Ramanamma
-
భార్య మృతి.. ఆ కొద్ది సేపటికే భర్త కూడా!
చిల్లకూరు(తిరుపతి జిల్లా): కష్టసుఖాల్లో ఇన్నాళ్లూ తనతో పాటు నడిచిన తన అర్ధాంగి మృతిని భర్త తట్టుకోలేకపోయాడు. భార్య మరణించిన కొద్ది సేపటికే తాను ప్రాణాలు విడిచాడు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం కడివేడు దళితవాడలో శనివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. కడివేడు గ్రామానికి చెందిన పల్లిపాటి నాగూరయ్య(68), రమణమ్మ(60)లు భార్యా భర్తలు. వీరికి కుమార్తె, ఇద్దరు కుమారులు. వీరందరికి వివాహాలు జరిపించి మనవళ్లు, మనమరాళ్లతో సంతోషంగా ఉంటున్నారు. ఇదిలా ఉండగా, రమణమ్మకు ఇటీవల ఆరోగ్యం దెబ్బతిని మంచానికే పరిమితమైంది. వృద్ధాప్యంలోనూ నాగూరయ్య కూలి పనులకు వెళ్లి.. వచ్చిన డబ్బుకు తోడు ప్రభుత్వం అందించే పింఛన్‌తో ఆమెకు వైద్యం చేయిస్తున్నాడు. ఈ క్రమంలో ఆమె శనివారం వేకువజామున ప్రాణాలు విడిచింది. ఈ విషయాన్ని గమనించిన రమణయ్య.. కుటుంబ సభ్యులను మేల్కొలిపి, తాను ఓ చోట అలా కూర్చుండి పోయాడు. నిద్ర లేచిన దగ్గర్నుంచి ఏమీ మాట్లాడకుండా ఉన్నాడని.. కుమారులు తండ్రి దగ్గరకు వెళ్లి కదిలించే ప్రయత్నం చేయగా.. అప్పటికే ఆయన ప్రాణాలు విడిచి ఉన్నాడు. గంటల వ్యవధిలోనే భార్యాభర్తలిద్దరూ మరణించడంతో కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. -
ఇద్దరితో వివాహేతర సంబంధం.. ఫోన్ చేస్తే స్విచాఫ్..
రామభద్రపురం: మండలంలోని ముచ్చర్లవలసలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన వివాహిత దాలి రమణమ్మ కేసులో వివాహేతర సంబంధం కారణంగా ఆమె హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 10 వ తేదీన అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలై రక్తపు మడుగులో కింద పడి ఉంది. దీంతో కుటుంబసభ్యులు బాడంగి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం విజయనగరం కేంద్రాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. హతురాలి తల్లి బంటు చిన్నమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శోభన్‌బాబు ఆధ్వర్యంలో ఎస్సై కృష్ణమూర్తి బృందం దర్యాప్తు చేసి అన్నికోణాల్లో విచారణ చేసింది. ఈ విచారణలో వివాహేతర సంబంధమే రమణమ్మ హత్యకు కారణమని తేల్చారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శోభన్‌బాబు మాట్లాడుతూ దాలి రమణమ్మ(35)కు అదే గ్రామానికి చెందిన నడగాన రమణతో కొన్నేళ్ల నుంచి వివాహేతర సంబంధంఉంది. అలాగే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొదటి ప్రియుడు రమణ సారా వ్యాపారి. నిందితుడి అరెస్టు చూపించి వివరాలు వెల్లడిస్తున్న సీఐ శోభన్‌బాబు చదవండి: (తనకెవ్వరూ సాటిరారని నిరూపించాడు.. దానిని తట్టుకోలేకే చంపేశారా?) ఈ నెల 10వ తేదీన రాత్రి ప్రియురాలు రమణమ్మకు రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ చేయగా స్విచాఫ్ వచ్చింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఆ సమయంలో టీవీ ఆన్‌చేసి పెద్ద సౌండ్‌లో ఉంది. ఇంటి పక్కన నుంచి ఎవరో వ్యక్తి పారిపోయినట్లు అనుమానం వచ్చి ఎవరు వెళ్లిపోతున్నారు? ఎందుకు మరో వ్యక్తిని ఇంట్లోకి రానిచ్చావంటూ రమ్మణమ్మతో గొడవ పడి గట్టిగా కొట్టి కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె తల తలుపు, ద్వారం మధ్యలో ఉన్న కోనును తగిలి కింద పడిపోయింది. 11వ తేదీన బంధువులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది. రమణమ్మ మృతి చెందిన విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. వీఆర్ఓ ఎదుట లొంగిపోయిన నిందితుడు డాగ్స్వాడ్, క్లూస్‌టీంతో పరిశీలించగా డాగ్ సరిగ్గా నిందితుడు రమణ ఇంటి దగ్గరకు వెళ్లి ఆగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తుండగా ఆ గ్రామ వీఆర్వో ఆనందరావు వద్ద మంగళవారం లొంగిపోయాడు. దీంతో నిందితుడిని పోలీసులకు వీఆర్వో అప్పగించగా అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ సందర్భంగా రమణమ్మను తానే హత్యచేసినట్లు నిందితుడు రమణ అంగీకరించాడు. అనంతరం నిందితుడిని పోలీసులు రిమాండ్‌కు సాలూరు తరలించారు. మూడు రోజుల్లో కేసును ఛేదించిన సీఐ, ఎస్సై, పోలీసులను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు. -
రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటాం
నెల్లూరు ,మర్రిపాడు: సౌదీలోని రియాద్‌లో మృతిచెందిన మండలంలోని చాబోలు గ్రామానికి చెందిన గుండబోయిన రమణమ్మ కుటుంబాన్ని ఆదుకుంటామని అధికారులు తెలిపారు. మర్రిపాడు తహసీల్దార్ డీవీ సుధాకర్ బుధవారం సిబ్బందితో కలిసి చాబోలుకు చేరుకుని మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. వివరాలు తెలుసుకున్నారు. సౌదీలో ఉంటున్న గ్రామానికి చెందిన వారితో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ రమణమ్మ రెండున్నర సంవత్సరాల క్రితం ఉపాధి కోసం సౌదీకి వెళ్లినట్లు చెప్పారు. అక్కడి యజమానే ఆమెను హత్య చేసినట్లుగా కుటుంబసభ్యులు చెప్పారని వెల్లడించారు. మృతురాలి కుటుంబాన్ని ప్రభుత్వపరంగా ఆదుకునేందుకు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. వారి ఆదేశాల మేరకు సహాయం చేస్తామని పేర్కొన్నారు. ఆయన వెంట ఆర్ఐ సురేంద్ర, వీఆర్వో రమణయ్య ఉన్నారు. పాపం పిల్లలు రమణమ్మ మృతితో ఆమె ఇద్దరు కుమారులు, కుమార్తె తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మృతురాలి భర్త ఐదేళ్ల క్రితం డెంగీతో మృతిచెందాడు. కుటుంబ పోషణ భారంగా మారడంతో బతుకుదెరువు కోసం రమణమ్మ సౌదీకి వెళ్లింది. కష్టపడి డబ్బు సంపాదించి పిల్లలను బాగా చుసుకోవాలనుకున్న ఆమె కలలు నెరవేరకుండానే చనిపోయింది. చిన్నారులను ఎలా చూసుకోవాలో అంటూ మృతురాలి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆ చిన్నారులకు ఆమే అమ్మ
ఆత్మకూరు: ఆమె ఓ గిరిజన మహిళ. తల్లిదండ్రులు చేపల విక్రయం చేస్తూ కష్టపడి పిల్లలను పెంచారు. ఈ క్రమంలో తన తల్లిదండ్రులు పడిన కష్టాన్ని పరిశీలించిన ఆమె ఉన్నంతలో పదో తరగతి వరకు చదువుకున్నారు. అంగన్వాడీ కార్యకర్తగా అవకాశం రావడంతో దాన్ని సద్వినియోగం చేసుకొని వందలాది మంది చిన్నారులకు చదువుపై ఆసక్తి కలిగేలా కేంద్రంలో శిక్షణ ఇస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు పట్టణంలోని మేదరవీధి గిరిజన కాలనీకి చెందిన కొమరగిరి రమణమ్మ. చిన్నారులకు విద్యాబుద్ధులు కొమరగిరి రమణమ్మకు 2002లో అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్తగా ఉద్యోగం వచ్చింది. తాను కష్టపడి చదువుకున్న రోజులను గుర్తు చేసుకొని కేంద్రానికి వచ్చే చిన్నారులను పూర్తిగా చదువువైపు మళ్లేలా తన వంతు కృషి చేస్తున్నారు. విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకుంటూ కాలనీలోని గిరిజన చిన్నారులందరూ తప్పనిసరిగా పాఠశాలకు వచ్చేలా కృషి చేస్తున్నారు. ఉన్నంతలోనే సౌకర్యాల ఏర్పాటు హిల్ రోడ్డులో అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రంలో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఉన్నంతలోనే తన సొంత నగదును వెచ్చించి పిల్లలకు అర్థమయ్యేలా పాఠాలు బోధించేందుకు కోవూరులో రూ.మూడు వేలను వెచ్చించి బొమ్మలను కొనుగోలు చేశారు. వీటి ద్వారా పాఠాలను చెప్పడం సులభతరమవడంతో పలువురు ఆమెనే అనుసరిస్తున్నారు. అద్దె గదిలో స్థలం చాలకపోవడంతో వెలుపల తాటాకుల పందిరిని ఏర్పాటు చేయించి ఆరుబయటే పిల్లలకు పాఠాలు నేర్పుతున్నారు. సమీపంలోని బీసీ కాలనీ, నారాయణరావుపేట అంగన్వాడీ కేంద్రాలను ఈ కేంద్రంలోనే విలీనం చేశారు. దీంతో ఈ అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థుల సంఖ్య 54కు చేరుకుంది. అయినా మొక్కవోని దీక్షతో విద్యార్థులందర్నీ పాఠశాలకు అలవాటు చేసి ఓ తల్లిలా వారందర్నీ తీర్చిదిద్దుతున్నారు. ఇసుకలోనే అక్షరాల దిద్దింపు ఇక్కడి చిన్నారులకు రాసుకునేందుకు పలకల్లేవు.. బ్లాక్ బోర్డూ లేదు. దీంతో ఆమె గోడపై నల్లరంగుతో బోర్డును ఏర్పాటు చేయించారు. విద్యార్థులు రాసుకునేందుకు ఒక చిన్న అట్టపెట్టెలో ఇసుకపోసి దానిపై వారితో అక్షరాలు దిద్దిస్తున్నారు. వంట గది చాలకపోవడంతో విద్యార్థుల కోసం ఆహార పదార్థాలను పాత కేంద్రాల్లోనే తయారుచేయించి ఈ కేంద్రానికి తీసుకొచ్చి వడ్డించేలా కృషి చేస్తున్నారు. ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే సమయంలో తమ కేంద్రం పేరును చాటి చెప్పేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ప్రదర్శనల్లో పాల్గొంటున్నారు. -
రమణమ్మే పిఠాపురం ఎంఈఓ
సాక్షి ఎఫెక్ ఇద్దరు ఎంఈఓల పద్ధతికి చెక్ పెట్టిన విద్యాశాఖ ఇన్చార్జి ఎంఈఓను తొలగిస్తూ ఆర్జేసీ ఆదేశాలు రమణమ్మను రానివ్వమన్న ఎమ్మెల్యే వర్మకు భంగపాటు పిఠాపురం : ఎక్కడా లేని విధంగా ఇద్దరు ఎంఈఓలను కొనసాగించిన పిఠాపురం మండల పరిషత్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు చుక్కెదురయింది. రెగ్యులర్ ఎంఈఓగా పనిచేసిన రమణమ్మనే కొనసాగించి, పూర్తి బాధ్యతలు అప్పగించాలని విద్యాశాఖ ఆర్జేసీ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇప్పటి వరకు ఆమెతో పాటు కొనసాగుతున్న ఇన్చార్జి ఎంఈఓ గాజుల సుబ్రహ్మణ్యంను ఎంఈఓ బాధ్యతల నుంచి తొలగించినట్లు డీవైఈఓ నాగేశ్వరరావు తెలిపారు. కాగా ఎట్టిపరిస్థితుల్లోనూ రమణమ్మను ఆమెను ఇక్కడ జాయిన్ కానివ్వమని పట్టుదలకు పోయి ఇన్చార్జి ఎంఈఓతో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎమ్మెల్యే వర్మకు ఇది భంగపాటేనని ఉపాద్యాయులు అంటున్నారు. పిఠాపురం ఎంఈఓగా పని చేస్తూ సెలవుపై వెళ్లిన రమణమ్మ సెలవు రద్దు చేసుకుని తిరిగి విధులకు రాగా ఆమెను చేర్చుకోవద్దంటూ ఎమ్మెల్యే వర్మ ఆదేశించడం అప్పట్లో ఉపాధ్యాయ వర్గాల్లో కలకలం రేపింది. ఉపాధ్యాయసంఘాల నేతలు ఎమ్మెల్యేతో జరిపిన సంప్రదింపులు ఫలించకపోవడంతో మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలో రమణమ్మ తిరిగి జూలై 21న విధులకు హాజరు కావడానికి రాగా ఆమెను జాయిన్ చేసుకోడానికి ఎంపీడీఓ నిరాకరించారు. ఈ విషయం ‘సాక్షి’ దినపత్రికలో ‘పాపం ఎంఈఓ’ శీర్షికన ప్రచురితమైంది. దానికి స్పందిం చిన జిల్లా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆమెను ఎంపీడీఓ జాయిన్ చేసుకున్నారు. అయినా ఎమ్మెల్యే సుముఖంగా లేకపోవడంతో బాద్యతలు అప్పగించకుండా ఇన్చార్జి ఎంఈఓగా విరవ హైస్కూలు హెచ్ఎం సుబ్రహ్మణ్యంని నియమించి విధులు నిర్వహింపజేస్తున్నారు. రమణమ్మ తనకు జరుగుతున్న అన్యాయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఇన్చార్జిని తొలగించి, తననే కొనసాగించాలన్న ఆర్జేసీ ఉత్తర్వులతో శనివారం విధుల్లో చేరినట్టు రమణమ్మ తెలిపారు. రమణమ్మకు పూర్తి బాధ్యతలు.. రమణమ్మను ఎంఈఓగా కొనసాగించాలని ఆర్జేసీ ఉత్తర్వులు ఇచ్చారని ఎంపీడీఓ సుబ్బారావు తెలిపారు. ఆర్జేసీఉత్తర్వుల మేరకు రమణమ్మకు పూర్తి బాధ్యతలు అప్పగించామని డీవైఈఓ నాగేశ్వరరావు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్య
మద్యానికి బానిసైన భర్త తరచు గొడవపడుతండటంతో.. మనస్తాపానికి గురైన వివాహిత ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని శివాలయ నగర్లో గురువారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న రమణమ్మ భర్త మద్యానికి బానిసై తరచు వేధిస్తుండటంతో.. మనస్తాపానికి గురై ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
ఉద్యోగం ఆశచూపి.. అమ్మేయాలనుకున్నాడు..
మలేషియాలో చాక్లెట్ కంపెనీలో ఉద్యోగమని చెప్పి తన భార్యను అమ్మడానికి ప్రయత్నించారని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులోఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలివీ.. ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామానికి చెందిన వెంకటసుబ్బారాయుడు, రమణమ్మలు భార్యాభర్తలు. వెంకట సుబ్బారాయుడు రైతు. వ్యవసాయం కలిసిరాక రూ.4.5 లక్షల వరకు అప్పు అయింది. దానిని తీర్చే దారి కానరాక సతమతమవుతున్నాడు. ఇదే సమయంలో ప్రొద్దుటూరుకు చెందిన ఏజెంటు సుభాన్‌వలీ పరిచయమయ్యాడు. భార్యాభర్తలకు మలేషియా చాక్లెట్ కంపెనీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించాడు. నెలకు చెరో రూ.20వేలు చొప్పన వస్తుందని చెప్పడంతో వారు నిజమేననుకున్నారు. ఈ ఒప్పందం మేరకు మళ్లీ అప్పుచేసి ఆ ఏజెంటుకు రూ.1.20 లక్షలు చెల్లించగా గత నెల 16వ తేదీన రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో మలేషియాకు పంపించాడు. అయితే, అక్కడికి వెళ్లిన తర్వాత.. టూరిస్టు వీసా ఇచ్చి ఏజెంటు మలేషియాకు పంపినట్లు అక్కడి తెలుగు వారు తెలపటంతో మోసపోయినట్లు గ్రహించారు. అనంతరం వలి పరిచయం చేసిన అక్కడి ఏజెంటు కృష్ణ ఆ దంపతులను తనతోపాటు తీసుకెళ్లి నిర్బంధించాడు. రమణమ్మను ఏజెంటు సుభాన్‌వలి తనకు రూ.60వేలకు అమ్మినట్లు కృష్ణ తెలిపాడు. అంతేకాకుండా రమణమ్మను పలురకాలుగా హింసించాడు. ఇది చూసి తట్టుకోలేక సుబ్బారాయుడు ఆత్మహత్యకు యత్నించాడు. వీరు మాట వినేలా లేరని గ్రహించిన కృష్ణ వదిలిపెట్టాడు. దీంతో వారు బంధువుల సహకారంతో మరో రూ.35 వేలను కృష్ణకు చెల్లించి తిరిగి గత నెల 27వ తేదీన స్వగ్రామానికి చేరుకోగలిగారు. ఈ విషయమై గురువారం బాధితులు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. -
తల్లి మృతి.. ఆగిన కుమార్తె పెళ్లి..
శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణమ్మ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వారం రోజుల్లో కూతురు పెళ్లి ఉండగా.. ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముతరాసుపల్లికి చెందిన జి. రమణమ్మ భర్త గతంలోనే మృతిచెందాడు. అన్నీ తానై కష్టపడుతున్న రమణమ్మ.. కూతురు పెళ్లి ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన మహిళలు తిరిగి వస్తుండగా.. వేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురు మహిళలను ఢీ కొట్టింది. దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమణమ్మ మృతిచెందింది.. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కుడిచేడు: ప్రకాశం జిల్లా కుడిచేడు మండలం పడమరవరదాయపాళెం గ్రామంలో విద్యుదాఘాతంతో ఓ మహిళ మృతి చెందింది. గ్రామానికి చెందిన రమణమ్మ(45) అనే మహిళ ఇంట్లో వంట చేస్తుండగా పై నుంచి కరెంట్ వైరు జారిపడి షాక్ కొట్టింది. ఈ సంఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి భర్త, ముగ్గురు పిల్లలు ఉన్నారు. -
కుటుంబ కలహాలతోనే తోడికోడళ్ల ఆత్మహత్య
గన్నవరం : పది రోజుల క్రితం ఆ కుటుంబంలో ప్రారంభమైన కలహాలకు తోడికోడళ్లు బలయ్యారు. కూలి పనులకు వెళ్లి వచ్చిన తోడికొడళ్లను అత్త గంటల తరబడి ఇంటి బయటే ఉంచడం గొడవలకు దారితీసింది. ఆ రోజు నుంచి వారిమధ్య కొనసాగిన వివాదం ఆత్మహత్యలకు ఉసికొల్పింది. ఇది మండలంలోని బుద్ధవరం శివారులో రాజీవ్‌నగర్ కాలనీలో జరిగిన తోడికోడళ్లయిన మురళీరమణమ్మ, ఝాన్సీల జంట ఆత్మహత్యలకు సంబంధించి పోలీసుల విచారణలో బంధువులు ఈ వివరాలు తెలియజేశారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. రెండు మృతదేహాలకు గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో తహశీల్దార్ ఎం.మాధురి పర్యవేక్షణలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించగా, వారు ఇళ్లకు తీసుకువెళ్లారు. బాల్య స్నేహితులు, తోడికోడళ్లయిన మురళీ రమణమ్మ, ఝాన్సి మృతదేహాలకు అంత్యక్రియలను కుటుంబసభ్యులు ఒకేసారి నిర్వహించారు. పదిరోజుల నుంచే.. ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసిమెలసి ఉంటున్నప్పటికి పదిరోజుల క్రితం ఇంటి వద్ద జరిగిన ఓ సంఘటన అత్త, తోడికొడళ్ల మధ్య చిచ్చుపెట్టింది. ఇద్దరూ కోడళ్లతో పాటు మట్టి పనికి వెళ్లిన అత్త ముందుగానే ఇంటికి చేరుకుంది. అయితే కొడళ్లు ఇంటికి వచ్చినప్పటికీ సుమారు మూడు గంటల పాటు తలుపు తీయకపోవడంతో బయటే వేచి ఉన్నారు. అత్త వైఖరితో వారు విభేదించారు. అప్పటి నుంచి వీరిపై అత్తతో పాటు మామ వేధింపులు మొదలయ్యాయి. క్రమంగా వీరిమధ్య దూరం పెరిగి తరచూ గొడవలు చోటు చేసుకున్నాయి. చివరకు అత్త చిత్రహింసలు తాళలేక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. లొంగిపోయిన అత్తమామలు కోడళ్ల ఆత్మహత్యకు కారకులైన అత్తమామలు నక్కా భూలక్ష్మి, వెంకటేశ్వరరావులు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిని పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం. -
అత్తమామలే కాలయములు
అత్తమామల వేధింపుల కారణంగా ఇద్దరు తోడికోడళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. ఏడు నెలల క్రితమే కోటి ఆశలతో అత్తవారి ఇంట అడుగుపెట్టిన ఈ ఇద్దరూ గర్భం దాల్చిన కొద్దిరోజులకే అర్ధాంతరంగా తనువుచాలించడం అందరినీ కలచివేసింది. బుద్దవరం శివారు రాజీవ్‌నగర్‌కాలనీలో ఈ విషాధ ఘటన చోటుచేసుకుంది. గన్నవరం : అత్తింటివారి వేధింపులకు ఒకే కుటుంబంలోని ఇద్దరూ తోడికోడళ్లు బలైపోయారు. వివాహం అనంతరం కోటి ఆశలతో మెట్టినింటికి వచ్చిన వారిని సొంత కూతుళ్ల వలే సాకవలసిన అత్తమామలే వారి పాలిట కాలయముల య్యారు. నిత్యం వారిని మానసికంగా చిత్రహింసలకు గురిచేశారు. వీరి వేధింపులు తాళలేక, పుట్టింటి వారికి చెప్పుకున్నా ప్రయోజనం లేక, భర్తల సానుభూతి లేక, ఏడు నెలల వివాహ జీవితాన్ని ముగించుకుని గర్భిణులుగానే వారిద్దరూ తనువులు చాలించారు. ఇంటి దూలానికి ఉరివేసుకుని అనుమానాస్పద స్ధితిలో కలిసి మృతి చెందడం అందరినీ కంటతడి పెట్టించింది. ఈ విషాదకర సంఘటన మండలంలోని బుద్దవరం శివారు రాజీవ్‌నగర్ కాలనీలో బుధవారం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లిచేసుకుని... రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన మురళీ రమణమ్మ(20)ను బంధువైన అదే ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు నక్కా రాం బాబు గత ఏడాది మే నెలలో ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లిచేసుకున్నాడు. అతడి సోదరుడైన శివ కూడా మరో వారం వ్యవధిలోనే అదే కాలనీకి చెందిన ఝాన్సీ(19)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వివాహ అనంతరం కొంతకాలం పాటు వీరితో అత్తమామలు భూలక్ష్మి, వెంకటేశ్వరరావు కలిసి ఉన్నారు. వేధింపులే ఉసురు తీశాయి.. వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చినప్పటికి ఒకే ఇంటిలో కాపురం ఉంటున్న రమణమ్మ, ఝాన్సీ సొంత అక్కాచెల్లెలు మాదిరిగా కలిసిమెలసి ఉంటున్నారు. దీనిని చూసి ఓర్వలేని అత్తమామలు వీరిపై అక్కసు పెంచుకున్నారు. గర్భిణులనే కనికరం కూడా లేకుండా వీరిని చీటికీమాటికీ మాటికీ దూషిస్తూ వేధింపులకు గురిచేస్తున్నారు. ఈ విషయమై భర్తలకు చెప్పినప్పటికి అత్తమామలు చెప్పినట్లు సర్దుకుపొమ్మని నచ్చజెప్పారు. కోడళ్లను వేధించవద్దని రెండు కుటుంబాల వారు, పెద్దలు కూడా పలుమార్లు వెంకటేశ్వరరావు దంపతులకు చెప్పా రు. వారు ఆ మాటలను పెడచెవిన పెట్టి కోడళ్లను మరింతగా వేధించసాగారు. మానసికంగా కుంగిపోయి అత్తమామలు నిత్యం వేధిస్తుండటాన్ని తోడికోడళ్లు తట్టుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి అత్తమామలతో చోటు చేసుకున్న వివాదం కారణంగా సమీపంలోని రమణమ్మ పుట్టిం టికి వెళ్లిపోయారు. అయితే వీరిద్దరి కుటుంబ సభ్యులు ఓదార్చి తిరిగి అత్తిం టికి తీసుకువచ్చి అప్పగించారు. చెప్పపెట్టకుండా పుట్టింటికి వెళ్లడంపై వీరిని అత్తమామలు మానసికంగా మరింత చిత్రహింసలకు గురిచేశారు. పెళ్లిఫొటోలు చూసుకుని.. అత్తింటి వేధింపులు తాళలేక తోడికోడళ్లు ఇద్దరూ ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని స్థానికులు పేర్కొంటున్నారు. వీరు ఉరివేసుకుని ఉన్న గదిలో వీరి పెళ్లిఫొటోలు పడి ఉం డడం కనిపించింది. ఈ ఘటన జరగక ముందు చివరిసారిగా పెళ్లిఫొటోలు చూసుకుని ఉండవచ్చని భావిస్తున్నారు. ఇరువురు పక్కపక్కనే ఇంటి దూలానికి ఓణీలతో ఉరివేసుకుని మృతి చెంది ఉండడం అందరినీ కలచివేసింది. ఈ ఘటనపై మృతుల పుట్టింటివారు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో విషాదం.. తోడికోడళ్ల మృతితో కాలనీలో విషాదం నెలకొంది. రమణమ్మ మృతదేహం వద్ద తల్లి ఏసు మరియమ్మ, తల్లి లేని ఝాన్సి భౌతికకాయం వద్ద ఆమె కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. -
వైఎస్సార్ సీపీ నేతపై హత్యాయత్నం
కదిరిరూరల్ : ముదిగుబ్బ మండలం మొలకవేమల సర్పంచ్ రమణమ్మ భర్త, వైఎస్సార్ సీపీ నేత వెంకటరమణపై గురువారం నాగారెడ్డిపల్లి బ్రిడ్జి దగ్గర హత్యాయత్నం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. వెంకటరమణ తన గ్రామానికి చెందిన చంద్రమోహన్‌రెడ్డితో కలిసి ఓ కేసు విషయమై కదిరి కోర్టుకు హాజరయ్యారు. కోర్టు పని ముగిసిన అనంతరం ఇద్దరు ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలు దేరారు. నాగారెడ్డిపల్లి బ్రిడ్జి దగ్గరకు రాగానే వెనుక నుంచి సుమో వాహనంలో వచ్చిన ప్రత్యర్థులు వీరు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొని వేగంగా ముందుకు వెళ్లిపోయూరు. ఈ ఘటనలో వెంకటరమణకు చేతులు, తల, కాళ్లకు బలమైన గాయాలయ్యాయి. చంద్రమోహన్‌రెడ్డి స్వల్పంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే.. తన రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేకే టీడీపీ నేత దేవేంద్ర, అతని అనుచరులే తనను హతమార్చాలని ప్రయత్నించినట్లు వెంకటరమణ ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో తాము వైఎస్సార్ సీపీ విజయం కోసం పనిచేశామని, ఇది జీర్ణించుకోలేని టీడీపీ నేతలు ఈ ఘాతుకానికి పూనుకున్నారని తెలిపారు. -
‘డ్వాక్రా రుణాలు మాఫీ చేయాలి’
గంట్యాడ : డ్వాక్రా రుణాలను వెంటనే మాఫీ చేయాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘ జిల్లా అధ్యక్షురాలు బాయి రమణమ్మ డిమాండ్ చేశారు. నీలావతి ఎస్సీ కాలనీలో డ్వాక్రా మహిళలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ మేరకు రుణాలు రద్దు చేయాలని కోరుతూ మహిళల నుంచి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాలని కోరారు. రుణాల మాఫీ విషయంలో టీడీపీ ప్రభుత్వం రోజుకో మాట చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీ చేసేవరకూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని చెప్పారు. అందులోభాగంగానే సంతకాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్. పరదేశమ్మ, బి. ఎల్లమ్మ, ఆర్. ముత్యాలమ్మ, దాలమ్మ, టి. పరదేశి, తదితరులు పాల్గొన్నారు. -
రమణమ్మ.. నీదెంత పెద్ద మనసమ్మా!
బొబ్బర లంక: అనుకున్నది సాధించాలంటే ఎంతో ఆత్మవిశ్వాసం... అంతకుమించి దాన్ని సాధించేందుకు ధృడ సంకల్పం అవసరం. సమాజానికి సేవ చేయాలంటే ఎంతో పెద్దమనసు కావాలి. బతుకుదెరువు కోసం చిరువ్యాపారం చేసుకునే ఓ వృద్ధురాలు తోటి ప్రజల కోసం తను కూడబెట్టినదంతా కరిగించింది. సేవ చేయాలంటే అధికారమో, డబ్బో అవసరంలేదని సాటి మనిషికి సాయమందించాలనే తాపత్రయం ఉంటే చాలని చాటిచెప్పింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం బొబ్బర లంకలో నివసించే రమణమ్మ... చిరుతిళ్లు, గుగ్గిళ్లు, ఒడియాలు అమ్ముకుంటూ జీవిస్తోంది. భర్త వదిలేయడంతో అక్క, తమ్ముళ్లతో కాలం వెళ్లదీసేది. ఒక్కరోజూ చేసే పనికి దూరమయ్యేది కాదు రమణమ్మ. చిన్న సంఘటనతో తమ్ముడు ఆమెను విడిచి ఎక్కడికో వెళ్లిపోయాడు. తమ్ముడికోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది. అతడు మాత్రం తిరిగిరాలేదు, ఏమయ్యాడో తెలియలేదు. ఎండైనా...వానైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా గుగ్గిళ్లు, ఒడియాలు అమ్మడం మానలేదు రమణమ్మ. రాజమండ్రిలోని గౌతమీ జీవకారుణ్య సంఘానికి విరాళంగా ఇస్తే... పిల్లలకు భోజనం పెడతారని ఎవరో చెప్పారామెకు. తాను కూడబెట్టిన డబ్బులో 30వేలు ఆ సంస్థకు విరాళంగా ఇచ్చేసింది. గ్రామంలో చిరుతిళ్లు అమ్మే వృద్ధురాలు 30 వేలు ఓ సంస్థకు విరాళం ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. రమణమ్మ ఆశయం అక్కడితో ఆగిపోలేదు. మళ్లీ రూపాయి, రూపాయి కూడబెట్టడం మొదలు పెట్టింది. లక్షరూపాయలు వరకూ కూడబెట్టింది. గ్రామపెద్దను కలిసి, ఊళ్లో బస్టాపు నిర్మించాలని కోరింది. ఆమె ఆశయాన్ని తెలుసుకున్న గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రెక్కలు ముక్కలు చేసుకుని తమ కళ్లముందు కష్టపడిన వృద్ధురాలు గ్రామానికి చేస్తున్న సహాయం చూసి చలించిపోయారు. ఆమె కోరిక మేరకు ఒక్క పైసా వృథా కాకుండా గ్రామంలో బస్టాప్ నిర్మించారు. జీవితమంతా కష్టపడి సంపాదించిన సొమ్ముతో నిర్మించిన బస్టాండుకు తాను ఎంతగానో అభిమానించిన తమ్ముడి పేరు పెట్టుకుంది రమణమ్మ. జీవిత చరమాంకంలో తనకుంటూ పైసా కూడా ఉంచుకోకుండా గ్రామంకోసం ఖర్చుపెట్టడంపై ఆనందంవ్యక్తం చేస్తోంది. ఎండలో ప్రయాణికులు ఇబ్బందిపడకుండా ఉండేందుకే బస్ షెల్టర్ ఏర్పాటు చేశానని చెపుతోంది. ఏడుపదులు పైబడిన వయసులోనూ రమణమ్మ తన పనులు తానే చేసుకుంటోంది. ఒంటరిగా జీవిస్తూ గ్రామంలో తిరుగుతూ చిరుతిళ్లు అమ్ముతూనే ఉంది. ప్రభుత్వం నుంచి పెన్షన్ వస్తుంది కదా ఎందుకింకా కష్టపడతావని ఆమెను అడిగితే ఒకటే సమాధానం చెపుతుంది. పని చేయడం తనకు అలవాటని డబ్బు కూడపెడితే మరో మంచి పనికి ఆవి పనికి వస్తాయంటోంది. ఆమె ఆశయానికి గ్రామస్థులు కూడా సహకరిస్తున్నారు. ఏ ఆధారం లేని ఆ వృద్ధురాలికి అండగా ఉంటున్నారు. ఎదుటివారికి సహాయం చేయాలనే ఆలోచన ఏ కొద్దిమందికో ఉంటుంది. ఆలోచన వచ్చినా ఆచరణలో ఎందుకొచ్చిన కష్టంలే అని వదిలేసేవారే ఎక్కువమంది. కానీ వయసు మీదపడుతున్నా శరీరం సహకరించకున్నా ఇతరుల కోసం జీవితం ధారపోసే రమణమ్మలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు. అలాంటి వారికి ఆమె ఆదర్శనమడంలో సందేహం లేదు. -
రమణమ్మ.. నీదెంత పెద్ద మనసమ్మా!
-
విద్యుదాఘాతంతో రైతు మృతి
కొండాపురం, న్యూస్‌లైన్ : పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తూర్పుజంగాలపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరవలింగం ఎరుకలయ్య (55) శుక్రవారం పొలంలో వరినారు పోశాడు. శనివారం ఉదయం నారుమడిని చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ మోటారు వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. అయితే ఎరుకులయ్య మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు శ్రీను పొలం వద్దకు వెళ్లి చూడగా మోటారు వద్ద తండ్రి మృతి చెంది ఉండడాన్ని గుర్తించాడు. మృతుడికి భార్య రమణమ్మ, కుమారుడు శ్రీను ఉన్నారు.