హైదరాబాద్: హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మనూ) బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్‌కు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. సోమవారం మనూ ఆరో స్నాతకోత్సవం సందర్భంగా వైస్ చాన్స్‌లర్ చేతుల మీదుగా షారుక్ ఖాన్ గౌరవ డాక్టరేట్‌ను అందుకున్నారు. షారుక్‌తో పాటు రేఖ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సంజీవ్ సరాఫ్‌కు మనూ గౌరవ డాక్టరేట్‌ను ప్రకటించింది.
మనూ నుంచి డాక్టరేట్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా షారుక్ ఖాన్ వ్యాఖ్యానించారు. మా తల్లిదండ్రులు ఉంటే చాలా సంతోషించేవారని.. తల్లి బర్త్ ప్లేస్ హైదరాబాదే అని షారుక్ గుర్తుచేసుకున్నారు.