‘యాన్’ నా స్థాయి పెంచుతుంది | "My life does not depend on movies" - Thulasi on 'Yaan' | Sakshi
Sakshi News home page

‘యాన్’ నా స్థాయి పెంచుతుంది

Published Wed, Oct 1 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

‘యాన్’ నా స్థాయి పెంచుతుంది

‘యాన్’ నా స్థాయి పెంచుతుంది

 నాటి అందాల తార రాధ రక్తం పంచుకుపుట్టిన కూతుళ్లు కార్తీక, తులసి. వీరు కూడా ఇప్పుడు అమ్మ బాటలోనే అడుగు లేస్తున్నారు. వీరిలో తులసి మణిరత్నం చిత్రం కడల్ ద్వారా తెరంగేట్రం చేశారు. ఆ చిత్రం ఈమెకు బోలెడంత ప్రచారాన్ని తెచ్చిపెట్టింది. ప్రస్తుతం జీవాకు జంటగా యాన్ చిత్రంలో నటించారు. ఈ చిత్రం గాంధీ జయంతి సందర్భంగా గురువారం తెరపైకి రానుంది. ఈ చిత్రంపై తులసి చాలా ఆశలు పెట్టుకున్నారు. ఆమె మాట్లాడుతూ, తన నటన ప్రస్థానం కడల్ చిత్రంతో మొదలైందని తాజాగా యాన్‌లో నటించానన్నారు.
 
 ఇంతకుముందు తన అక్క నటించిన కో చిత్రాన్ని నిర్మించిన ఆర్‌ఎస్ ఇన్‌ఫోటెయిన్‌మెంట్ అధినేతలు ఎవ్‌రెడ్ కామర్, జయరామ్‌లే ఈ యాన్ చిత్రాన్మి నిర్మిం చారన్నారు. ప్రముఖ చాయాగ్రహకుడు రవి కే చంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాను నటించడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. ఈ చిత్రంలో నటన కు అవకాశం ఉన్న పాత్ర ఛాలెంజ్‌గా తీసుకుని నటించానని అన్నారు. నటుడు జీవా సహకారం మరవలేనిదన్నారు. ఈ చిత్రం నటిగా తన స్థాయిని పెంచుతుందని చెప్పారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement