కొంచాడ శ్రీను (ఫైల్)
కాశీబుగ్గ (శ్రీకాకుళం): పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్‌కు దగ్గరలో నివాసం ఉంటున్న సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. కాశీబుగ్గ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. శ్రీనివాస్ సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆది, శంకర్‌దాదా ఎంబీబీఎస్, ప్రేమకావాలి, ఆ ఇంట్లో వంటి సినిమాలు ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
ప్రతి సంక్రాంతికి కాశీబుగ్గలోని తన స్వగృహానికి రావడం, తల్లిదండ్రులతో సంక్రాంతి పండుగ జరుపుకోవడం ఆయనకు అలవాటు. షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనుకు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత అతనికి గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసిందని, ఆ కారణంగానే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్‌కు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. తండ్రి ఐదేళ్ల కిందట చనిపోగా, తమ్ముడు పదేళ్ల కిందట మరణించారు. ఇద్దరు అక్కచెల్లెళ్లు అత్తా రిళ్లలో ఉన్నారు. శ్రీను మరణంతో జంట పట్టణాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment