియర్ నటి తులసితో ఎఫైర్ ఉందని అప్పట్లో రూమర్లు పుట్టుకొచ్చాయి. అప్పుడు చాలా బాధపడ్డానని తెలిపాడు. ఆవిడతో ఎక్కువ సినిమాలు కూడా చేయలేదు కానీ తమ మీద తప్పుగా రూమర్స్ ప్రచారం చేశారు. తనకు తులసి అంటే తల్లితో సమానం అన్నాడు. 'డార్లింగ్' సినిమా షూటింగ్ సమయంలో ఆవిడను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాం. ఆవిడ పెద్ద నటి, ఎన్నో చూసి ఈ స్థాయికి వచ్చారని ప్రభాస్ శ్రీను తెలిపాడు. (ఇదీ చదవండి: గుండెపోటుతో ప్రముఖ విలన్ కన్నుమూత!) సినిమా షూటింగ్ సమయంలో ఏదో సరదాగా డార్లింగ్ అని పిలిచిందని, దానిని కొందరు అపార్థం చేసుకున్నట్లు తెలిపాడు. తమపై రూమర్స్ వస్తున్నట్లు మొదట ఆవిడే మెసేజ్ పెట్టారని చెప్పుకొచ్చాడు. ' ఈ రూమర్స్ గురించి మీ భార్యకు చెప్పు లేదంటే తను కూడా ఆపార్థం చేసుకుంటుందేమో' అని సలహా కూడా ఇచ్చిందని చెప్పుకొచ్చాడు. తన భార్య ఒక డాక్టర్ అని. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఇలాంటి రూమర్స్ నమ్మదంటూ.. వాటిని చూసి నవ్వుకుని వదిలేశామని చెప్పాడు. (ఇదీ చదవండి: బ్లాక్ డ్రెస్‌లో డోస్ పెంచిన అనుపమతో పోటీ పడుతున్న తమన్నా) -
అభాగ్యుల పాలిట అన్నదాత తులసీరామ్
పశ్చిమగోదావరి ,భీమవరం: కన్నబిడ్డలే తల్లిదండ్రులను భారంగా భావిస్తున్న రోజులువి. అటువంటిది క్రమం తప్పకుండా ఏ ఆదరవు లేని వృద్ధులకు ప్రతి రోజు భోజనం పంపిస్తున్నారు. అదీ వృద్ధులున్నచోటకే క్యారేజీలు పంపించడం విశేషం. ఇలా పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన మళ్ల తులసీరామ్(రాంబాబు). రైస్‌మిల్లర్‌గా, రొయ్యల రైతుగా తాను సంపాదించేదానిలో కొంతమొత్తాన్ని వృద్ధుల సేవకు వినియోగిస్తున్నారు. రాష్ట్ర గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు యండగండి గ్రామంలో వృద్ధులకు భోజనం పెడుతున్న వైనాన్ని తెలుసుకుని తాను స్ఫూర్తి పొంది ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు రాంబాబు చెప్పారు. వీరవాసరం గ్రామంలోని తులసీ కన్వెన్షన్ హాలులో భోజనం తయారు చేయించి ప్రతి రోజూ పంజావేమవరం, వీరవాసరం గ్రామంలోని వృద్ధులకు పంపిస్తున్నారు. బుధ, ఆదివారాల్లో గుడ్డు, చేప, చికెన్ వంటి మాంసాహారం కూడా పెడుతుండటం విశేషం. అంతేకాదు ఒక్కోసారి రాంబాబు స్వయంగా ఆహారం వండుతారు. 2019 నవంబర్‌లో కేవలం 30 క్యారేజీలతో ప్రారంభమైన భోజనం పంపిణీ ప్రస్తుతం 180కి చేరుకుంది. జీవితకాలం కొనసాగించాలన్నదేలక్ష్యం కుటుంబసభ్యుల సహకారంతో వృద్ధులకు, అనాథలకు ప్రతి రోజూ ఉచితంగా భోజనం పంపిస్తున్నాను. అనేకమంది దాతలు సహకరిస్తామని ముందుకు వచ్చినా సున్నితంగా తిరస్కరించాను. అయితే కిరణా, కూరగాయల వ్యాపారులు తక్కువ ధరకే సరఫరా చేస్తున్నందుకు సంతోషం. నా సంపాదనతోనే జీవితకాలం ఈ పథకాన్ని కొనసాగించాలనే లక్ష్యంతో ఉన్నాను. –మళ్ల తులసీరామ్(రాంబాబు),అన్నదాత, పంజా వేమవరం తృప్తిగా భోజనం చేస్తున్నాను వృద్ధాప్యంలో వంట చేసుకోలేని దుస్థితిలో ఉన్న నాకు ప్రతి రోజు క్యారేజీ రావడంతో తృష్తిగా భోజనం చేయగలుగుతున్నాను. వంటలు కూడా రుచికరంగా ఉండటంతో ఎటువంటి ఇబ్బంది ఉండటం లేదు. –వంకాయల మహాలక్ష్మి, వేమవరం రాంబాబు ఆశయం గొప్పది చిన్న వయస్సులోనే వృద్ధులకు భోజనం పంపించాలనే రాంబాబు ఆశయం పదిమందికి ఆదర్శం. రోజూ క్రమం తప్పకుండా వేడి వేడి పదార్థాలతో ఉదయం 10.30 గంటలకే భోజనం క్యారేజీ మా ఇంటి ముందు సిద్ధంగా ఉంటుంది. –పంజా రాఘవమ్మ -
ఎవరికి చెప్పాలి.. ఏమని చెప్పాలి..
జీడిమెట్ల: ‘నాకు అమ్మ, నాన్న లేరు..ప్రేమించిన వాడు ఆప్యాయంగా మాట్లాడటంలేదు.. కనీసం నా కోసం కొంత సమయాన్ని కేటాయించడంలేదు. కాలేజీకి వస్తుంటే బస్తీలో పోకిరీలు వెకిలి చేష్టలతో ఇబ్బంది పెడుతున్నారు. నా బాధ ఎవరికి చెప్పాలి ఏమని చెప్పాలి.. నేను ఎంత ప్రేమించినా నన్ను నన్నుగా ప్రేమించే వారు ఎవరూ లేరు.. ఇక నేను ఎందుకు బతకాలి ఎవరికోసం బతకాలి అంటూ మూడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఇంటర్మీడియేట్ విద్యార్థిని ఉరి వేసుకుని అత్మహత్యకు పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ బాలరాజు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.సూరారం డివిజన్ నెహ్రూ నగర్‌కు చెందిన తులసి(17)కి చిన్నతనంలోనే ఆమె తండ్రి లక్ష్మణ్, తల్లి సుశీల మృతి చెందారు. దీంతో అప్పటినుంచి ఆమె అమ్మమ్మ కోమలిబాయి వద్ద ఉంటూ చింతల్‌లోని బాగ్యరథి కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత కొంతకాలంగా ఆమె నెహ్రూ నగర్‌కు చెందిన యువకుడిని ప్రేమిస్తోంది. ఇటీవల ఆమెకు ఇంటర్ పరీక్షలు సమీపించడంతో సదరు యువకుడు మంచిగా చదువుకోవాలని చెప్పి వెళ్లాడు. అప్పటి నుంచి అతను తులసితో మాట్లాడటం లేదు. దీంతో తాను ఒంటరినయ్యానని భావించిన తులసి గురువారం మద్యాహ్నం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక అమ్మమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నా స్నేహితురాళ్లు చాలా మంచివాళ్లు.. నన్ను స్నేహితుల చాలా మంచిగా చూసుకుంటారు. వారికి నా ఇబ్బందులు చెప్పి వారిని బాధ పెట్టలేను. ఈ జన్మకు వారితో నా స్నేహం ఇక ఇంతే అంటూ సూసైడ్ నోట్లో పేర్కొంది. పోకిరీలకు అడ్డుకట్ట వేయాలి.. గత కొంత కాలంగా కాలనీలో పోకిరీల బెడద ఎక్కువైందని స్థానికులు తెలిపారు. పోలీసులు బస్తీల్లో గస్తీ నిర్వహించి పోకిరీల బెడద నుండి మహిళలు, యువతులను కాపాడాలని కోరారు. -
సేవా మల్లె ‘తులసి’
మీరు ప్రొద్దుటూరులో ఉన్నారనుకోండి... తిరుపతిలో ఎవరికైనా రక్తం అవసరమైతే ఏం చేస్తారు? సేవా గుణం ఉంటే వెళ్లి ఇస్తారు. అదే యువతి అయితే... తోడు లేకుండా ఇంట్లో వాళ్లు ధైర్యంగా పంపలేరు. పంపాలనుకున్నా ఆ యువతి అదే ధైర్యంతో వెళ్లాలి. అక్కడ ఏ టైం అవుతుందో, మళ్లీ తిరిగి రావడమెప్పుడో అనే ఆలోచన. ఎందుకు వచ్చిన సేవాగుణంలే అనుకుంటారు. కానీ తులసి అలా అనుకోలేదు. అవతలి వ్యక్తి ప్రాణాపాయమే కనిపించింది. తక్షణమే సొంత ఖర్చులతో వెళ్లి రక్తదానం చేస్తుంది. పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. కడప ఎడ్యుకేషన్: సామాజిక మాధ్యమం రెండు వైపులా పదునైన కత్తిలాంటిది. ఇందులో ఆశయం దిశగా సాగితే విజ్ఞానం, వినోదం ఉంటాయి. ఏమాత్రం గురి తప్పినా జీవితాలు తారుమారవుతాయి. నేటి యువత మార్కెట్లో ఏ ట్రెండ్ వచ్చినా అందిపుచ్చుకుంటోంది. వాటిని అనుసరిస్తోంది. పేస్‌బుక్‌లో లైక్‌లు, కామెంట్లు, అప్డేట్లు ఇలా ఊహల గగనంలో విహరిస్తోంది. అదుపు తప్పితే మాత్రం కనిపించని విషవలయాలు ఉంటాయని నిపుణులు, మేధావులు హెచ్చరిçస్తున్నారు. త్వరలో పది, ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. వీటికి కేవలం రెండు నెలల మాత్రమే గడువు ఉంది. ఇలాంటి సమయంలో సామాజిక మాధ్యమాలను వినియోగిస్తూ ఉంటే భవిష్యత్తు పక్కదారి పట్టే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి నుంచైనా పరీక్షలపై దృష్టి సారిస్తే మంచి గ్రేడ్లను సాధించే అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు. ఆపదలో ఉన్నవారికి, అవసరమైన వారికి సేవ చేయడంలో కలసపాడు మండలం తెల్లపాడుకు చెందిన తులసి ముందుంటారు. రైల్వేలో చిరుద్యోగిగా పని చేస్తున్న రామకృష్ణారెడ్డి సతీమణి తులసి. తులసి భర్త 15 ఏళ్లుగా వివేకానంద సేవా సమితి ఏర్పాటు చేసి స్వచ్ఛంద సేవ చేస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా భర్త దారిలోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రశంసలందుకుంటోంది. కాశినాయన మండలం ఉప్పలూరుకు చెందిన రామ తులసికి 2014లో కలసపాడు మండలంలోని తెల్లపాడుకు చెందిన రామకృష్ణారెడ్డితో వివాహామైంది. అప్పటికే వివేకానంద ఫౌండేషన్‌ను నిర్వహిస్తున్న అతను భార్యలోని సేవాగుణం చూసి సంస్థ కోశాధికారి బాధ్యతలను అప్పగించారు. భర్త సహకారంతో సేవలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకుంది. అనాథలకు అన్నదానం చేస్తున్న రామతులసి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లడం విద్యార్థులకు పుస్తకాలు, బ్యాగులు అందజేయడంతో పాటు వారికి మార్గదర్శిగా నిలుస్తూ మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుంది. ఇప్పటి వరకు సంస్థ ద్వారా 3 వేల మందికి విద్యాసామగ్రి అందజేశారు. కళాశాలల్లోని బాలికలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడం, వివేకానంద సూక్తులతో స్ఫూర్తిని నింపుతోంది.ఇటీవలే ఒక యువకుడు రక్తం గడ్డకట్టే వ్యాధితో తిరుపతి సిమ్స్‌లో చేరాడు. అతనికి అరుదైన రక్త గ్రూపు అవసరం కావడంతో పత్రికల్లో సాయం చేయాలని కోరారు. దీన్ని ప్రొద్దుటూరులో చూసిన తులసి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇద్దరు చిన్నపిల్లలు తప్ప వెంట రావడానికి ఎవరూ లేరు. అయినా ధైర్యంతో ఆమె పిల్లలతో వెళ్లి రక్త దానం చేసి ఔదార్యాన్ని చాటుకున్నారు. దీన్ని సామాజిక మాధ్యమాల్లో చూసి పలువురు అభినందించారు.ప్రస్తుతం కాశినాయన మండలం ఓబులాపురం వద్ద వృద్ధుల సేవాశ్రమాన్ని దాతల సహకారంతో నిర్మిస్తున్నారు. భర్త ఎక్కువ ఉద్యోగ బాధ్యతల్లో ఉన్నా తులసి నిర్మాణ పనుల బాధ్యత తీసుకుని ముందుకు సాగుతోంది. ఇప్పటికే రూ.15 లక్షలతో నిర్మాణ పనులు పూర్తి చేశారు. సేవలోనే సంతృప్తి దూరం, ఒక్కరే వెళ్లాలన్న భయం కంటే అవతలి వ్యక్తి అవసరమే నన్ను కదిలించింది. అందుకే చిన్న పిల్లలున్నా వారిని వెంట తీసుకుని వెళ్లి రక్తదానం చేశా. అభాగ్యులు, పేదవారికి సేవ చేయడంలో సంతృప్తి ఉంటుంది. జీవితాంతం సేవ చేయాలనే ఉద్దేశంతోనే సేవాశ్రమం నిర్మిస్తున్నాం. రానున్న రోజుల్లో సేవా కార్యక్రమాలు విస్తరిస్తాం.– రామ తులసి, వివేకానంద ఫౌండేషన్ -
వివాహమైన 34 రోజులకే..
ధారూరు: ఉద్యోగమొచ్చి ఏడాదైంది.. పెళ్లయి నెల దాటింది.. అంత సంతోషంగా ఉన్నామనుకున్న సమయంలో ఆ కుటుంబాన్ని విధి వంచించింది. రోడ్డు ప్రమాదం రూపంలో చేతికొచ్చిన కొడుకును బలి తీసుకోగా, కాళ్ల పారాణి కూడా ఆరకముందే ఓ నవ వధువు పుట్టెడు దుఃఖంలో మునిగింది. దీంతో ధారూరు మండలం లక్ష్మీనగర్‌తండాలో తీవ్ర విషాదం అలుముకుంది. లక్ష్మీనగర్‌తండాకు చెందిన వాల్యానాయక్, హేమ్లీబాయి దంపతులకు దేవీబాయి, తులసీరామ్ (29), గోపాల్, శ్రీనివాస్ సంతానం. డిగ్రీ పూర్తి చేసిన రెండో కుమారుడు తులసీరామ్ 2018లో సివిల్ కానిస్టేబుల్‌గా ఎంపికై రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవరంపల్లి ఠాణాలో విధులు నిర్వహిస్తుండేవాడు. తులసీరామ్‌కు మే 8వ తేదీ, 2019లో పూడూరు మండలం బొంగుపల్లితండాకు చెందిన మౌనికతో వివాహమైంది. అయితే పీఎస్ పరిధిలో జరిగిన ఓ కేసు విషయమై నిందితుడిని పట్టుకోవడానికి బీహార్‌కు అధికారులు, సిబ్బందితో తులసీరామ్ వెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తులసీరామ్ దుర్మరణం పాలయ్యాడు. దీంతో లక్ష్మీనగర్ తండాలో తీవ్ర విషాదం ఏర్పడింది. కుటుంబసభ్యుల రోదనలతో తండా తల్లడిల్లింది. రోదిస్తున్న మృతుడి కుటుంబసభ్యులు మిన్నంటిన రోదనలు ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుల్‌కు గత మే 8వ తేదీన వివాహమైంది. వివాహమైన 34 రోజులకే రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలవడంతో నవ వధువు దిగ్భ్రాంతికి గురైంది. ప్రమాదం వార్త తెలుసుకున్న అతడి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. కొత్తగా పెళ్లవడంతో మైలార్దేవరంపల్లిలో ఈ దంపతులు కొత్త కాపురం పెట్టారు. కాపురం పెట్టిన కొన్నాళ్లకే ఆయన మృతిచెందడంతో అతడి భార్య దు:ఖసాగరంలో మునిగింది. ఎదిగిన కుమారుడు దూరమవడంతో ఆ తల్లిదండ్రులు పుత్రశోకంలో మునిగారు. -
