డాక్టరేట్ గ్రహీత శర్మకు సన్మానం
డాక్టరేట్ గ్రహీత శర్మకు సన్మానం
Published Thu, Aug 11 2016 9:25 PM | Last Updated on Mon, Sep 4 2017 8:52 AM
తుని రూరల్ :
తుని మండలం వి.కొత్తూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 12 ఏళ్లు అధ్యాపకుడిగా పని చేసి, రసాయన శాస్త్ర విభాగంలో ఆంధ్ర విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్ పొందిన ఈరంకి సీతారామ సుబ్రహ్మణ్య శర్మను గురువారం ఘనంగా సన్మానించారు. కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ టి.సి.రవిచంద్రకుమార్ అధ్వర్యంలో అధ్యాపకులు, విద్యార్థులు సుబ్రహ్మణ్యశర్మను అభినందించారు. అంతకు ముందు పీజీ విద్యార్థులకు రసాయనశాస్త్రాన్ని బోధించే గెస్ట్ లెక్చరర్ల ఎంపిక ప్రక్రియను కాకినాడ పీఆర్ కళాశాల అధ్యాపకులు వి.మల్లికార్జున శర్మ, సుబ్రహ్మణ్యశర్మ పూర్తి చేశారు. గెస్ట్ లెక్చరర్లు పీజీలో క్రొమటోగ్రఫీ, సైక్లో అలే్కన్లు అంశాలను బోధిస్తారని ప్రిన్సిపాల్ తెలిపారు. అధ్యాపకులు వి.సత్యనారాయణ, గోవిందు, మురళి, సంతోషి పాల్గొన్నారు.
Advertisement