పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తూర్పుజంగాలపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరవలింగం ఎరుకలయ్య (55) శుక్రవారం పొలంలో వరినారు పోశాడు.
కొండాపురం, న్యూస్‌లైన్ : పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తూర్పుజంగాలపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరవలింగం ఎరుకలయ్య (55) శుక్రవారం పొలంలో వరినారు పోశాడు.
శనివారం ఉదయం నారుమడిని చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ మోటారు వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. అయితే ఎరుకులయ్య మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు శ్రీను పొలం వద్దకు వెళ్లి చూడగా మోటారు వద్ద తండ్రి మృతి చెంది ఉండడాన్ని గుర్తించాడు. మృతుడికి భార్య రమణమ్మ, కుమారుడు శ్రీను ఉన్నారు.