రాయలసీమ నేపథ్యంలో... | Siddannagattu movie first look motion poster release | Sakshi
Sakshi News home page

రాయలసీమ నేపథ్యంలో...

Published Tue, Aug 16 2022 4:08 AM | Last Updated on Tue, Aug 16 2022 4:08 AM

Siddannagattu movie first look motion poster release - Sakshi

సుమన్, అక్సా ఖాన్, శ్రీను ముఖ్య తారలుగా మను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిద్ధన్న గట్టు’. ఎన్‌. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రుద్రవరం జేబీ, మధు, మహేష్‌ , మెహబూబ్, మీనాక్షీ రెడ్డి, వెంకట్రాముడు, చిన్న నరసింహులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫస్ట్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం మోషన్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సుమన్‌ మాట్లాడుతూ – ‘‘రాయలసీమ నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. నా ఏజ్, ఇమేజ్‌కి తగ్గట్టు ఈ చిత్రంలో నా పాత్రను మలిచారు’’ అన్నారు. ‘‘పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలనే కథాంశంతో ఈ చిత్రం     రూపొందించాం’’ అన్నారు మను. ‘‘కథ నచ్చి సినిమా నిర్మించాం’’ అన్నారు నేశినేని శ్రీనివాస్‌ రెడ్డి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement