వ్యవసాయ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్తు షాక్ తగిలి రైతు మృతిచెందిన సంఘటన కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలంలో చోటుచేసుకుంది. బక్కసట్ల చిన్న కొమరయ్య(28) అనే రైతు మృతిచెందాడు.
వివరాలు.. కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట మండలం సిరిసేడు గ్రామానికి చెందిన కొమరయ్య బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం బావి దగ్గరకు వెళ్లాడు. బావిలో పూడిక తీస్తున్న సమయంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగ కాలికి తగలడంతో రైతు చిన్న కొమరయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కొమరయ్యకు భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.
విద్యుదాఘాతంతో రైతు మృతి
Published Wed, Jan 21 2015 6:39 PM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM
Advertisement
Advertisement