
సందడిగా స్నాతకోత్సవం
బాచుపల్లిలోని విజ్ఞాన జ్యోతి ఇన్సిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కాలేజీలో శుక్రవారం 22వ స్నాతకోత్సవం ఘనంగా జరిగింది.ప్రగతి లీడర్ షిప్ వైస్ చైర్మన్ అరుణ్ వకుల్ ముఖ్య అతిథిగా హాజరై పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా అరుణ్ వకుల్ మాట్లాడుతూ.. జీవిత ప్రయాణంలో ఐదు ముఖ్య సూత్రలు గుర్తుంచుకోవాలని సూచించారు.సేవ, మంచి ఉద్దేశ్యం,కార్యాచరణ, సృజనాత్మకత, ఉత్సాహం అనే సూత్రాలను తమ చేతి ఐదు వేళ్లుగా భావించాలన్నారు. ఈ ఐదు వేళ్లు కలిగిన చేయి జీవితంపై అవగాహన అనే జ్ఞాన జ్యోతిని వెలిగిస్తుందన్నారు. మొత్తం 161 మంది విద్యార్థులకు పట్టాలను ప్రదానం చేశారు. కాలేజీ ప్రైసిడెంట్ డిఎన్ .రావు తదితరులు పాల్గొన్నారు.
– జగద్గిరిగుట్ట