Former died
-
కాటేసిన కరెంట్ తీగ
సిద్దిపేటరూరల్: అర్బన్ మండల పరిధిలోని తడ్కపల్లిలో విద్యుత్ షాక్‌తో కొమురయ్య అనే రైతు మృతి చెందాడు. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పెర్న కొమురయ్య అనే రైతు మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. గట్లపై తిరుగుతూ పొలాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఎప్పుడో తెగి కింద పడ్డ విద్యుత్ వైర్లు తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ ఏడీ శ్రీనివాస్ మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహరం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతునికి పెళ్లైన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
తిమ్మారెడ్డిగూడెం(మునగాల) : విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందాడు. ఈ ఘటన మునగాల మండలం తిమ్మారెడ్డిగూడెంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన బారెడ్డి వెంకట్‌రెడ్డి(45) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మధ్యాహ్నం తన పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లాడు. విద్యుత్ సరఫరా ఉన్నప్పటీకీ మోటారు నడవక పోవడంతో సమీపంలో ఉన్న ట్రాన్స్ఫార్మర్ వద్దకు వెళ్లి చూడగా ఎల్టీ లైన్ తెగి పడి ఉండడాన్ని గమనించాడు. తెగిన విద్యుత్ వైరును అమర్చేందుకు పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ను ఆపేందుకు ప్రయిత్నిస్తున్నాడు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ పైన ఉన్న హెవీలైన్‌ను నుంచి విద్యుత్ సరఫరా కావడంతో వెంకట్‌రెడ్డి విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెం దాడు. ఈ లోగా పక్కనే ఉన్న ఇద్దరు రైతులు వచ్చి వెంకట్‌రెడ్డిని కిందకు దించారు. ఎల్‌టీలైన్‌కు ఆనుకొని హెవీలైన్ ఉండడం మూలంగానే ఈ ప్రమాదం సంభవించిందని రైతులు తెలిపారు. మృతుడికి భార్య కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామ రెవెన్యూ అధికారి వారణాసి ఉషారాణి ఫిర్యాదు మేరకు మునగాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ షాక్ తో రైతు మృతి
నెల్లూరు: మోటర్ పెట్టడానికి వెళ్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన నెల్లూరు జ్లిలా కోట మండలం కార్లపుడిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోతుగుంట మానయ్య(48) మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా.. అదే సమయంలో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి పడటంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వలిగొండ : ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ యువరైతు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం నల్లగొండ జిల్లా వలిగొండ మండలం పొద్దుటూరు గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన లింగస్వామి(24) బుధవారం పొలం దగ్గర ఉన్న ట్రాన్స్ఫార్మర్ను పరిశీలిస్తుండగా ప్రమాదవ శాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. లింగస్వామికి ఇంకా వివాహం కాకపోవడం, చేతికంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. లింగస్వామి మృతితో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. -
విద్యుధ్ఘాతంతో రైతు మృతి
నిజామాబాద్: పొలానికి నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతు ప్రమాదవశాత్తూ విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందిన సంఘటన నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం వెంకటాపురం గ్రామంలో గురువారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన గంగి వీరన్న(60) ఈరోజు ఉదయం పొలానికి నీళ్లు కట్టడానికి బావి వద్దకు వెళ్లాడు. పంపు పనిచేయకపోవడంతో దాన్ని సరిచేయడానికి ప్రయత్నించగా ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కరీంనగర్: విద్యుత్‌షాక్‌తో వ్యక్తి మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ప్రభాకర్‌రెడ్డి(43) బావి వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ తీగలు తాకడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. -
విద్యుత్ షాక్‌తో రైతు మృతి
నాగార్జునసాగర్ : పొలంలో తెగిపడిన విద్యుత్ తీగ ఓ రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన యువ రైతు పి.వేణు(22) బుధవారం ఉదయం తన పొలంలో మందు చల్లుతున్నాడు. పొలంపై నుంచి వెళ్లే హైటెన్షన్ విద్యుత్ లైను తీగ తెగి కింద పడింది. అయితే వేణు దాన్ని చూసుకోకుండా తాకాడు. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
అమ్రాబాద్: వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా అమ్రాబాద్ మండలంలో చోటుచేసుకుంది. వివరాలు..మండలంలోని బిట్లగుంట గ్రామానికి చెందిన పల్లె ఎద్దులు (48) అనే రైతు వేరుశెనగ సాగు చేస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున పొలానికి నీరు పెట్టేందుకు బావి దగ్గరకు వెళ్లాడు. మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుదాఘాతంతో ఎద్దులు అక్కడికక్కడే మృతి చెందాడు. -
యువకుడిని బలిగొన్న వ్యవసాయ యంత్రం
రాయదుర్గం: అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు వ్యవసాయ యంత్ర పరికరం కింద పడిప్రాణాలు కోల్పోయిన ఘటన కనేకల్ మండలం తుమ్మిగనూరు గ్రామంలో ఆదివారం సంభవించింది. బాబూరావు (17) అనే యువకుడు ఆదివారం ఉదయం పొలంలో పప్పు నూర్పిడి యంత్రం వద్ద పనిచేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆ యువకుడు అక్కడే తుదిశ్వాస విడిచాడు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో చోటుచేసుకుంది. బక్కసట్ల చిన్న కొమరయ్య(28) అనే రైతు మృతిచెందాడు. వివరాలు.. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన కొమరయ్య బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం బావి దగ్గరకు వెళ్లాడు. బావిలో పూడిక తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో రైతు చిన్న కొమరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కొమరయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. -
ఇంజక్షన్ వికటించి రైతు మృతి
కొత్తూరు : ఇంజెక్షన్ వికటించి ఓ రైతు మృతి చెందగా అందుకు కారణమైన పీంఎంపీని గ్రామస్తులు పంచాయతీ కార్యాలయంలో ఐదు గంటలపాటు నిర్బంధించారు. చివరకు పోలీసుల జోక్యంతో విడుదల చేసి ఆపై అదుపు లోకి తీసుకున్నారు. గ్రామస్తుల కథనం ప్రకారం... కొత్తూరు మండలం మామిడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నసురుల్లాబాద్‌కు చెందిన బోడ యాదయ్య (45) వృత్తిరీత్యా వ్యవసాయదారు. ఈయనకు భార్య నర్సమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. సమీపంలో తమకున్న రెండెకరాల పొలంలో ప్రస్తుతం మొక్కజొన్న పంట సాగు చేస్తున్నాడు. కొన్ని నెలల నుంచి ఆస్తమాతో బాధ పడుతున్నాడు. దీంతో అప్పుడప్పుడు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకుంటున్నాడు. ఇది లాఉండగా ఐదు నెలలుగా ఫరూఖ్‌నగర్ మండలం విఠ్యాలకు చెందిన ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్ (పీఎంపీ) యాదగిరి శ్రీనివాసులుగూడ, మజీద్మామిడిపల్లి, నసురుల్లాబాద్‌లో పర్యటిస్తూ అనారోగ్యానికి గురైన వారికి ప్రథ మ చికిత్స చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు నసురుల్లాబాద్‌కు రాగా యాదయ్య తన వద్ద ఉన్న ఇంజక్షన్ (వాయిల్) ను ఇవ్వాల్సిందిగా పీఎంపీని కోరాడు. అది ఇచ్చిన పది నిమిషాల్లోనే మృతి చెందగా, ఆగ్రహించిన బంధువులు, గ్రామస్తులు అతనిపై దాడి చేసి ఒంటి గంట నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు గ్రామపంచాయతీ కార్యాలయంలో నిర్బంధించారు. అనంతరం ఎస్ఐ సీహెచ్ రాజు సంఘటన స్థలానికి చేరుకుని ఆందోళన కారులతో మాట్లాడి పీఎంపీని అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పీఎంపీని వివరణ కోరగా బాధితుడు అంతకుముందు అదే ఇంజక్షన్ తీసుకున్నట్లు తెలపడంతో మళ్లీ ఇచ్చానని, అంతేతప్పా తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
కొండాపురం, న్యూస్‌లైన్ : పొలంలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని తూర్పుజంగాలపల్లిలో జరిగింది. స్థానికుల కథనం మేరకు గ్రామానికి చెందిన అరవలింగం ఎరుకలయ్య (55) శుక్రవారం పొలంలో వరినారు పోశాడు. శనివారం ఉదయం నారుమడిని చూసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో విద్యుత్ మోటారు వద్దకు వెళ్లడంతో ప్రమాదవశాత్తు అక్కడ ఉన్న విద్యుత్ తీగలు తగిలి మృతి చెందాడు. అయితే ఎరుకులయ్య మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంటికి రాకపోవడంతో ఆయన కుమారుడు శ్రీను పొలం వద్దకు వెళ్లి చూడగా మోటారు వద్ద తండ్రి మృతి చెంది ఉండడాన్ని గుర్తించాడు. మృతుడికి భార్య రమణమ్మ, కుమారుడు శ్రీను ఉన్నారు.