
తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ నాలుగో స్నాతకోత్సవం అట్టహాసంగా జరిగింది. 22 మంది బంగారు పతకాలు సాధించగా.. వాళ్ల కుటుంబ సభ్యుల సందడితో మహతి ఆడిటోరియం వద్ద భావోద్వేగ దృశ్యాలు కనిపించాయి. ఈ కార్యక్రమంలో 564 మందికి డిగ్రీ, పీజీ.. మరో 75 మందికి పీహెచ్‌డీ పట్టాలు అందజేశారు. సంస్కృత భాష పరిరక్షణ.. భాషావృద్ధే లక్ష్యాలుగా ఈ వర్సిటీ అడుగులు వేస్తోంది.