వినోదం.. సందేశం
కన్నడ రైజింగ్ స్టార్ యష్, ‘బిందాస్’ ఫేమ్ షీనా జంటగా కె.వి.రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాజధాని’. ప్రకాష్‌రాజ్, తులసి ముఖ్య పాత్రలు చేశారు. కన్నడలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ‘భాగ్యనగరం’ పేరుతో సంతోష్ కుమార్ అక్టోబర్ 5న తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు. ప్రముఖ నిర్మాత డి.ఎస్.రావు ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. సంతోష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ముందు ఓ మంచి డబ్బింగ్ సినిమా చేసి, తర్వాత స్ట్రెయిట్ సినిమా చేయాలనే ఆలోచనలో భాగంగా ‘భాగ్యనగరం’ సినిమా విడుదల చేస్తున్నా. మా బ్యానర్‌కి ఈ చిత్రం చక్కని శుభారంభం ఇస్తుందనే నమ్మకం ఉంది. వినోదానికి సందేశాన్ని జోడించి రూపొందిన ఈ చిత్రం కన్నడలో కంటే తెలుగులో పెద్ద విజయం సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నాం. డ్యాన్సింగ్ సెన్సేషన్ ముమైత్ ఖాన్ ఐటమ్ సాంగ్ చేశారు’’ అన్నారు. ‘‘యువతరాన్ని నిర్వీర్యం చేస్తున్న మాదక ద్రవ్యాలు, మద్యపానం వంటి దుష్పరిణామాలను ఎత్తి చూపుతూ.. ఆలోచన రేకెత్తించే చిత్రం ‘భాగ్యనగరం’. ఇలాంటి మంచి సినిమాను పంపిణీ చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు డి.ఎస్.రావు. -
హరి హరీ.. మరో అపకీర్తి!
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదన్న నానుడి ఉంది. సింహాచలం శ్రీవరాహ లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో అలాగే జరిగింది. లక్ష తులసి పూజ చేయించుకునేందుకు మంగళవారం ఉదయం సింహగిరికి వచ్చిన ఓ భక్తుడికి భంగపాటు ఎదురైంది. ఈ రోజు లక్ష తులసి పూజ రద్దు చేశామని, పూజ చేసే అర్చకులు పలువురు సెలవులో ఉన్నారన్న సమాధానంతో భక్తుడు నోటిమాట రాలేదు. ఇదేంటని గట్టిగా ప్రశ్నించడంతో ఆలయ అధికారులు, అర్చకులు (కొందరు) ఆ భక్తుడ్ని బతిమలాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సర్దిచెప్పి అష్టోత్తర పూజ చేసి పంపించాల్సి వచ్చింది. దేవస్థానం అధికారులు..అర్చకుల మధ్య సమన్వయ లోపం, నిర్లక్ష్యంగా అప్పన్న సాక్షిగా బయటపడింది. ఇటీవల కాలంలో తరచూ సింహాచలం దేవస్థానంలో ఇటువంటి అపకీర్తులు చోటుచేసుకుటున్నాయి. సింహాచలం(పెందుర్తి): రాష్ట్రంలోనే ప్రముఖ దేవాలయాల్లో ఉన్న శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జరిగే ముఖ్యమైన ఆర్జిత సేవలు(నగదు చెల్లించి జరిపించుకునేవి)లో లక్ష తులసిపూజ ఒకటి. ఈ పూజను ప్రతి మంగళవారం ఉదయం 7 గంటల నుంచి జరుపుతారు. ఈ పూజలో పాల్గొనే భక్తుడు దేవస్థానానికి రూ.2500 చెల్లించి టిక్కెట్టు పొందాల్సి ఉంటుంది. స్వయంగా సింహగిరికి వచ్చికాని, ఇంటర్నెట్‌లోగాని సంబంధిత టిక్కెట్టును కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పూజను జరిపించేందుకు స్వామివారి సహస్రం చదివే పదిమంది వరకు అర్చకులు అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కో అర్చకుడు పదేసిసార్లు ఒక సహస్రాన్ని చదవాలి. అలా ఈ మంగళవారం లక్షతులసి పూజను జరిపించుకునేందుకు గత నెల 26వ తేదీన ఒడిశాకు చెందిన శరత్‌రెడ్డి టిక్కెట్ కొనుగోలు చేశాడు. మంగళవారం ఉదయం 6.30 గంటల సమయంలో పూజాసామగ్రి, పండ్లు ఇతర ద్రవ్యాలతో పూజకు హాజరయ్యాడు. ఆలయంలో అడుగుపెట్టగానే అర్చకులు, అధికారుల నుంచి వచ్చిన సమాధానంతో కంగుతిన్నాడు. పూజ చేసేందుకు సరిపడా అర్చకులు లేరంటూ అతన్ని పంపించే ప్రయత్నం చేశారు. ఇదేంటని శరత్ గట్టిగా ప్రశ్నించేసరికి ఆలయ అర్చకులకు, అధికారులకు ఏం మాట్లాడాలో తెలియరాలేదు. చివరికి అతనికి నచ్చజెప్పి, స్వామివారి అష్టోత్తర పూజచేసి పంపించారు. నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో ఆలయంలో అర్చకులు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో స్పష్టంగా బయటపడింది. ఆలయంలో ఇద్దరు ఇన్చార్జి ప్రధానార్చకులు, ఒక ఉప ప్రధానార్చకుడు, ఎనిమిదిమంది ముఖ్య అర్చకులు, 12 మంది అర్చకులు, 5గురు పరిచారకులతో కలిపి 28మంది వరకు స్వామివారి సేవల్లో ఉన్నారు. వీరిలో పలువురు ఆయా షిఫ్టుల్లో స్వామికి సేవలందిస్తుంటారు. అలాగే ముగ్గురు సూపరింటిండెంట్లు, ఒక ఏఈవో, టెంపుల్ ఇన్స్పెక్టర్ ఆయా షిఫ్టుల్లో విధులు నిర్వర్తిస్తుంటారు. వీరిలో చాలామంది ఎవరికివారే యమునా తీరుగా వ్యవహరిస్తున్న పరిస్థితులు ఇటీవల కోకొల్లలు. మంగళవారం ఆరుగురు అర్చకులు సెలవులపై వెళ్లడం, ఆలయంలో కేవలం పదిమంది మాత్రమే అర్చకులు డ్యూటీలో ఉండడం గమనార్హం. ఉదయం లక్ష తులసిపూజ ఉందని కూడా తెలిసి ఎలా అంతమంది అర్చకులు సెలవు పెట్టారో...ఒకవేళ వాళ్లు శెలవు పెట్టినా పూజ సమయానికి ప్రత్యామ్నాయం చూపకపోవడంపై అటు వైదిక అధికారులను, ఇటు ఆలయ అధికారులను భక్తులు విమర్శిస్తున్నారు. ముందే తెలిసినా ఇవ్వని సమాచారం ఇదిలా ఉండగా మంగళవారం ఆలయంలో జరిగే లక్ష తులసిపూజకు తగినంత మంది అర్చకులు లేరని, కొందరు శెలవులపై వెళ్లారని ఆలయ అ«ధికారులకు సోమవారం సాయంత్రానికే తెలిసింది. దీంతో లక్ష తులసి పూజ రద్దు చేయమని చెప్పేశారు. ఈ తరుణంలోనే సింహగిరిపై ఉన్న చిన్నదాసుడుకు (ఈయన కూడా లక్ష తులసిపూజ జరిపించుకోవాల్సి ఉంది) పూజ లేని సమాచారాన్ని అందించారు. కానీ గత నెల 26వ తేదీన ఎంఆర్ రశీదు తీసుకున్న శరత్‌రెడ్డికి మాత్రం సమాచారం అందించలేదు. జరిగిన సంఘటనపై ఆలయ సూపరింటిండెంట్ తయారుచేసిన రిపోర్టు పూజ రద్దు చేయమని ఏఈవో చెప్పారు ఆలయంలో విధులు నిర్వర్తించే కొందరు అర్చకులు పెళ్లిళ్లు తదితర కారణాలతో శెలవులు పెట్టడంతో మంగళవారం లక్ష తులసిపూజ రద్దు చేయాలని ఏఈవో చెప్పారు. అధికారి ఇష్ట్రపకారంగా మేం చేయాల్సి వచ్చింది. మాకు ఎలాంటి పవర్స్ లేవు. చెప్పడం వరకే మా వంతు. కనీసం పదిమంది అర్చకులు లక్ష తులసిపూజకు అవసరం ఉంటుంది. ఉదయం లక్ష తులసిపూజకు వచ్చిన భక్తుడికి అష్టోత్తర పూజ చేయించి పంపించాం. గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు, ఇన్చార్జి ప్రధానార్చకులు -
‘యాన్’ నా స్థాయి పెంచుతుంది
నాటి అందాల తార రాధ రక్తం పంచుకుపుట్టిన కూతుళ్లు కార్తీక, తులసి. వీరు కూడా ఇప్పుడు అమ్మ బాటలోనే అడుగు లేస్తున్నారు. వీరిలో తులసి మణిరత్నం చిత్రం కడల్ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ఈమెకు బోలెడంత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జీవాకు జంటగా యాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపై తులసి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ, తన నటన ప్రస్థానం కడల్ చిత్రంతో మొదలైందని తాజాగా యాన్లో నటించానన్నారు. ఇంతకుముందు తన అక్క నటించిన కో చిత్రాన్ని నిర్మించిన ఆర్ఎస్ ఇన్ఫోటెయిన్మెంట్ అధినేతలు ఎవ్రెడ్ కామర్, జయరామ్లే ఈ యాన్ చిత్రాన్మి నిర్మిం చారన్నారు. ప్రముఖ చాయాగ్రహకుడు రవి కే చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాను నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో నటన కు అవకాశం ఉన్న పాత్ర ఛాలెంజ్‌గా తీసుకుని నటించానని అన్నారు. నటుడు జీవా సహకారం మరవలేనిదన్నారు. ఈ చిత్రం నటిగా తన స్థాయిని పెంచుతుందని చెప్పారు. -
శంకరాభరణంతోనే నాకు జీవితం
శంకరాభరణం చిత్రమే తనకు జీవితాన్ని ప్రసాదించిందంటున్నారు తులసి. శంకరాభరణం ఎందరో కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది. వారిలో నాటి బాలతార, ఒకనాటి కథానాయిక, నేటి సీనియర్ నటి తులసి ఒకరు. బాలతార అంటే మూడుమాసాల వయసులోనే నటించి ఆ తరువాత హీరోయిన్ అయిన ఏకైక నటి బహుశ తులసినే కావచ్చు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం హిందీ భాషల్లో నటించి అలరించిన అతి కొద్దిమంది తారల్లో ఒకరుగా పేరు గాంచిన తులసి, సుమారు 20 ఏళ్ల తరువాత మళ్లీ తెరపై ప్రత్యక్షయిన ఈ బహుభాషా నటితో మినీ ఇంటర్వ్యూ. సినీ రంగ ప్రవేశం గురించి క్లుప్తంగా? పుట్టిన మూడు నెలలకే సినీరంగ ప్రవేశం జరిగిపోయింది. భార్య అనే చిత్రంలో ఒక పాటలో నటించేశాను. అందుకు కారణం మహానటి సావిత్రినే. ఆమె నాన్నకు మంచి స్నేహితురాలు. భార్య చిత్రంలో పసి బిడ్డ అవసరం ఏర్పడడంతో నాన్నను ఒప్పించి నన్ను చిత్రరంగానికి పునాది వేశారు. ఆ తరువాత ఏడాదిన్నర వయసులో జీవన తరంగాలు చిత్రంలో నటించాను. అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సీతామాలక్ష్మి చిత్రంలో రెండు పాటల్లో నటించాను. అయితే నా జీవితాన్ని గొప్ప మలుపు తిప్పిన చిత్రం శంకరాభరణం. కె.విశ్వనాథ్ దర్శకత్వంలోనే తెరకెక్కిన ఆ చిత్రంలో శంకరం పాత్ర నన్ను ప్రపంచానికే పరిచయం చేసిందని చెప్పాలి. ఆ తరువాత చెల్లెలిగా కథానాయికగా పలు భాషల్లో 300 చిత్రాలకు పైగా నటించాను. ఒక్క తెలుగులోనే 76 చిత్రాలకు పైగా చేశాను. చాలా అవార్డులు వరించాయి. ఉన్నత స్థాయిలోనే నటనకు గుడ్‌బై చెప్పారు? కారణం? జవాబు: తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, హిందీ అంటూ పలు భాషల్లో పలు రకాల పాత్రలు చేశానన్న సంతృప్తి పొందడంతో నటనకు దూరమై పెళ్లి చేసుకుని సంసార జీవితంలో సెటిల్ అవ్వాలనుకున్నాను. దాంపత్యజీవనం గురించి? జవాబు: సుమారు 20 ఏళ్ల క్రితం ప్రముఖ కన్నడ దర్శక, నిర్మాత శివమణిని పెళ్లి చేసుకున్నాను. మాకొక బాబు. పేరు సాయితరుణ్. ప్రస్తుతం ప్లస్-2 చదువుతున్నాడు. చదువులో ఫస్ట్. పాఠశాలలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటాడు. అప్పుడే లఘు చిత్రాలకు రూపకల్పన చేస్తున్నాడు. భవిష్యత్తులో మీ అబ్బాయిని హీరో చేస్తారా? నా కైతే హీరోను చేయాలని ఉంది. అయితే తనకు దర్శకత్వంపై ఆసక్తి. తుది నిర్ణయం తనదే. అయితే ఇప్పటికే హీరోగా పరిచయం చేస్తామంటూ చాలామంది అడుగుతున్నారు. సరే మీరు మళ్లీ నటించడానికి సిద్ధం అవడానికి కారణం? భర్త ఆలనా పాలనా, కొడుకు సంరక్షణ బాధ్యతలతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్న నన్ను తమిళ నటుడు మురళి తండ్రి ప్రోత్సాహంతో కన్నడంలో రీ ఎంట్రీ అయ్యాను. ఎక్స్‌క్యూజ్‌మి చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించాను. తెలుగులో ఈవీవీ సత్యనారాయణ మాట కాదనలేక నువ్వంటే నా కిష్టం చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా నటించాను. మీరు మళ్లీ నటిస్తానంటే మీ భర్త అంగీకరించారా? అయ్యో! అసలు ఆయన ప్రోత్సాహమే ఎక్కువ. అంత మంచి మనిషాయన. ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు? తెలుగులో మహేష్‌బాబు హీరోగా నటించనున్న చిత్రంలో హీరోయిన్ శ్రుతిహాసన్‌కు తల్లిగా నటించనున్నాను. తమిళంలో విశాల్ హీరోగా నటిస్తున్న ఆంబళ చిత్రంలో హీరోయిన్‌కు తల్లిగా సాహసం చిత్రంలోను నటిస్తున్నాను. ఇప్పటికీ ఫలాన పాత్రలో నటించాలనే కోరిక ఏమైనా ఉందా? చాలా చిత్రాల్లో చాలా రకాల పాత్రలు చేశాను. ప్రస్తుతం చేస్తున్నవి కూడా అమ్మ పాత్రలే. అయినా మంచి అమ్మగా స్టైలిష్ పాత్రను చేయాలనుంది. అన్ని చిత్రాల్లోనూ అమ్మగానే నటిస్తున్నారు. అత్తగా పెత్తనం చేసే పాత్రలు చేయరా? పాత్ర బాగుంటే అలాంటివి కూడా చేయడానికి వెనుకాడను.