NTR health university VC
-
డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డికి ఎన్టీఆర్ వర్సిటీ డాక్టరేట్
లక్డీకాపూల్: ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్‌లోని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ డాక్టరేట్‌తో గౌరవించింది. యూనివర్సిటీ 22, 23 వార్షికోత్సవాల్లో భాగంగా నాగేశ్వర్‌రెడ్డికి ఆంధ్రప్రదేశ్ గవర్నర్, వర్సిటీ చాన్స్‌లర్ అయిన బిశ్వ భూషణ్ హరిచందన్ డాక్టరేట్ ప్రదానం చేశారు. గురువారం విజయవాడలోని రాజ్‌భవన్‌కు వచ్చిన సందర్భంగా డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డిని గవర్నర్ సత్కరించారు. వైద్య వృతిలో డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి నిబద్ధతకు ఈ అవార్డు మరో మైలురాయి వంటిదని గవర్నర్ అన్నారు. -
ఏపీలో తగ్గిన MBBS, BDS ఫీజులు
-
ఏపీలో తగ్గిన ఎంబీబీఎస్, బీడీఎస్ ఫీజులు
సాక్షి, విజయవాడ: ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిషన్ సూచనల మేరకు ఫీజులు తగ్గిస్తూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం జీఓ నెంబర్ 146ను జారీ చేసింది. దీంతో ప్రైవేట్ వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటా కింద వైద్య విద్య అభ్యసించే ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది. ఇందుకు సంబంధించిన ఫీజులు తగ్గిస్తూ ప్రభుత్వం ఆయా కోర్సుల ఫీజులను ఖరారు చేసింది. ప్రైవేట్, మైనార్టీ కాలేజీలకు ఇవి వర్తిస్తాయని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకూ ఎంబీబీఎస్‌కు ఐదేళ్ల ఫీజు వసూలు చేస్తుండగా, ఇకపై నాలుగున్నరేళ్లకు మాత్రమే తీసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తాజాగా నిర్ణయించిన ఫీజులు 2020-21 నుంచి 2022-23 వరకూ అమల్లో ఉంటాయని ఆయన వెల్లడించారు. కాగా, 17 ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, 14 డెంటల్ కాలేజీలకు ఈ ఫీజులు నిర్ణయించారు. ప్రైవేట్ వైద్య కళాశాలల్లో సూపర్ స్పెషాల్టీ కోర్సులకూ వీటిని ఖరారు చేశారు. ఏ ప్రైవేట్ కళాశాల అయినా సరే ఇతరత్రా ఫీజుల పేరుతో వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సింఘాల్ ఆ ఉత్తర్వుల్లో హెచ్చరించారు. అంతేకాక.. మెడికల్, డెంటల్ అభ్యర్థులకు విధిగా స్టైఫండ్ చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా రాష్డ్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియకి సిద్దమవుతున్నట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. తొలివిడత కౌన్సిలింగ్ని నాలుగైదు రోజులలో ప్రారంభిస్తామన్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకటి, రెండు రోజుల్లో విడుదల చేస్తామన్నారు. అలాగే ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకి ఎ,బి,సి కేటగిరీ ఫీజులు ఖరారు చేస్తూ ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమీషన్ సూచనల మేరకే నిర్ణయించామని తెలిపారు. (ప్రజాశక్తి కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్) ఎంబీబీఎస్ కన్వినర్ కోటా ఫీజు రూ.15 వేలగా నిర్ణయించగా... బి కేటగిరీ ఫీజు ఏటా రూ.12 లక్షలుగా.. ఎన్నారై కోటా ఫీజు రూ.36 లక్షలుగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఇక దంత వైద్య సీట్లకి కన్వినర్ కోటాకి రూ.13 వేలు, బి కేటగిరీకి రూ.4 లక్షలు, ఎన్నారై కోటాకి 12 లక్షల రూపాయిలుగా ఫీజులగా నిర్ణయించడం జరిగిందన్నారు. 2019-20 సంవత్సరంతో పోలిస్తే బీ, సీ కేటగిరి ఫీజులు తగ్గాయన్నారు. ఈ కొత్త ఫీజులు 2020-21 నుంచి 2022-23 విద్యా సంవత్సరం వరకు అమలులో ఉంటాయన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల ప్రక్రియని రెండు విడతలలో పూర్తి చేస్తామని.. రెండో విడత కౌన్సిలింగ్ ఈ నెలాఖరున లేదా వచ్చే నెల మొదటి వారంలో చేపట్టనున్నామని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. (ఏపీలో పెట్టుబడులకు తైవాన్ కంపెనీల ఆసక్తి) ఫీజుల వివరాలు: ►ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా కింద రూ.15వేలు ఫీజు ►బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.12లక్షల ఫీజు ►ఎంబీబీఎస్ కోర్సులో బి కేటగిరీకి 6.8లక్షల వరకు ఫీజు తగ్గింపు ►సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.36లక్షల ఫీజు ►ఎన్ఆర్ఐ కోటాలో రూ.16లక్షల వరకు ఫీజు తగ్గింపు ►బీడీఎస్ కోర్సు కన్వీనర్ కోటా కింద రూ.13వేలు ఫీజు ►బీడీఎస్- బి కేటగిరీ (మేనేజ్మెంట్) కోటా కింద రూ.4 లక్షల ఫీజు ►బీడీఎస్ (మేనేజ్మెంట్) కోటాలో రూ.7లక్షల వరకు ఫీజు తగ్గింపు ►బీడీఎస్ - సి కేటగిరీ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.12 లక్షల ఫీజు ►బీడీఎస్ (ఎన్ఆర్ఐ) కోటా కింద రూ.50 లక్షలకు పైగా ఫీజు తగ్గింపు -
రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్..
సాక్షి, విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): పీజీ (మెడికల్, డెంటల్) నీట్–2020లో అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల జాబితాను డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ డాక్టర్ పి.శ్యాంప్రసాద్ విడుదల చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ తో కలిసి ఆయన ఫలితాలు వెల్లడించారు. పీజీ మెడికల్ నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 11,635 మంది హాజరుకాగా, 6,600 మంది అర్హత పొందారని తెలిపారు. పీజీ డెంటల్ (ఎండీఎస్)కు ఆంధ్రప్రదేశ్ నుంచి హాజరైన 924 మందిలో 538 మంది అర్హత సాధించారన్నారు. అర్హత సాధించిన ఆంధ్రప్రదేశ్ అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు కోరతామన్నారు. అనంతరం ఒరిజినల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసి తుది మెరిట్‌లిస్టు వెల్లడిస్తామన్నారు. ఇందుకు సంబంధించి వచ్చేవారంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. కాగా, మెడికల్ కౌన్సెలింగ్లకు జీవో నెంబర్లు 550, 43 పై కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైన దృష్ట్యా, కౌన్సెలింగ్ ప్రక్రియ ఏ విధంగా నిర్వహించాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీ వేసిందని వీసీ తెలిపారు. కమిటీæ ఇచ్చే నివేదిక ఆధారంగా కౌన్సెలింగ్ ప్రక్రియ విధివిధానాలపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందన్నారు. మెడికల్, డెంటల్ రెండింటిలోనూ అమ్మాయిలే ఫస్ట్ కాగా జాతీయ స్థాయిలో నీట్లో మెడికల్, డెంటల్ రెండు విభాగాల్లోనూ రాష్ట్రంలో అమ్మాయిలే మొదటి స్థానం సాధించారు. మెడికల్‌లో చప్పా ప్రవల్లిక (రోల్ నెం: 2066161932) 41వ ర్యాంకు కైవసం చేసుకుంది. పీజీ డెంటల్ నీట్లో మెలేటి వెంకటసౌమ్య (1955226759) రెండవ ర్యాంకు కైవసం చేసుకుంది. (చదవండి: సంచలనమైన సీఎం జగన్ నిర్ణయం) -
హెల్త్ వర్సిటీ ఎదుట విద్యార్థుల ధర్నా
