తిరుపతి: శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీ(ఎస్వీయూ) స్నాతకోత్సవంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సోమవారం జరిగిన యూనివర్శిటీ స్నాతకోత్సవంలో ఒకరికి అందించాల్సిన పట్టాను మరొకరికి ప్రదానం చేయడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. దీంతో ఈ కార్యక్రమానికి హాజరైన గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ప్రతిష్టాత్మకంగా నిర్వహించే యూనివర్శిటీ స్నాతకోత్సవంలో అధికారులు వ్యవహరించిన తీరు సరిగా లేదంటూ నరసింహన్, వెంకయ్యలు అసంతృప్తి వ్యక్తం చేశారు.