
ఏఎన్‌యూ(గుంటూరు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 37, 38వ స్నాతకోత్సవాలు కలిపి ఈనెల 20న నిర్వహించనున్నామని వీసీ ఆచార్య పి.రాజశేఖర్ తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని, ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేయనున్నామని పేర్కొన్నారు.
చాన్సలర్ హోదాలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పాల్గొంటారని తెలిపారు. స్నాతకోత్సవంలో పలువురికి డిగ్రీలు, బంగారు పతకాలు అందజేయనున్నామని వివరించారు. స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం వీసీ పలు కమిటీలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని కమిటీ సభ్యులకు సూచించారు. (క్లిక్: ‘చంద్ర’గ్రహణం వీడుతున్న కుప్పం)
Comments
Please login to add a commentAdd a comment