స్కాట్లాండ్‌లోనూ డాక్టరే | Doctorate in Music for AR Rahman | Sakshi
Sakshi News home page

స్కాట్లాండ్‌లోనూ డాక్టరే

Published Sun, Feb 2 2014 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 3:15 AM

ఏఆర్ రెహ్మాన్

ఏఆర్ రెహ్మాన్

మన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్కాట్లాండ్‌లోనూ డాక్టర్ అయ్యా రు. 1990 తరువాత సంగీత రంగంలో ఒక ఆధునిక విప్లవానికి శ్రీకారం చుట్టిన సంగీత

 మన సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ స్కాట్లాండ్‌లోనూ డాక్టర్ అయ్యా రు. 1990 తరువాత సంగీత రంగంలో ఒక ఆధునిక విప్లవానికి శ్రీకారం చుట్టిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్. ఆయన స్వర పరచిన గీతాలు దేశ విదేశాల్లో మార్మోగుతున్నాయి. రెండు ఆస్కార్ అవార్డులను అవలీలగా గెలుచుకున్న రెహ్మాన్ గోల్డెన్ గ్లోబల్ పద్మభూషణ్ వంటి బిరుదలతో పాటు పలు ఫిలింపేర్ అవార్డులు, జాతీయ అవార్డులు వరించాయి. ఇప్పటికే పలు ప్రముఖ యూనివర్శిటీల నుంచి గౌరవ డాక్టరేట్ పురస్కారాన్ని అందుకున్న  రెహ్మాన్ తాజాగా స్కాట్లాండ్ దేశంలోనూ డాక్టరేట్‌ను అందుకోవడం విశేషం. స్కాట్లాండుకు చెందిన రాయల్ కేన్సర్ వేటిక్ సంస్థ ఇటీవల రెహ్మాన్‌కు గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించింది.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement