
తిరుపతి : తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో శనివారం రాత్రి పరంపర ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడి సంబరాల పేరుతో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకు న్నాయి

పలు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు నృత్య రూపకాలతో చక్కటి అభినయాన్ని ప్రదర్శించారు

అన్నమయ్య, త్యాగరాజ సంకీర్తనలకు లయబద్ధంగా నృత్యాభినయాలను ప్రదర్శిస్తూ అలరించారు











