టాలీవుడ్ నుంచి బాలీవుడ వరకు అందరి చూపు ప్రభాస్ 'ఆదిపురుష్' పైనే ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో తాజాగా అందరి చూపు ఈ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌పై పడింది. ఈ పేరు ఇప్పుడు భారతదేశం అంతటా మారుమోగుతోంది. ఎవరితను..? ఎక్కడ నుంచి వచ్చాడు? ఎన్ని సినిమాలు చేశాడు? అంటూ గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. అతను ముంబయిలో పుట్టాడు.. తల్లి నీనా టెలివిజన్ నిర్మాత అయితే కాగా తండ్రి భరత్ కుమార్ ఒక జర్నలిస్ట్, రాజ్యసభ సభ్యుడు కూడా.. ఓం రౌత్ తాత సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అందుకే ఇతనికి సినిమాలంటే ఫ్యాషన్ ఏర్పడింది.
(ఇదీ చదవండి: Adipurush: హనుమాన్‌కు కేటాయించిన సీట్ ఇదే)
మొదట అతను బాల నటుడిగా పని చేశాడు, అలాగే కాలేజీలో జరిగే నాటకాల పోటీల్లో కూడా పాల్గొనేవాడు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడే కథానాయకుడిగా 'కారమతి కోట్' అనే సినిమా చేశాడు. ఆ సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూడా ఒక కీ రోల్ చేశాడు. మరాఠీ భాషలో 'లోకమాన్య: ఏక్ యుగ్ పురుష్' అనేది ఆయనకు మొదటి సినిమా. ఓం రౌత్, అతని తల్లి నీనా ఇద్దరూ కలిపి 'నీనా రౌత్ ఫిలిమ్స్' పేరుతో నిర్మించారు. ఇది అందరి ప్రసంశలు అందుకున్న సినిమానే కాకుండా, బెస్ట్ దర్శకుడిగా ఫిలిం ఫేర్ అవార్డు అతనికి వచ్చింది. మొదటి సినిమాతోనే అక్కడ భారీ క్రేజ్ సొంతం చేసుకున్నాడు.
(ఇదీ చదవండి: ఆదిపురుష్ ట్విట్టర్ రివ్యూ)
ప్రభాస్‌తో ఓం రౌత్ పరిచయం ఎక్కడ జరిగిందంటే
టి సిరీస్ సంస్థతో ప్రభాస్‌కు మంచి అనుబంధం వుంది. సాహో , రాధే శ్యామ్ సినిమాల సమయంలో వారి సంస్థతో ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారట. అప్పటికే అదే సంస్థలో వున్న ఓం రౌత్ అప్పుడు జపాన్‌కి చెందిన సినిమా 'రామాయణ: ది లెజెండ్ అఫ్ ప్రిన్స్ రామ' అనే హిందూ పురాణ కథ ఆధారంగా నిర్మించిన సినిమా నుండి స్ఫూర్తి పొందాడు. ఇది 1992లో జపాన్‌లో విడుదల అయింది. ఈ సినిమాని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి ఆధునిక సాంకేతిక సాయంతో ఎందుకు రామాయణం తీయకూడదు అనే ఆలోచన వచ్చి అదే విషయాన్ని టి సిరీస్ సంస్థ ప్రతినిదులకు చెప్పడంతో.. అలా ఆదిపురుష్‌కు అంకురార్పణ జరిగింది.
ఆ తర్వాత టీ సిరీస్ వల్ల అతనికి ప్రభాస్ పరిచయం అయ్యాడు. మొత్తానికి ఓం రౌత్ ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాడు.. ఆ సినిమాలు అన్ని విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు ఆదిపురుష్ సినిమా కూడా మంచి హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment