మోటర్ పెట్టడానికి వెళ్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన నెల్లూరు జ్లిలా కోట మండలం కార్లపుడిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.
నెల్లూరు: మోటర్ పెట్టడానికి వెళ్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతి చెందిన సంఘటన నెల్లూరు జ్లిలా కోట మండలం కార్లపుడిలో శుక్రవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పోతుగుంట మానయ్య(48) మోటర్ పెట్టడానికి వ్యవసాయ బావి వద్దకు వెళ్తుండగా.. అదే సమయంలో 11 కేవీ విద్యుత్ తీగలు తెగి పడటంతో విద్యుత్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.