లక్డీకాపూల్: ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టరేట్‌తో గౌరవించింది. యూనివర్సిటీ 22, 23 వార్షికోత్సవాల్లో భాగంగా నాగేశ్వర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ అయిన బిశ్వ భూషణ్ హరిచందన్ డాక్టరేట్ ప్రదానం చేశారు.
గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సందర్భంగా డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని గవర్నర్ సత్కరించారు. వైద్య వృతిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment