తల్లి మృతి.. ఆగిన కుమార్తె పెళ్లి.. | The injured woman died in hospital | Sakshi
Sakshi News home page

తల్లి మృతి.. ఆగిన కుమార్తె పెళ్లి..

Published Sat, Jan 2 2016 1:03 PM | Last Updated on Wed, Apr 3 2019 7:53 PM

The injured woman died in hospital

శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రమణమ్మ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వారం రోజుల్లో కూతురు పెళ్లి  ఉండగా.. ఈ విషాదం చోటుచేసుకుంది. దీంతో పెళ్లి ఆగిపోయింది. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ముతరాసుపల్లికి చెందిన జి. రమణమ్మ భర్త గతంలోనే మృతిచెందాడు. అన్నీ తానై కష్టపడుతున్న రమణమ్మ..  కూతురు పెళ్లి ఘనంగా జరపాలని ఏర్పాట్లు చేసుకుంది. ఇంతలోనే ఈ విషాదం చోటు చేసుకుంది.
దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం సాయంత్రం పొలం వద్దకు వెళ్లిన మహిళలు తిరిగి వస్తుండగా.. వేగంగా దూసుకొచ్చిన లారీ ముగ్గురు మహిళలను ఢీ కొట్టింది.  దీంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు వారిని గుంటూరు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రమణమ్మ మృతిచెందింది.. మిగతా ఇద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement