పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నట ప్రస్థానం 'ఈశ్వర్' సినిమాతో మొదలైంది. ఈ చిత్రం 2002 నవంబరు 11న విడుదలై అప్పట్లో ఓ ట్రెండ్ సెట్ చేసింది. ధూల్‌పేట్ ఈశ్వర్‌గా ప్రభాస్ దుమ్ములేపాడు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు ‘జయంత్ సి పరాన్జీ’ తెరకెక్కించిన విషయం తెలిసిందే. రెబెల్ స్టార్ కృష్ణం రాజు నట వారసుడిగా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చినా.. తన సొంత టాలెంట్‌తోనే అవకాశాలు దక్కించుకున్నాడు ప్రభాస్.
(ఇదీ చదవండి: ‘ఆదిపురుష్’ మూవీ రివ్యూ)
అప్పట్లో రూ.2 కోట్ల బడ్జెట్‌తో ఈశ్వర్ సినిమాను తెరకెక్కిస్తే. నాలుగు కోట్ల రూపాయలు వసూళ్లు చేసింది. మొదటి సినిమాతోనే యూత్, మాస్ ప్రేక్షకులలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను ప్రభాస్ సంపాదించుకున్నాడు. ఈశ్వర్ తర్వాత 'రాఘవేంద్ర' సినిమాతో నిరాశపర్చినా.. అనంతరం శోభన్ దర్శకత్వంలో వచ్చిన 'వర్షం' చిత్రంతో అమ్మాయిల హృదయాలతో పాటు రూ. 21 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టాడు. ఈ సినిమాలో చేసిన యాక్షన్ సీక్వెన్సులతో యంగ్ రెబల్ స్టార్‌గా అప్పట్లో చెరగని ముద్రవేశాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్టు కె (వర్కింగ్ టైటిల్)లతో వినోదం పంచేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు.
(ఇదీ చదవండి: మళ్లీ అత్తమామల దగ్గరకు ఉపాసన)
Comments
Please login to add a commentAdd a comment