komaraiah
-
కాటేసిన కరెంట్ తీగ
సిద్దిపేటరూరల్: అర్బన్ మండల పరిధిలోని తడ్కపల్లిలో విద్యుత్ షాక్‌తో కొమురయ్య అనే రైతు మృతి చెందాడు. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన పెర్న కొమురయ్య అనే రైతు మంగళవారం ఉదయం పొలం వద్దకు వెళ్లాడు. గట్లపై తిరుగుతూ పొలాన్ని పరిశీలిస్తున్న సమయంలో ఎప్పుడో తెగి కింద పడ్డ విద్యుత్ వైర్లు తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. విద్యుత్ ఏడీ శ్రీనివాస్ మృతుని కుటుంబానికి ప్రభుత్వం తరపున నష్టపరిహరం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. మృతునికి పెళ్లైన ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. -
అమ్మ, కొడుకు కలిసి.. ఉరేసి చంపేశారు!
జ్యోతినగర్: మద్యం తాగి వచ్చి వేధిస్తున్నాడని ఓ వ్యక్తిని అతని భార్య, కుమారుడే ఉరేసి చంపేశారు. కరీంనగర్ జిల్లా రామగుండం ఎన్టీపీసీ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈనెల 27వ తేదీన జరిగిన హత్య కేసును ఛేదించిన పోలీసులు ఈ విషయాన్ని వెల్లడించారు. సీఐ వాసుదేవరావు తెలిపిన వివరాలివీ... రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలో కొమురయ్య అనే సింగరేణి కార్మికుడు నివాసం ఉంటున్నాడు. మద్యం తాగే అలవాటున్న కొమురయ్య రోజూ భార్య, పిల్లలను వేధిస్తున్నాడు. దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న భార్య వినోద, కుమారుడు సాయికుమార్ కొమురయ్యను మట్టుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 27వ తేదీ రాత్రి మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కొమురయ్యను వారిద్దరూ కలిసి కొట్టి, అనంతరం ఉరేసి చంపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించటంతో నిజం వెలుగులోకి వచ్చింది. నిందితులను శుక్రవారం రిమాండ్‌కు పంపారు. -
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
కరీంనగర్ జిల్లా: అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం శంకరపట్నం గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పంటు కొమురయ్య(65)కు ఎనిమిదెకరాల పంట భూమి సాగు చేయటానికి రూ. 11 లక్షల 50 వేలు అప్పు చేశాడు. దీనికి తోడు కుమారుడు శ్రీనివాస్ చికిత్స నిమిత్తం అప్పులు చేశాడు. పంట దిగుబడి తగ్గడంతో పాటు రెండెకరాల్లో పంట ఎండిపోయింది. దీంతో అప్పులు తీర్చే దారిలేక మనస్తాపం చెందిన కొమురయ్య మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనను చికిత్స నిమిత్తం కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కొమురయ్య బుధవారం ఉదయం మృతి చెందాడు. ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. -
సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం: ఒకరి మృతి
బెల్లంపల్లి: ఆదిలాబాద్ జిల్లా ఖాసీపేట మండలం దేవాపూర్ గ్రామంలోని ఓరియెంట్ సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ కార్మికుడు మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం ఉదయం కోల్ వాషరీ ప్రదేశం వద్ద కార్మికులు పనిచేస్తుండగా... ప్రమాదవశాత్తూ కిందపడి కొమరయ్య అనే కార్మికుడు మృతి చెందాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడడంతో కంపెనీకి సంబంధించిన ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పరిహారం చెల్లించాలంటూ మృతుడు కొమరయ్య కుటుంబ సభ్యులు కంపెనీ ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు. -
'బెదిరింపులకు భయపడేది లేదు'
హైదరాబాద్: ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపినందుకే తనను చంపుతామని బెదిరిస్తున్నారని శాసనమండలిలో ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ పేర్కొన్నారు. వారి బెదిరింపులకు భయపడేది లేదని ఆయన అన్నారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటానని చెప్పారు. కొమరయ్య అనే రైతు అడిగితే ఆయనను జైల్లో పెట్టారన్నారు. నిన్నసీఎం కేసీఆర్, పంచాయతీ రాజ్ శాఖ, ఐటీ శాఖ మంత్రి, కేటీఆర్‌లపై మాట్లాడినందుకే తనను చంపుతామని కాల్స్ వస్తున్నాయని తెలిపారు. బెదిరింపు కాల్స్‌పై ఫిర్యాదుచేస్తే ఏ ఒక్క పోలీస్ మమ్మల్ని అడగలేదని విమర్శించారు. దీన్నిబట్టి బెదిరింపు కాల్స్ వెనుక ఉన్నది ఎవరో ప్రజలే అర్థం చేసుకోవాలని షబ్బీర్ అలీ చెప్పారు. -
ఆకాశవాణి టవర్ ఎక్కి వ్యక్తి హల్చల్
హైదరాబాద్ : అసెంబ్లీ ఎదుట ఉన్న ఆకాశవాణి కేంద్రంలో బుధవారం తెల్లవారుజామున ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. పక్కా ఇళ్లు నిర్మించాలన్న డిమాండ్‌తో భీమ్రావ్వాడ బస్తీకి చెందిన కొమరయ్య అనే వ్యక్తి టవర్ ఎక్కాడు. గతంలో భీమ్రావ్వాడ ఇళ్లను కూల్చేసిన విషయం తెలిసిందే. దీంతో అదే చోట పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చేంత వరకూ కిందకు దిగేది లేదని తేల్చి చెప్పాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని కిందికు దించే ప్రయత్నం చేస్తున్నారు.