సాక్షి, విజయవాడ: ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపులో తమకు అన్యాయం చేశారంటూ అనేక మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నాయకులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమైక్య జాతీయ అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ యాదవ్ మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాల నుంచి 550 జీవో సక్రమంగా అమలు చేయకుండా, కౌన్సిలింగ్లో అవకతవకలకు పాల్పడి సుప్రీం కోర్టు జడ్జిమెంటును వీసీ ఉల్లంఘించారని ఆరోపించారు. ప్రభుత్వానికి పంపాల్సిన నివేదికల్లో సైతం సరైన వివరాలను ఇవ్వలేదనీ, వీసీని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏ ఒక్క రిజర్వేషన్ విద్యార్థికి అన్యాయం జరుగకుండా చూస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చాలన్నారు. తల్లిదండ్రులు స్పందిస్తూ పిల్లల మానసిక క్షోభకు వీసీనే కారణమని, రిజర్వేషన్ ప్రకారం రీ కౌన్సిలింగ్ నిర్వహించి సీట్లు కేటాయించాలని కోరారు. -
మెడికల్ కౌన్సిలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
-
మెడికల్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: మెడికల్ కౌన్సెలింగ్‌కు జెఎన్టీయూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ రవిరాజు వెల్లడించారు. బుధవారం రవిరాజు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... తెలంగాణ ఎంసెట్ రాసినా రెండు రాష్ట్రాల విద్యార్థలు ఈ కౌన్సెలింగ్‌కు హాజరుకావచ్చునని తెలిపారు. 85 శాతం లోకల్, 15 శాతం నాన్ లోకల్ ప్రకారం సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ఇప్పటికే వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్‌ను అప్లోడ్ చేశామని చెప్పారు. వాటిని పరిశీలించుకుని ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. మెడిసెట్ ర్యాంకుల ప్రకారమే సీట్లు భర్తి చేస్తున్నట్లు రవిరాజు వివరించారు. -
ఇరు రాష్ట్రాల్లోనూ ఎంసెట్ రాయాలి
విజయవాడ: తెలంగాణ, ఏపీ ఇరు రాష్ట్రాల్లోనూ వేర్వేరుగా ఎంసెట్ నిర్వహించనుండడంతో 15 శాతం అన్‌రిజర్వుడ్ సీట్ల కోసం విద్యార్థులు 2 ప్రవేశ పరీక్షలు రాయాల్సి ఉంటుందని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ డాక్టర్ టి.రవిరాజు తెలిపారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ రీజియన్లలోని మెడికల్ కళాశాలల్లో 85 శాతం సీట్లను ఆయా లోకల్ విద్యార్థులకు, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్ ఆధారంగా ఇతర రీజియన్లకు కేటాయించేవారు. అవిభాజ్య రాష్ట్రంలో ఒకే ఎంసెట్ ఉండేది. ఇప్పుడు రెండు రాష్ట్రాలూ వేర్వేరు ఎంసెట్లు నిర్వహిస్తుండడంతో అన్‌రిజర్వుడ్ మెరిట్ సీట్ల కోసం సొంత రాష్ట్రం నిర్వహించే ఎంసెట్‌తో పాటు తెలంగాణ విద్యార్థులు ఏపీ ఎంసెట్, ఏపీ విద్యార్థులు తెలంగాణ ఎంసెట్ రాయాల్సి ఉంటుందన్నారు. గతంలో మాదిరిగానే లోకల్, అన్‌రిజర్వుడ్ సీట్ల కేటాయింపు జరుగుతుందన్నారు. సాంకేతికంగా పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చని వీసీ అభిప్రాయపడ్డారు. ప్రెసిడెన్షియల్ రూల్ ప్రకారం ఇప్పటికీ సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల స్టేట్‌వైడ్ కళాశాలగానే ఉన్న దృష్ట్యా 64 శాతం సీట్లు ఏపీకి, 36 శాతం సీట్లు తెలంగాణ విద్యార్థులకు చెందనున్నాయి. మెడికల్ ఎంట్రన్స్‌కు సర్వం సిద్ధం 2015-16 విద్యా సంవత్సరానికి పీజీ వైద్య కోర్సుల్లో అడ్మిషన్లకు మార్చి 1న నిర్వహించే కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ ప్రవేశ పరీక్షకు అన్ని ఏర్పాట్లూ చేసినట్టు వీసీ రవిరాజు తెలిపారు. తెలంగాణ, ఏపీలకు సంయుక్తంగా ఒకే ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నారు. సుమారు 14 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్టు తెలిపారు. ఈ నెల 26 నుంచి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.డీఆర్‌ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్.ఓఆర్జీ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.