
రతన్ టాటాకు కెనడా యూనివర్శిటీ డాక్టరేట్
టొరంటో: దేశీ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాకు కెనడా యార్క్ యూనివర్శిటీ నుంచి గౌరవ డాక్టరేట్ లభించింది. టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్‌కు కొత్త ఆవిష్కరణలు(ఇన్నొవేషన్), కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్‌ఆర్) నిర్వహణకుగాను ప్రపంచ ప్రసిద్ధి చెందిన యార్క్ యూనివర్శిటీ నుంచి రతన్‌టాటా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఎల్లవేళలా సంప్రదాయ విజ్ఞానానికిమించిన వినూత్న ఆలోచనలు రతన్‌లో కనిపిస్తుంటాయని ఈ సందర్భంగా యూనివర్శిటీ ప్రొఫెసర్ డర్క్ మాటెన్ టాటాను ప్రశంసించారు.