
కొమరయ్య మృతదేహం
సిద్దిపేటరూరల్: అర్బన్ మండల పరిధిలోని తడ్కపల్లిలో విద్యుత్ షాక్‌తో కొమురయ్య అనే రైతు మృతి చెందాడు. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పెర్న కొమురయ్య అనే రైతు మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. గట్లపై తిరుగుతూ పొలాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఎప్పుడో తెగి కింద పడ్డ విద్యుత్ వైర్లు తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ ఏడీ శ్రీనివాస్ మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహరం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతునికి పెళ్లైన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.