- హాజరుకానున్న 1451 మంది విద్యార్థులు
- వివరాలు వెల్లడించిన ఇన్‌చార్జి డైరెక్టర్ జీఆర్‌సీ రెడ్డి
3న నిట్ స్నాతకోత్సవం
Published Wed, Aug 31 2016 12:08 AM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM
కాజీపేట రూరల్ : కాజీపేటలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) 14వ స్నాతకోత్సవాన్ని సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి డైరెక్టర్ జీఆర్‌సీ రెడ్డి అన్నారు. నిట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
స్నాతకోత్సవానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు చెప్పారు. నిట్ స్నాతకోత్సవానికి ఫార్మర్ డైరెక్టర్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్, పద్మశ్రీ డాక్టర్ సంజయ్ గోవింద్‌దండేను ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. స్నాతకోత్సవానికి మొత్తం 1451 మంది విద్యార్థులు హాజరుకానున్నారని, ఇందులో పీహెచ్‌డీలో 40 మందికి, ఎంటెక్‌లో 613 మందికి, బీటెక్‌లో 798 మందికి డిగ్రీలు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నిశ్చల్‌ప్రసాద్ నుచ్చే ప్రధాన్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‌లో చమా వెంకటమంజునాథ రెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్‌లో కొండపర్తి సాయివిష్ణువర్థన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్‌లో కొల్లి శ్రీకాంత్ ప్రసాద్, మెటలార్జికల్ మెటిరీయల్స్ ఇంజనీరింగ్‌లో ఆలే శ్రావణి, కెమికల్ ఇంజనీరింగ్‌లో మన్వితసిరెడ్డి, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో రొబిన్ ఓమ్ నెహ్రా, బయోటెక్నాలజీలో ఐశ్వర్య. ఆర్‌కు బంగారు పతకాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. అలాగే నిట్ సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన నిశ్చల్ ప్రసాద్ నుచ్చే ప్రధాన్ ఆల్ నిట్ ఆల్ డిపార్ట్‌మెంట్లలో టాపర్‌గా నిలిచినందుకు గోల్డ్ మెడల్‌ను ప్రదానం చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో నిట్ రిజిస్ట్రార్ వైఎన్.రెడ్డి, డీన్ అకాడమిక్ ఎన్‌వీఎస్‌ఎన్. శర్మ, నిట్ పీఆర్‌ఓ ప్రాన్సిస్ సుధాకర్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement