
విదేశీయురాలికి కేయూ డాక్టరేట్
కేయూక్యాంపస్, న్యూస్‌లైన్ : ఇరాన్ దేశానికి చెందిన ఆజాదేదావోదీ ఫార్ కు కాకతీయ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రకటించింది. ఆమె కేయూ ఇంగ్లిష్ విభాగంలో పరిశోధకురాలిగా అడ్మిష న్ పొందారు. ‘కల్చరల్ కన్ఫిగరేషన్ అండ్ సోషల్ డిటర్మినేషన్ ఇన్ థామస్ హార్టీ వెస్సెక్స్ నావల్స్’ అనే అంశంపై సమర్పించిన పరిశోధనాత్మక సిద్ధాంత గ్రంథానికి డాక్టరేట్ ప్రదానం చేసినట్లు గురువారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ ఎంవీ.రంగారావు తెలిపారు. ఆమె ప్రొఫెసర్ రాజేశ్వర్ పర్యవేక్షణలో పరిశోధనను పూర్తిచేశారు. ఈ విభాగంలో పీహెచ్‌డీ సాధించిన మొదటి విదేశీ యురాలు ఆజాదేదావోదీ ఫార్ కావడం గమనార్హం.