మెడికల్ కౌన్సిలింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తి | jntu cooperate with medical counselling, says Ravi raju | Sakshi
Sakshi News home page

Published Wed, Jul 29 2015 4:10 PM | Last Updated on Fri, Mar 22 2024 10:56 AM

మెడికల్ కౌన్సెలింగ్కు జెఎన్టీయూ సహకారంతో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీ రవిరాజు వెల్లడించారు. బుధవారం రవిరాజు హైదరాబాద్లో మాట్లాడుతూ... తెలంగాణ ఎంసెట్ రాసినా రెండు రాష్ట్రాల విద్యార్థలు ఈ కౌన్సెలింగ్కు హాజరుకావచ్చునని తెలిపారు. 85 శాతం లోకల్, 15 శాతం నాన్ లోకల్ ప్రకారం సీట్ల భర్తీ జరుగుతుందన్నారు. ఇప్పటికే వెబ్సైట్లో సీట్ మ్యాట్రిక్స్ను అప్లోడ్ చేశామని చెప్పారు. వాటిని పరిశీలించుకుని ఎక్కడ సీటు వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకోవచ్చని సూచించారు. మెడిసెట్ ర్యాంకుల ప్రకారమే సీట్లు భర్తి చేస్తున్నట్లు రవిరాజు వివరించారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement