రాజ్ తరుణ్ కొత్త చిత్రం.. ఆసక్తిగా టైటిల్ | Raj Tarun's PaanchMinar First Look Motion Poster | Sakshi
Sakshi News home page

Raj Tarun: రాజ్ తరుణ్ కొత్త చిత్రం.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్ పోస్టర్

Published Wed, Jan 1 2025 4:46 PM | Last Updated on Wed, Jan 1 2025 4:53 PM

Tollywood Hero Raj Tarun New Year Latest Movie Update

గతేడాది వరుస సినిమాలతో మెప్పించిన టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్. తిరగబడరా స్వామీ, భలే ఉన్నాడే లాంటి చిత్రాలతో అలరించారు. కొత్త ఏడాదిలో అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు హీరో. తన కొత్త సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్ మోషన్ పోస్టర్‌ వీడియోను విడుదల చేశారు.

ఈ చిత్రానికి పాంచ్ మినార్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రాశి సింగ్‌  హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్ కడుముల దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. పోస్టర్ చూస్తే ఫుల్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌ ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కాగా.. ఈ చిత్రంలో అజయ్ గోష్, బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు.  కనెక్ట్ మూవీస్ బ్యానర్‌పై గోవింద రాజు సమర్పణలో మాధవి, ఎంఎస్‌ఎం రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర  సంగీతమందిస్తున్నారు.

వివాదంలో రాజ్ తరుణ్..

అయితే సినిమాలతో పాటు అలరించిన రాజ్.. గతేడాదిలో ఓ వివాదంలోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే. తనను పెళ్లి చేసుకున్నాడని ఆరోపిస్తూ లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఆ వివాదం నడుస్తుండగానే తిరగబడరాసామీ మూవీ విడుదలైంది. ఈ వ్యవహారంలో మరో హీరోయిన్ మాల్వీ మల్హోత్రా పేరును కూడా లావణ్య ప్రస్తావించింది. తన వల్లే రాజ్ తరుణ్ దూరమయ్యాడని ఆరోపించింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో నడుస్తోంది. 


 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement